Home /News /life-style /

WANT TO LIVE LONGER ON EARTH BUT TAKE A DIET LIKE THIS FULL DETAILS HERE VB

Live Longer: మీకు ఎక్కువ కాలం బతకాలని ఉందా..! అయితే ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Live Longer: ప్రస్తుత జీవన ప్రయాణంలో కనీసం ఆహారం వేళకు తినే సమయం కూడా లేకుండా అయిపోయింది. కంప్యూటర్ యుగంలో సిస్టమ్ ముందు కూర్చున్నామంటే లేచేసరికి ఆకలి కాస్త మందగిస్తుంది. కడుపులో హైడ్రోజన్ క్లోరైడ్ ఫామ్ అయిన అది ఒక పాయిజన్ లా పాకుతుంది. ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
  ప్రస్తుత జీవన ప్రయాణంలో కనీసం ఆహారం వేళకు తినే సమయం కూడా లేకుండా అయిపోయింది. కంప్యూటర్ యుగంలో సిస్టమ్ ముందు కూర్చున్నామంటే లేచేసరికి ఆకలి కాస్త మందగిస్తుంది. కడుపులో హైడ్రోజన్ క్లోరైడ్ ఫామ్ అయిన అది ఒక పాయిజన్ లా పాకుతుంది. అందుకే ఎంత పని ఉన్నా.. సమయానికి భోజనం చేయాలని ప్రతీ ఒక్క డాక్టర్ చెబుతుంటారు. అయితే కొంతమంది బరువు లేదా లావు తగ్గాలన్నా కారణంతో భోజనం చేయడం మానేస్తుంటారు. అది ఎంత మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇన్ని అలవాట్లను పాడు చేసుకుంటూ ఎక్కువ కాలం భూమిని జీవించాలని కోరిక అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. మంచి ఆహారం, వ్యాయామం చేస్తే ఉంటే అదేం పెద్ద సమస్య కాదు.

  Ants Problems: ఇంట్లో చీమలతో చిరాకు వేస్తోందా.. ఈ చిట్కాలను వాడి చీమలను తరిమికొట్టేయండి..


  డబ్బు సంపాదనే ధ్యేయంగా మనిషి పాకులాడుతుండటంతో జీవన ప్రమాణాలు రోజురోజుకు పడిపోతున్నాయి. శరీరానికి అవసరంలేని ఆహారాన్ని తీసుకుంటూ చివరకు వాటి కారణంగా వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. మన జీవితం సాఫీగా సాగేందుకు పోషక విలువలున్న ఆహారాన్ని తినాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనిషి సగటు జీవిత కాలం సంవత్సరానికి తగ్గుతూ వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం 80 సంవత్సరాలుగా ఉండేది కానీ.. ప్రస్తుతం 60 నుంచి 65 సంవత్సరాలుగా ఉంది. మరికొన్ని దేశాల్లో అయితే దారుణంగా 50 ఏళ్లకే పరిమితం అయింది. మరికొన్ని సంవత్సరాల్లో ఆయురార్ధం వచ్చేసి 100 ఏళ్లు కూడా ఉంది.

  Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..


  ఇదంతా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, ఫుడ్ తీసుకునే విధానం, పోషకాలు ఉన్నా ఆహారం తీసుకోవడం అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. సరైనా ఆహారం తీసుకోక పోవటం వల్ల జబ్బులు కొని తెచ్చుకుంటూ కొందరు అర్హాయుష్కులుగా వెళ్ళిపోతున్నారు. ఈ తప్పిదం మనం చేజేతులా చేసుకునేదే. కొద్దిపాటి ఆహార నియమాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారమై మన జీవితకాలాన్ని నిర్ణయిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అంటే బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింకులు, మాంసాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి అస్సలే మంచివి కావు. మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో ముందుగా కంకణం కట్టుకునేవి ఇవే. ఇలాంటివి తింటే మనిషి సగటు జీవితకాలం 36 నిమిషాలు తగ్గిపోతుంది.

  Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..


  మనం తినే ఆహారాలు మన జీవితకాలంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మిచిగాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. దాదాపు 5 వేలకు పైగా ఆహార పదార్థాలపై అధ్యయనం జరిపారు. అమెరికా ప్రజలు ప్రాసెస్ట్ మాంసం ఎక్కువగా తింటుంటారు. వాటిని ఒక గ్రామ్ తినడం వల్ల 0.45 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందట. ఒక్క హాట్‌డాగ్‌లో దాదాపు 61 గ్రాముల ప్రాసెస్డ్‌ మాంసంతో 27 నిమిషాల జీవితకాలాన్ని కోల్పోతున్నట్లు అధ్యయనంలో తేల్చారు. ఇలా వారు తినే ఆహార పదర్థాలను లెక్కించి వారు ఎంత ఆయురార్థాన్ని కోల్పోతున్నాశాస్త్రవేత్తల అధ్యయనంలో తేల్చారు.

  Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..


  మరి మనం ఎక్కువగా ఏం తీసుకోవాలో కూడా చెప్పారు. అందులో ముఖ్యంగా పీనట్‌ బటర్‌. దీనిని తినడం ద్వారా 33 నిమిషాల ఆయుర్ధాయం పెంచుకోవచ్చు.. అవకాడోలు తినడం ద్వారా 3.8 నిమిషాలు, ఆపిల్‌ పాయి తింటే 26 నిమిషాల ఆయుర్ధాయంఉప్పు వేసిన వేరుశనగ పప్పులను తింటే 26 నిమిషాలు, బేక్‌ చేసిన సాల్మన్‌ చేపలు తింటే 16 నిమిషాలు, రాజ్మాతో అన్నం తింటే 13 నిమిషాలు, అరటిపండ్లతో 13.5 నిమిషాలు, టమాటలతో 3.8 నిమిషాల జీవితకాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. జీవితానికి ఆల్కహాల్, సిగరేట్ లాంటివి ఎప్పటికీ మంచివి కావు. వాటిని తీసుకోవడం ద్వారా ఇన్ స్టాంట్ గా ఎఫెక్ట్ చూపించకపోయినా.. రానున్న కాలంలో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. ప్రతీ రోజు 3 నుంచి 4లీటర్ల మధ్యలో నీళ్లు తాగాలని తెలిపారు. వీటి ద్వారా ఆయుర్ధాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Health benefits, Life Style

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు