Weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే భోజనానికి ముందు ఇలా చేయండి.. మంచి ఫలితం ఉంటుంది

ప్రతీకాత్మ క చిత్రం

బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. అయితే భోజనం చేయడానికి ముందు సూప్​ తాగితే బరువు తగ్గుతారట. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

  • Share this:
    బరువు (weight) మనిషిని కూర్చోనివ్వదు. నడవనీయదు. ఉరుకుల పరుగుల జీవితంలో వేళకు తినడం లేదు మనిషి. కొందరు డైట్​లు, జిమ్(gym)​ల వంటివి ప్రయత్నించి ఉంటారు. అలాంటి వారిలో ఫలితాలు కనిపించినా.. సమయం లేక మధ్యలో వదిలేసిన వారి పరిస్థితి వేరు. బరువు తగ్గడానికి(weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం(food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు(tips) పాటిస్తే బరువు(weight) తగ్గుతారు. అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. అయితే భోజనం చేయడానికి ముందు సూప్​ తాగితే బరువు తగ్గుతారట. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

    బ్రేక్​ఫాస్ట్​తో..

    ప్రస్తుతం కాలంతో పాటు పరుగెత్తడంలో బిజీ అయిపోయి.. మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్‌ (break fast)కి దూరంగా ఉంటున్నారు. కానీ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మన శరీరానికి రోజు మొత్తానికి అవసరమయ్యే శక్తి లభిస్తుంది. రోజూ సరైన సమయానికి మనం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మనకు రోగాలు తక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ కూడా ఆరోగ్యకరమైనది అయితే మంచిది. బరువు అదుపులో ఉంచుకోవడానికి ఇది సహాయ పడుతుంది.

    సూప్​ తాగితే..

    ఓ సర్వేలో తేలిందేంటంటే భోజనం చేయడానికి గంట ముందు సూప్ (soup) తాగడం వల్ల ఆకలి తగ్గుతుందట. అయితే సూప్ అంటే ఏ ఇన్ స్టంట్ సూపో కాకుండా మీరే కూరగాయలను (vegetables) ఉడికించి తయారు చేసిన సూప్ అయితే మంచిది. ఇలా చేయడం వల్ల అవసరానికి మించి భోజనం (food) చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మీ పొట్ట కూడా నిండినట్లుగా ఉంటుంది.

    బరువు తగ్గడానికి (weight loss) చాలామంది ఏమీ తినకుండా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల అనర్థమే ఎక్కువగా జరుగుతుందని గుర్తుంచుకోవాలి. దీనికి బదులుగా బరువు తగ్గేందుకు ప్రతి రెండు, మూడు గంటలకోసారి తక్కువ మోతాదులో ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం (healthy food) తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గవు. పైగా ఆకలి పెంచే హార్మోన్ (Harmon) విడుదలవ్వకుండా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

    లవంగం టీ..

    మనం రోజూ వాడే మసాల దినుసులలో అతి ముఖ్యమైనది లవంగం (Clove).. అయితే ఇది కేవలం వంటల్లో నే కాకుండా.. బరువు తగ్గడంలోనూ (weight loss) సహాయ పడుతుంది. లవంగం టీ (Clove tea) రోజూ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయట. బరువు తగ్గడానికి చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. అయితే ఇలా ఇంటిలో తయారు చేసుకున్న లవంగం టీ (Clove tea)తో ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.
    Published by:Prabhakar Vaddi
    First published: