Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

Weight Loss Tips : శరీరంలో ఉండవలసిన దాని కంటే ఎక్కవుగా కొవ్వు ఉంటే.. లావుగా కనిపిస్తుంటారు. వాటిని కరిగించేందుకు నానా రాకలుగా ప్రయత్నింస్తుంటారు. కానీ అవి ఏవి వర్కౌట్ అవ్వవు. అయితే కింద చెప్పిన వాటిని ఫాలో అయితే వెంటనే బరువు తగ్గుతారు. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    Weight Loss Tips : శరీరంలో ఉండవలసిన దాని కంటే ఎక్కవుగా కొవ్వు ఉంటే.. లావుగా కనిపిస్తుంటారు. వాటిని కరిగించేందుకు నానా రాకలుగా ప్రయత్నింస్తుంటారు. కానీ అవి ఏవి వర్కౌట్ అవ్వవు. అయితే కింద చెప్పిన వాటిని ఫాలో అయితే వెంటనే బరువు తగ్గుతారు. వివరాలు ఇలా ఉన్నాయి.

    వాకింగ్ : బరువు తగ్గాలనుకుంటే ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల చక్కని ఫలితముంటుంది. రోజుకి ఒంట్లోని కేలరీలు కరిగించడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇందులో ముఖ్యంగా వాకింగ్ చేయడం వల్లహెల్దీ వెయిట్ సొంతమవ్వడమే కాకుండా మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల హైబీపీ, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా వాకింగ్ చేయాలి.

    Health Tips : మంచి ఆరోగ్యానికి 12 సూత్రాలు


    బ్రేక్‌ఫాస్ట్.. ప్రతీరోజూ మిస్‌కాకుండా ఉదయాన్నేహెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ శరీరంలోని జీవక్రియలను మెరుగుపరిచి బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

    ప్రోటీన్స్: హై ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషింస్తుంది. ఇందులోని పోషకాలు బరువు తగ్గించేందుకు మాత్రమే కాకుండా కండరాల బలాన్ని పెంచుతుంది. అదేవిధంగా.. ప్రోటీన్ మెటబాలిజం పెంపొందిస్తుంది. దీని వల్ల తక్కుగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.
    ఫైబర్ ఫుడ్ : ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ కారణంగా బెల్లీ ఫ్యాట్ తగ్గి స్లిమ్‌గా మారతారు. అదే విధంగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు ఖాళీగా ఉన్న ఫీలింగ్ రాదు.

    Kidney stones: కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా? ప్రతి రోజు ఉదయాన్నే ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతాయట


    నీరు తీసుకోవడం : నీటిని ఎక్కువగా తాగడం అనేది ఏ కాలంలో అయినా మంచిదే. మన శరీరంలో పేర్కొన్న వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల కేలరీస్ కరిగి బరువు తగ్గుతారు.

    సరైన నిద్ర : మంచి నిద్ర ఎప్పుడూ కూడా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. అదేవిధంగా.. బరువు తగ్గించడంలో ముఖ్యపాత్రపోషిస్తుంది. నిద్రలేమి అధికబరువుకి కారణమవుతుంది. కాబట్టి నిద్ర ఎప్పుడూ కూడా తగ్గకుండా చూసుకోవాలి. బరువు తగ్గించడంలో ఈ 6 సూత్రాలు ఏకాలంలోనైనా మెరుగైన ఫలితాలనే ఇస్తాయి.

    వీటితో పాటే.. కింద చెప్పిన వాటికి కూడా దూరంగా ఉండాలి. అవి ఏంటంటే..
    సోడా : షుగర్ ఉండే సోడా లాంటి డ్రింక్స్... బరువు తగ్గాలనుకునేవారికి బద్ధ శత్రువులు. సోడాల వల్ల ఏ పోషకాలూ కలగవు. వాటిలో కేలరీలు ఎక్కువ. అందుకే సోడాలు తాగితే బరువు పెరిగిపోతారు. సోడాల వల్ల డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్, ఒబెసిటీ సమస్యలు ఎక్కువ.

    Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..


    ప్రాసెస్డ్ ఫుడ్స్ : ఫుడ్ ఇండస్ట్రీలో దూసుకొస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. సాసేజ్‌లు, సలామీ, హామ్ వంటి వాటిని నిద్రపోయేముందు తినకపోవడం మేలు. వీటిని తింటే బీపీ, హార్ట్ ఎటాక్, ఒబెసిటీ వంటివి వస్తాయి. ప్రాసెస్డ్ మాంసంలోని ట్రాన్స్ ఫాట్స్, సాల్ట్, షుగర్ వంటివి కేలరీలను పెంచేస్తాయి. ఈజీగా బరువు పెరిగిపోతారు.

    పిజ్జా : పిజ్జా తినేందుకు చాలా టేస్టీగా ఉంటుంది. చీజీగా, సాసీగా నోరూరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఫేమస్. కాకపోతే రేటు ఎక్కువ. ఎంత ఎక్కువ చీజ్ (వెన్న) తింటే అంత కొవ్వు. సాస్‌లో షుగర్ ఉంటుంది. ఇక డఫ్‌లో రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందువల్ల ఓవరాల్‌గా పిజ్జా అనేది బరువును పెంచుతుంది. ఇక నాన్ వెజ్ టైపైతే... వాటిలో ప్రాసెస్డ్ మాంసం ఉంటుంది. అది ట్రాన్స్ ఫ్యాట్‌ కలిగి ఉంటుంది. పిజ్జా బదులు... సంప్రదాయ రోటీలను కర్రీతో తినడం ఎంతో మేలు.

    నట్స్ : బాదం, వాల్‌నట్, జీడిపప్పు, పిస్తా వంటివి ఎక్కువ పోషకాలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఐతే... వీటిలో కేలరీలూ ఎక్కువే. అందువల్ల పడుకునేముందు వీటిని తినకూడదు. ఎందుకంటే వీటిని తిన్నాక ఎక్సర్‌సైజ్ చేయకపోతే, ఇవి కొవ్వుగా మారి... బాడీలో స్టోర్ అవుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు.

    ఐస్ క్రీమ్ : రాత్రి భోజనం చేశాక ఐస్ క్రీమ్ తింటే ఆ సంతృప్తే వేరు. కానీ... బరువు తగ్గాలనుకునేవారికి... ఐస్ క్రీమ్ అంత డేంజర్ ఇంకోటి ఉండదు. ఐస్ క్రీమ్‌లలో బోలెడంత షుగర్, ఎక్కువ కేలరీలు ఉంటాయి. అయినప్పటికీ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే... 15 గ్రాములకు మించి షుగర్ లేని ఐస్ క్రీమ్ తినడం బెటర్.

    ఫ్రూట్ జ్యూస్ : ఇళ్లలో ఫ్రూట్ జ్యూస్ చేసుకోవడం మేలు. బయట కొంటే వాటిలో ఫుల్లుగా షుగర్ వేస్తారు. సోడా కలుపుతారు. ఫలితంగా వాటిలో ఫైబర్ పోతుంది. ముఖ్యమైన పోషకాలు మాయమవుతాయి. పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలూ దెబ్బతింటాయి. కమర్షియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా పిల్లలకు వాటిని అస్సలు ఇవ్వొద్దు. నిద్రపోయేటప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగొద్దు.

    Sexual Wellness: శృంగారమంటే భయమా..? దానికి కారణాలు ఇవే కావచ్చు.. తెలుసుకోండి..


    ఫ్రెంచ్ ఫ్రైస్ : ఆలూ చిప్స్ వంటి వాటిని నూనెలో బాగా వేయిస్తారు. అంటే ఫుల్లు ఫ్యాట్. పైగా ఆలూ అనేది కూడా ఫ్యాట్ ఎక్కువ ఉండే పదార్థం. అందువల్ల ఈ ఫ్రైలు, పాప్ కార్న్ వంటి వాటికి దూరంగా ఉండాలి. జస్ట్ 139 గ్రాముల ఫ్రెంచ్ ఫ్రైలలో 427 కేలరీలుంటాయి. ఈజీగా బరువు పెరిగిపోతారు. పైగా వీటిలో సాల్ట్ చాలా ఎక్కువ. అది మనకు తీవ్ర హాని కలిగిస్తుంది. తిన్నకొద్దీ తినాలనిపించే ఈ ఫ్రైల విషయంలో కచ్చితంగా నోరు కట్టేసుకోవాల్సిందే. లేదంటే... బరువు తగ్గాలి అనే ఆలోచన మానుకోవాల్సిందే.

    కమర్షియల్ పీనట్ బటర్ : ఈమధ్య ప్రజలు పీనట్ బటర్ (వేరుశనగతో చేసే వెన్న)కి బాగా అలవాటు పడ్డారు. తినే ప్రతీ దానిపై పీనట్ బటర్ వేసుకొని లాగించేస్తున్నారు. బట్... కమర్షియల్ పీనట్ బటర్‌లో షుగర్, హైడ్రోజనేటెడ్ విజిటబుల్ ఆయిల్స్, సాల్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ బరువును పెంచేస్తాయి. కావాలంటే ఇంట్లోనే చేసుకోండి. వేరుశనగ పప్పుల్ని వేపి... కొద్దిగా ఉప్పు వేసి... మిక్సీలో వేసి పేస్టులా చేసుకుంటే సరి. ఏదేమైనా నిద్రపోయేటప్పుడు పీనట్ బటర్ అస్సలు తినొద్దు. దాని నిండా కేలరీలే.

    చాకొలెట్ : చాకొలెట్ లాంటి వాటికి ఒక్కసారి అలవాటుపడితే చాలు... ఇక పదే పదే తినాలనిపిస్తాయి. డార్క్ చాకొలెట్స్ (కోకోతో చేసినవి) గుండెకు, బ్రెయిన్‌కీ మంచివే. కానీ... వాటిని నిద్రపోయేముందు మాత్రం తినకూడదు. వాటి నిండా షుగర్, ఫ్యాట్ ఉంటుంది. జంక్ ఫుడ్ ఎలాగైతే తినే కొద్దీ తినాలనిస్తుందో, చాకొలెట్స్ కూడా ఇంకా ఇంకా తినాలనిపించేలా చేస్తాయి. అందుకే వాటిని దూరం పెట్టాలి. అప్పుడు వద్దన్నా బరువు తగ్గి తీరతారు.
    Published by:Veera Babu
    First published: