Egg Diet: అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఎగ్ డైట్ ఫాలో అవ్వండి.. ఫలితాలు అదరహో..

ప్రతీకాత్మక చిత్రం

Egg Diet: గుడ్లలోని తొమ్మిది రకాల ప్రోటీన్లు శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బీ కాంప్లెక్స్ విటమిన్లు మీ శరీర బరువు తగ్గించడానికి దోహదం చేస్తాయి. అందువల్ల, మీ రోజూవారి ప్రణాళికలో గుడ్లను ఇలా భాగస్వామ్యం చేసి ఎగ్డైట్ ప్లాన్ ను ఫాలో అవ్వండని నిపుణులు సలహాయిస్తున్నారు.

  • News18
  • Last Updated :
  • Share this:
ప్రస్తుతం మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఇది మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. బరువు పెరగడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, బద్దకంగా ఎక్కువసేపు కూర్చోవడం వంటివి వీటిలో కొన్ని ప్రధాన కారణాలు. సాధారణంగా కొన్ని ఆహారాలు తింటే బరువు పెరుగుతారు, మరికొన్ని ఆహారాలు తింటే బరువు తగ్గుతారు. అయితే, గుడ్లతో సులభంగా బరువు తగ్గవచ్చని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో ఉండే పోషకాలు అధిక బరువు నుండి మిమ్మల్ని రక్షిస్తాయని చెబుతున్నారు.

గుడ్లలోని తొమ్మిది రకాల ప్రోటీన్లు శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బీ కాంప్లెక్స్ విటమిన్లు మీ శరీర బరువు తగ్గించడానికి దోహదం చేస్తాయి. అందువల్ల, మీ రోజూవారి ప్రణాళికలో గుడ్లను ఇలా భాగస్వామ్యం చేసి ఎగ్డైట్ ప్లాన్ను ఫాలో అవ్వండని నిపుణులు సలహాయిస్తున్నారు. బరువు తగ్గడానికి నిర్దేశించబడిన ఈ ఎగ్-డైట్ ప్లాన్ రోజులో ఒక సంప్రదాయకరమైన అల్పాహారంగా తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతేకాక, గుడ్డు శరీరానికి మల్టీ మిటమిన్గా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

ఎగ్ డైట్ ఏమిటి...?

ప్రతీకాత్మక చిత్రం


ఎగ్ డైట్ తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ కేలరీలతో కూడిన డైట్ ప్లాన్. కానీ, దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శరీర కండరాల బరువు కోల్పోకుండా ఈ డైట్ ప్లాన్ రూపొందించబడింది. సహజంగా ప్రోటీన్లు పుష్కలంగా లభించే గుడ్ల ద్వారా కూడా అధిక బరువు నుంచి బయటపడటానికి ఈ ఎగ్డైట్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఈ డైట్ ప్లాన్లో నీరు లేదా సున్నా-క్యాలరీలు గల పానీయాలను కూడా తీసుకోవచ్చు. పిండి పదార్ధాలు, సహజ చక్కెరలలో కూడిన అధిక ఆహారం మాత్రం ఈ డైట్ నుండి మినహాయించబడుతుంది. ఈ డైట్ ను సాధారణంగా 14 నుంచి 21 రోజులు పాటు పాటించాల్సి ఉంటుంది. ఈ డైట్ మనం రోజూవారిగా తీసుకునే అల్పాహారం, భోజనం, విందు వంటి మూడింటి మీదా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ డైట్ ప్లాన్లో నీరు లేదా ఇతర సున్నా -క్యాలరీలు కలిగిన పానీయాలు తీసుకోవచ్చు. కానీ, స్నాక్స్ను మాత్రం చేర్చరాదు.

ఎగ్ డైట్ నిజంగానే బరువు తగ్గిస్తుందా..?

ఎగ్ -డైట్లో భాగంగా తక్కువ కేలరీలు గల ఆహారాన్ని తీసుకుంటాం. తద్వారా, మీరు క్రమంగా బరువు తగ్గవచ్చు. కానీ, ఈ డైట్లో ప్రోటీన్ మాత్రం ఎక్కువగా ఉంటుందని గుర్తించుకోండి. ఎందుకంటే గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాక, దీనిలో మినరల్స్, విటమిన్ బి12, ఐరన్, విటమిన్-డి వంటి పోషకాలను కూడా విరివిగా పొందవచ్చు. ఇవి బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తాయి. అయితే, అమితంగా గుడ్లు తినడం వల్ల జీర్ణ సమస్యల వచ్చే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలకు కారణం కావొచ్చు. అందువల్ల, ఈ డైట్ ప్లాన్ను అవలంభించే ముందు పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం. తద్వారా మీ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో ఇది సహాయపడుతుంది.
Published by:Srinivas Munigala
First published: