ఎక్కువకాలం బతకాలా? ఏడాదిలో మూడుసార్లు టూరెళ్లండి!

ఏడాదిలో మూడువారాల కన్నా తక్కువ సెలవులు తీసుకునే పురుషులు త్వరగా చనిపోయే అవకాశాలు 37 శాతం ఎక్కువ అని ఓ అధ్యయనంలో తేలింది.

news18-telugu
Updated: September 27, 2018, 4:49 PM IST
ఎక్కువకాలం బతకాలా? ఏడాదిలో మూడుసార్లు టూరెళ్లండి!
Photo: AFP Relaxnews/ encrier/ istock.com
  • Share this:
మీరు ఎక్కువకాలం బతకాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన జీవనశైలితో పాటు ఏడాదిలో మూడుసార్లు వెకేషన్‌కు వెళ్లడం మంచిదని ఓ అధ్యయనం తేలింది. ఇది ఎక్కువగా పురుషులకు వర్తిస్తుంది. తక్కువగా వెకేషన్ తీసుకునేవాళ్లు, ఎక్కువగా పనిచేసేవాళ్లు, తక్కువగా నిద్రపోయేవారి కన్నా ఎక్కువగా వెకేషన్ తీసుకునేవారి జీవనకాలం పెరుగుతుందని ఆ అధ్యయనం సారాంశం. ఏడాదిలో మూడువారాల కన్నా తక్కువ సెలవులు తీసుకునే పురుషులు త్వరగా చనిపోయే అవకాశాలు 37 శాతం ఎక్కువ.

సెలవులు తీసుకోకుండా జీవితాంతం కష్టపడితే ఆరోగ్యవంతమైన జీవనశైలి ఉంటుందని అనుకోవద్దు. సెలవులు తీసుకుంటుంటేనే ఒత్తిడి తగ్గుతుంది. హృదయ సంబంధిత వ్యాధులు తగ్గించడానికి ఇలాంటి అలవాట్లు మంచిది.
టిమో స్ట్రాండ్‌‌బర్గ్, ప్రొఫెసర్, హెల్సింకీ యూనివర్సిటీ, ఫిన్‌లాండ్


1,222 మంది మధ్య వయస్కులైన పురుషులతో ఈ అధ్యయనం చేశారు. వారి అలవాట్లు, తీసుకునే ఆహారం, బరువు, సిగరెట్, మందు వ్యసనం, వ్యాయామం లాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని అధ్యయనం జరిపారు. ఫలితాలను యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. చివరకు తేలిందేంటంటే... ఎక్కువగా వెకేషన్‌కు వెళ్లేవారు ఎక్కువ కాలం బతుకుతారని.
First published: September 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు