ఇటీవల బరువు (Weight) పెరగడం సమస్య తీవ్రమైంది. జీవన శైలిలో మార్పులు, జంక్ ఫుడ్‌కు అలవాటు పడడం వంటివి ఇందుకు ప్రధాన కారణం. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తినే ఆహారం పరిమాణం తగ్గించుకోవడం, వర్కౌట్స్ చేయడం చేస్తుంటారు. అలాగే డిటాక్స్ డ్రింక్స్ బరువు తగ్గించే ప్రక్రియలో (Weight Loss tips) ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇప్పుడు బరువు తగ్గడానికి (Weight Loss) ముఖ్యమైన డిటాక్స్ డ్రింక్స్ (Detox Drinks) జాబితాను పరిశీలిద్దాం.
* జీరా డ్రింక్
ఈ భారతీయ మసాలా దినుసు ఆరోగ్య ప్రయోజనాలకు, ముఖ్యంగా జీవక్రియ మెరుగుదలకు ప్రసిద్ధి చెందింది. జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను ఇది స్రవిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. వేసవి వేడి ఎన్నో జీర్ణక్రియ సమస్యలను తెస్తుంది. దీంతో వేడి నుంచి ఉపశమనం పొందడంలో జీరా సహాయపడగలదు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడే పొటాషియం, కాల్షియం, రాగి వంటి పోషకాలు కూడా ఇందులో అధికంగా ఉన్నాయి.
* తేనెతో దాల్చినచెక్క నీరు
నిద్ర పోవడానికి ముందు తేనెను తీసుకోవడం ద్వారా నిద్ర ప్రారంభ గంటలలో ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో తేనె సహాయపడుతుంది. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తెనెలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే అవసరమైన హార్మోన్లు కూడా ఉన్నాయి. ఇవి ఆకలిని అణచివేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. మరోవైపు, దాల్చిన చెక్క విసెరల్ కొవ్వును పోగొట్టడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీపరాసిటిక్ లక్షణాలు ఉండడంతో దీన్ని ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన మసాలా దినుసులలో ఒకటిగా గుర్తింపు పొందింది.
* డిటాక్స్ డ్రింక్ ఏబీసీ
డిటాక్స్ డ్రింక్ ఏబీసీ (ABC) అంటే ఇందులో ఆపిల్, బీట్రూట్, క్యారెట్ కలిసి ఉంటాయి. ఈ మూడు పదార్ధాల కలయిక కారణంగా ఈ డ్రింక్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పేగు ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
* వట్టివేర్లు
వట్టివేర్లు లేదా ఖుస్ ఖుస్ చాలా చల్లగా ఉంటుంది. వట్టివేర్లను నీటిలో ఉడకబెట్టి ఈ పానీయాన్ని తయారు చేస్తారు. ఆ నీటిని ఫిల్టర్ చేసిన తర్వాత రోజుకు ఒకసారి తాగాలి. ఈ డిటాక్స్ వాటర్ బరువు తగ్గడానికి, నరాలను శాంతపరచడానికి, నిద్రలేమికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. అలాగే చర్మం, కాలేయానికి కూడా మేలు చేస్తుంది. వట్టివేర్ల నుంచి సేకరించిన నూనె ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
* ఆరెంజ్- క్యారెట్ జ్యూస్
ఆరెంజ్- క్యారెట్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో వీటితో జ్యూస్ చేయం సులభమే. ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు దాహాన్ని తీర్చడంతోపాటు టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మెంతికూరలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, విటమిన్ బి6, ప్రొటీన్, డైటరీ ఫైబర్, ఇతర విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Weight loss tips