హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight loss tips: ఈజీగా బరువు తగ్గాలని ఉందా? అయితే ఉదయం ఈ విధంగా చేయండి..

Weight loss tips: ఈజీగా బరువు తగ్గాలని ఉందా? అయితే ఉదయం ఈ విధంగా చేయండి..

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అధిక బరువు ఎవరికైనా సమస్యే. మీరు బరువు తగ్గాలని (weight loss) తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మీకు ఏదీ సరిగ్గా పని చేయనట్లయితే ఈ పద్దతి సరిగా పాటించండి

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Time కి ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. చాలామందికి అధిక బరువు సమస్య తెచ్చిపెడుతుంది. మీరు బరువు తగ్గాలని (weight loss tips) ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మీకు ఏదీ సరిగ్గా పని చేయనట్లయితే ఈ పద్దతి సరిగా పాటించండి. నిద్రపోవడం (sleep mandatory) వంటి విశ్రాంతి కూడా మీకు కిలోల బరువు తగ్గడానికి (weight loss tips) సహాయపడుతుంది.  అంతేకాకుండా ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది అనే వాస్తవం శాస్త్రీయంగా నిరూపించబడింది. దీనిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కడుపు చెట్టు కొవ్వును కరిగిస్తుంది మరియు శరీర కొవ్వును అణచివేస్తుంది.

  ఆపిల్ సైడర్ వెనిగర్ (apple cider vinegar) బరువు తగ్గడానికి అద్భుతంగా పని చేస్తోంది. బరువు తగ్గడానికి (weight loss tips)  ఈజిప్షియన్లు దీనిని ఉపయోగించేవారు. ఈ పురాతనమైన ఆరోగ్య ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ నీ పులియబెట్టి తయారుచేస్తారు ఇది మధుమేహం,రక్తపోటు,  కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది.

  ఉదయం లేవగానే ఒక కప్పు వేడి నీటిలో 2 టీస్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని త్రాగాలి తర్వాత యోగ గాని వాకింగ్ గాని 30 నిమిషాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఒక వారం లేదా రెండు వారాల్లో మీరు బరువు తగ్గడం గమనిస్తారు. అలాగే భోజనం చేసే అరగంట ముందు ఒక కప్పు నీటిలో 2 టీస్పూన్లు ఆపిల్ సైడర్ వినేగర్ కలుపుకుని త్రాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అనే వాస్తవం శాస్త్రీయంగా నిరూపించబడింది. దీనిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కడుపు చెట్టు కొవ్వును కరిగిస్తుంది మరియు శరీర కొవ్వును అణచివేస్తుంది.

  ఇది మధుమేహం ఉండి బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వినేగర్ దాని బలమైన ఘాటయిన రుచి కారణంగా త్రాగడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి దాల్చినచెక్కకు దీనికి జోడించడం వల్ల మంచి రుచిని జతచేస్తుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, గుండె జబ్బులు ప్రమాద కారకాలను తగ్గిస్తుంది బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

  దాల్చిన చెక్క తీసుకుని మెత్తగా పొడిని చేసుకోవాలి. ఒక కప్పు నీటిని తీసుకునే గ్యాస్ మీద పెట్టి గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. తర్వాత 1/2 టీస్పూన్ దాల్చిన చెక్కపొడి వేసి ఒక రెండు నిమిషాలు మరిగించాలి. దాల్చిన చెక్క వేడినీళ్లు చల్లారిన తర్వాత ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వినేగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా రోజూ ఉదయాన్నే త్రాగాలి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Weight loss tips

  ఉత్తమ కథలు