Home /News /life-style /

WANT TO LOSE WEIGHT AND BOOST IMMUNITY TRY THIS SPECIAL DRINK WITH INDIAN SPICES UMG GH

Indian Spices: ఈ డ్రింక్ తాగితే మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేరు.. బరువు తగ్గుతూ, ఇమ్యూనిటీ పెంచే సూపర్ ఫుడ్..!!

ఈ డ్రింక్ తాగితే మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేరు..

ఈ డ్రింక్ తాగితే మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేరు..

వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో చేసే ఒక డ్రింక్ (Drink).. బరువు తగ్గడం (weight loss)లో సహాయం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆ పదార్థాలు ఏంటి, సూపర్ హెల్తీ డ్రింక్‌ (Health Drink)ను ఎలా తయారు చేయాలి..? వంటి వివరాలు చూద్దాం. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
సుగంధ ద్రవ్యాలు (Indian spices) వంటకు రుచి, సువాసన ఇస్తాయి. అలాగే వీటితో అనేక ఆరోగ్య (Health) ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దినుసులు జీర్ణ సమస్యలను దూరం చేయడంతోపాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో చేసే ఒక డ్రింక్ (Drink).. బరువు తగ్గడంలో సహాయం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆ పదార్థాలు ఏంటి, సూపర్ హెల్తీ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలి..? వంటి వివరాలు చూద్దాం.

* జీలకర్ర
జీలకర్ర గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

* వాము
వాము గింజల్లో విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఆయుర్వేద నిపుణులు వామును ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో వాము పాత్ర కీలకం. అలాగే జీవక్రియను ప్రోత్సహిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఊపిరితిత్తులు, నోటిని కూడా శుభ్రంగా ఉంచుతుంది. ఆస్తమా రోగులకు వాము వరంలాంటిది.

ఇదీ చదవండి: ఈ వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఉంటదీ.. డైట్ చేసే వారికి చాలా బెనిఫిట్..!


* సోంపు
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్ల సోంపు గింజల్లో పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని అత్యంత పోషకాలు ఉన్న పదార్థంగా పరిగణిస్తారు. డైటరీ ఫైబర్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉండడంతో జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వులు, పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి.
సోంపు గింజల్లో మూత్రవిసర్జన లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్, ఇతర హానికరమైన ద్రవాలను బయటకు పంపడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

ఈ దినుసులతో వేడివేడి పానీయం తయారు చేసుకుని ప్రతి రోజూ ఉదయం సేవించాలి. దీంతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

* కావాల్సిన పదార్థాలు
కప్పు వేడి నీరు, జీలకర్ర, సోంపు, వాము గింజలు ఒక టేబుల్ స్పూన్ చొప్పున

* తయారీ విధానం

స్టెప్-1 జీలకర్ర, సోంపు, వాము గింజలను టీ స్ఫూన్ చొప్పున తీసుకోవాలి.

స్టెప్-2: ఈ మిశ్రమాన్ని ఒక కప్పు వేడి నీటిలో నానబెట్టి కలపాలి.

స్టెప్-3: గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే దీన్ని రాత్రంతా నానబెట్టాలి.

స్టెప్-4: మరుసటి రోజు ఉదయం గ్లాస్‌లో ఈ మిశ్రమాన్ని వడకట్టాలి.

స్టెప్-5: రుచి కోసం దీంట్లో కొద్దిగా తేనె కలపండి.

స్టెప్-6: ప్రతిరోజూ పరగడుపున ఈ డ్రింక్ తాగండి.



సుగంధ ద్రవ్యాలు వంట రుచిని పెంచేందుకు ఉపయోగించే అనుబంధ ఆహార పదార్థాలు. వీటిని చాలా తక్కువ పరిమాణంలో వాడుతుంటారు. కొన్ని రకాల దినుసుల్లో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే మిర్చి, ధనియాలు వంటి వాటిలో బీటా -కెరోటీన్ ఉంటుంది. ఇక పచ్చిమిర్చి లో సి- విటమిన్ బీటా-కెరోటీన్ ఉంటాయి. మరికొన్నింటిలో కోలిన్, బయో జెనిక్ అమిన్ వంటి ఉంటాయి. ఇక, ఇంగువ, వెల్లుల్లిలో రోగనిరోధక శక్తినిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి.
Published by:Mahesh
First published:

Tags: Drinks, Health, Health benefits, Health tip

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు