Home /News /life-style /

WANT TO LOOK BEAUTIFUL IN SUMMER TOO THEN FOLLOW THIS SIMPLE TIPS TO REMOVE TAN ON YOUR FACE AND LOOK GOOD PRV

Summer Skin care tips: ముఖంలో తేజస్సు తగ్గిపోయిందా? ఫేస్​పై ట్యాన్​ తొలగించుకోని అందంగా కనిపించాలంటే ఈ పద్దతులు ఫాలో అవండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. అదేంటంటే.. తెల్లగా ఉంటే చాలు అందంగా కనిపిస్తారని.. కానీ, అది ఎంత మాత్రం కానే కాదు.. ఏ రంగులో ఉన్నా.. ముఖం తాజాగా, మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటే అందంగా కనిపిస్తారు. 

    చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. అదేంటంటే.. తెల్లగా ఉంటే చాలు అందంగా కనిపిస్తారని.. కానీ, అది ఎంత మాత్రం కానే కాదు.. ఏ రంగులో ఉన్నా.. ముఖం తాజాగా, మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటే అందంగా కనిపిస్తారు.  వాతావరణంలో అసలే పొల్యూషన్ (pollution)​ ఎక్కువ. ముఖాన్ని(face) పొల్యూషన్​ నుంచి రక్షించుకోవడానికి (save) ముందు మనం చేసే చిన్నచిన్న పనులే మనకు అందాన్ని(beauty) తెచ్చిపెడుతాయి. చాలా మందికి అనేక కారణాలతో మొటిమలు (Pimples), మచ్చల సమస్యలు ఎదురవుతాయి. ఎన్ని క్రీమ్స్ (Creams) రాసినా అంతగా ఫలితం ఉండదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ (side effects) ఎదురవుతాయి. అలా కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు సమస్యని దూరం చేసుకుని అందంగా మారొచ్చు.కాబట్టి ఈ పద్ధతులు (Skin care tips) పాటించండి. ఖచ్చితంగా మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

    ఇక సాధారణంగా బయట ఎండన పడి తిరిగి వచ్చినప్పుడు ముఖం టాన్ అవుతుంది. అలాంటప్పుడు శనగపప్పుతో  తయారుచేసిన ఫేస్ ప్యాక్ ట్యాన్‌ (Tan)ను చాలా ప్రభావవంతంగా పోగొడుతుంది. సూర్యరశ్మి, కాలుష్యం ప్రభావం వల్ల సాధారణంగా శరీరంపై ట్యాన్ (Tan) పెరిగిపోతుంది.

    శనగ పప్పు (Chana dal)లోని గుణాలు చర్మాన్ని డీ ట్యాన్ చేసి మెరిపిస్తాయి. అందుకే శనగ పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడంతో పాటు.. నాలుగు టీస్పూన్ల శనగ పిండి, టీస్పూన్ నిమ్మరసం, టీస్పూన్ పెరుగు, చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు.. మెడ భాగంలో ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. ట్యాన్ సమస్య తొలగిపోతుంది. జిడ్డుదనం తగ్గిస్తుంది (Reduce oiliness) . జిడ్డు చర్మం కలిగినవారికి మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలు రావడం సహజం. అందుకే ముఖం జిడ్డుగా కనిపించకుండా ఉండేందుకు.. తరచూ దానిని శుభ్రం (Should clean) చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల చర్మం రసాయనాల బారిన పడి.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

    శనగ పప్పు (Chana dal) చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకోసం తొలుత పప్పును ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల పాలు (milk) లేదా పెరుగు కలిపి.. ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న జిడ్డును తొలిగిస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    తదుపరి వార్తలు