Home /News /life-style /

weight loss tips: బరువు ఎక్కువగా ఉన్నారా? అయితే ఈ స్నాక్స్​ తింటే బరువును ఈజీగా కంట్రోల్​ చేయవచ్చు

weight loss tips: బరువు ఎక్కువగా ఉన్నారా? అయితే ఈ స్నాక్స్​ తింటే బరువును ఈజీగా కంట్రోల్​ చేయవచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీ డైట్‌లో తగినంత క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. పెరిగిన బరువును సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు. మరి బరువు పెరగకుండా ఉండేందుకు తక్కువ క్యాలరీలు నిండిన పలు స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    బిజీ లైఫ్​. చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

    ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం..

    ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి (Weight loss) వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు (weight loss tips) ఇస్తుంటారు. అయితే దానికోసం ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది. ఒక్కసారి బరువు పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే మీ డైట్‌లో తగినంత క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. పెరిగిన బరువును సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు. మరి బరువు పెరగకుండా ఉండేందుకు తక్కువ క్యాలరీలు నిండిన పలు స్నాక్స్ (Snacks) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    భోజనం తర్వాత

    అప్పడాలు (Appadalu) భోజనం తర్వాత వడ్డిస్తారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది గొప్ప ఛాయస్.. అప్పడాల్లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీకు ఆకలి వేసినప్పుడు వీటిని తినండి. వీటితో మీ బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. అయితే ఈ అప్పడాలను నూనెతో కాకుండా మాములుగా వేయించండి. ఉడకబెట్టిన కూరగాయలతో కూడా వీటిని తినొచ్చు.

    ఇడ్లీలతో బెటర్​..

    ఓట్స్, తురిమిన క్యారెట్‌లతో చేసిన ఇడ్లీ (Idly)లు చాలా ఆరోగ్యకరమైనవిగా వైద్యులు పరిగణిస్తారు. ఇది తక్కువ క్యాలరీల ఫుడ్. ఇవి తింటే మీ ఆకలి కూడా తీరుతుంది. బరువు పెరుగుతారన్న చింత కూడా ఉండదు. స్నాక్స్‌ (snacks)గా మాత్రమే కాదు లంచ్ లేదా డిన్నర్‌గా కూడా ఈ ఇడ్లీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా శెనగలు, మరమరాలు తక్కువ క్యాలరీలు కలిగిన స్నాక్. ఇవి మీ కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. మీ శక్తిని కూడా పెంచుతాయి. అలాగే వీటి వల్ల బరువు కూడా పెరగరు. మరో ఆలోచన కూడా లేకుండా.. మీకు ఆకలిగా అనిపిస్తే.. ఈ స్నాక్‌ను తీసుకోండి. ధోక్లా అనేది తక్కువ క్యాలరీల ఫుడ్. మైక్రోవేవ్‌ ద్వారా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తినండి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Weight loss tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు