Home /News /life-style /

weight loss: బరువును తగ్గించుకోవాలంటే కాఫీలతో కూడా సాధ్యమే.. ఈ కాఫీలు తాగి చూడండి

weight loss: బరువును తగ్గించుకోవాలంటే కాఫీలతో కూడా సాధ్యమే.. ఈ కాఫీలు తాగి చూడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గడానికి ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న(weight loss) క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది. అయితే కొన్ని రకాల కాఫీలతో బరువును కంట్రోల్లో పెట్టుకోవచ్చంట.

ఇంకా చదవండి ...
  అసలే బిజీ లైఫ్​. చదువులు, ఉద్యోగాలు,ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి.  పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.  కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.  మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

  ప్రతీ ఒక్కరికి బరువు (Weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. డాక్టర్లు బరువు తగ్గడానికి  (weight loss) వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న (weight loss) క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది.  అయితే కొన్ని రకాల కాఫీలతో బరువును కంట్రోల్లో పెట్టుకోవచ్చంట.

  నిమ్మకాయలో విటమిన్ సి..

  డార్క్ లెమన్ కాఫీ (dark lemon coffee). ఈ కాఫీని నిమిషాల్లో ఎస్ప్రెస్సో షాట్, నిమ్మకాయతో తయారు చేయవచ్చు. దీని వలన కూడా అధిక బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక వేడి కప్పు ఎస్ప్రెస్సో‌లో నిమ్మరసం (lemon) కలిపి ఈ కాఫీని తయారు చేస్తారు. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు (fat)ను కరిగించడానికి సహాయపడుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. కడుపులోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. కెఫీన్ ఎనర్జీ లెవల్స్‌ని పెంచుతుంది. వర్కౌట్‌కి ముందు అద్భుతమైన డ్రింక్‌గా పనిచేస్తుంది.

  దాల్చిన చెక్క కాఫీ. ఒక కప్పు వేడి కాఫీకి చిటికెడు దాల్చిన చెక్కను పొడిని కలపాలి. ఈ మసాలా కాఫీ రుచి, గొప్పతనం అద్భుతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది, ఇది క్రమంగా బరువు తగ్గడంలో(weight loss) సహాయపడుతుంది.

  జీల‌క‌ర్ర టీ (Tea). దీనిని ఇలా తయారు చేసుకోవాలి.. ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ వాము, ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర వేసి రెండు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఆ త‌ర్వాత ఆ నీటిని ఐదు నిమిషాల పాటు మ‌రిగించాలి. వేడి చేసిన నీటిని వ‌డ‌క‌ట్టి నాలుగు చుక్క‌లు నిమ్మ‌ర‌సం వేసుకుని తాగాలి. రుచి కోసం అల్లం లేదా పుదీనా ఆకులు కూడా క‌లుపుకోవ‌చ్చు. నిమ్మ ర‌సం రుచి న‌చ్చ‌క‌పోతే ఒక టీస్పూన్ తేనె కూడా క‌లుపుకోవచ్చు. ఇలా తయారు చేసిన దీనిని మనం మూ నెలల పాటు తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా దూరం అవుతాయి
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Coffee, Weight loss, Weight loss tips

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు