హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight loss: జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గాలా? రోజులో కొద్దిసేపు ఈ వ్యాయామం చేస్తే చాలు

Weight loss: జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గాలా? రోజులో కొద్దిసేపు ఈ వ్యాయామం చేస్తే చాలు

మనం శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే... మంచి ఆహారం చాలా అవసరం. దానితోపాటు.. సరైన నిద్ర, శరీరానికి కొంత వ్యాయామం (Exercise) చాలా అవసరం. ఇవన్నీ ఉన్నప్పుడే.. మనం ఆరోగ్యంగా ఉండగలం.

మనం శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే... మంచి ఆహారం చాలా అవసరం. దానితోపాటు.. సరైన నిద్ర, శరీరానికి కొంత వ్యాయామం (Exercise) చాలా అవసరం. ఇవన్నీ ఉన్నప్పుడే.. మనం ఆరోగ్యంగా ఉండగలం.

ఈ రోజుల్లో సమయానికి తినకపోవడం వల్ల అధిక బరువు (weight) సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గించుకోవాలని (weight loss) చాలా ప్రయత్నాలే చేస్తారు. జిమ్​లకు వెళ్లడానికి సమయం ఉండదు. అయితే జిమ్‌ (gym)కి వెళ్లడం ఇష్టం లేక కొందరు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టరు. వ్యాయామం చేయాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. నిత్యం ఇంట్లోనే ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ జిమ్‌లో వ్యాయామం చేసిన ఫలితాలు పొందొచ్చు.

ఇంకా చదవండి ...

వ్యాయామాలు (Exercise) చేయడం ద్వారా శరీరం ఫిట్‌ (Fit)గా ఉంటుంది. ఈ రోజుల్లో సమయానికి తినకపోవడం వల్ల అధిక బరువు (weight) సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గించుకోవాలని (weight loss) చాలా ప్రయత్నాలే చేస్తారు. జిమ్​లకు వెళ్లడానికి సమయం ఉండదు. అయితే జిమ్‌ (gym)కి వెళ్లడం ఇష్టం లేక కొందరు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టరు. వ్యాయామం చేయాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. నిత్యం ఇంట్లోనే ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ జిమ్‌లో వ్యాయామం చేసిన ఫలితాలు పొందొచ్చు. మీ ఇంట్లోనే ఉదయం, సాయంత్రం కొంత సమయాన్ని కేటాయించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం ప్రారంభించడానికి ముందు కనీసం 7 నిమిషాల వార్మప్ (warm up) చేయండి. ఆ తర్వాత కొన్ని ప్రాథమిక స్ట్రెచెస్ చేయండి. అయితే, ఈ వ్యాయామాలు చేయడానికి ఉబకాయం, ఇతర వ్యాధులు (disease) ఉన్న వారు వైద్యుల సలహా తప్పనిసరి తీసుకోవాలి.

​​స్కిప్పింగ్..

శరీరం మొత్తానికి ఒకేసారి వ్యాయామం స్కిప్పింగ్ (skipping). ఇది గొప్ప కార్డియో వ్యాయామం. ఇది శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయటంతో పాటు వాటి మధ్య సమన్వయానికి తోడ్పడుతుంది. రోజూ స్కిప్పింగ్ చేయటం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌ (fit)గా తయారవుతుంది.

స్కిప్పింగ్‌తో ఎముకలు (bones) గట్టిపడటంతో పాటు చర్మం (skin)పై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి. బరువు తగ్గించటంలో, ఫిట్ గా ఉంచటంలో స్కిప్పింగ్ కీ (key) రోల్ పోషిస్తుంది. స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

మెదడు విశ్రాంతిగా ఉంటుంది..

మెదడు విశ్రాంతిగా ఉంటుంది. ఇది గుండె (heart) కు మంచి వ్యాయామం అని ఆరోగ్య నిపుణులు (experts) అంటున్నారు. అయితే, స్కిప్పింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల నొప్పి కలుగుతుంది, పాదాలకు పగుళ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది . కనుక స్కిప్పింగ్ చేసే సమయంలో బూట్లు (shoes) తప్పకుండా వేసుకోవాలి.

జాగ్రత్తలు (precautions) అవసరం..

స్కిప్పింగ్ చేసేటప్పుడు తాడు మీ ఎత్తుకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. తాడుకు మధ్యలో నిలబడి, మీ భుజాల కింద నుంచి తాడు పైకి తీసుకొస్తూ ఎగరాలి. స్కిప్పింగ్‌ చేయడంతో తరుచూ భుజాలు తిరుగుతుంటాయి. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి. చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది.

స్కిప్పింగ్ మొదట తక్కువగా ప్రారంభించి తరువాత క్రమంగా పెంచండి.  అలాగే అప్పుడప్పుడు చిన్నపాటి పరుగు, నడక కూడా మన బరువును తగ్గిస్తుంది. ఫిట్​గా ఉంటారు. ఇలా రెగ్యులర్​గా చేస్తే బరువు అదుపులో ఉంటుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

First published:

Tags: Exercises, Gym, Health Tips, Life Style, Weight loss