Home /News /life-style /

weight loss tips: ఎంత ప్రయత్నించిన అధిక బరువు తగ్గడంలేదా? అయితే బరువు తగ్గడానికి ఈ మూడు పద్దతులు ఫాలో అవండి

weight loss tips: ఎంత ప్రయత్నించిన అధిక బరువు తగ్గడంలేదా? అయితే బరువు తగ్గడానికి ఈ మూడు పద్దతులు ఫాలో అవండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గడానికి (Weight loss) వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. బరువు తగ్గడానికి ఉత్తమ మార్గాలలో కొన్నింటిని ఒకసారి తెలుసుకుందాం..

    బిజీ లైఫ్​. చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం (food) తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

    ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి (Weight loss) వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌ (exercises)లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న (weight loss) క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది.

    బరువు తగ్గడానికి ఉత్తమ మార్గాలలో (weight loss tips) బరువు శిక్షణ (weight training) ఒకటి. ఇవి కండరాలు, కీళ్లకు పోషణనిస్తాయి. జీవక్రియను పెంచి తద్వారా శరీరంలోని కండరాలను బలపరుస్తుంది.



    ప్రొటీన్లతో కూడిన ఆహారం

    ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా (proteins food) జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణులు (experts) చెబుతున్న దాని ప్రకారం ఇది చాలా కాలం పాటు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజుకు ఎక్కువ భోజనం (food) తినకుండా ఉండటానికి మీకు సహాయపడుతుంది.

    ఉపవాసం

    ఫిట్‌నెస్ (Fitness), ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వారికి అడపాదడపా ఉపవాసం (Fasting) చాలా ముఖ్యం. అడపాదడపా ఉపవాసం అంటే ఒక పూట భోజనం (food) చేయకపోవడం. సరైన సమయంలో భోజనం చేయడం లేదా భోజనానికి ప్రత్యామ్నాయంగా వేరేవిధమైన ఆహరం తీసుకోవడం. ఆహారం పూర్తిగా జీర్ణం (digest) కావడానికి సమయం కేటాయించడమే దీని లక్ష్యం. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Weight loss tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు