HOME » NEWS » life-style » WANT TO HAVE ANAL SEX WITH YOUR PARTNER BUT IF SHE DOES NOT AGREE WITH THAT HERE IS THE EXPERT SUGGESTION MS GH

Sexual wellness: నా భార్యతో అలా చేయాలని ఉంది.. కానీ దానికి తను ఒప్పుకోవడం లేదు.. ఏం చేయాలి?

Anal Sex: శృంగారం అనేది ఇద్దరి మధ్య సమ్మతితో జరగాల్సిన ఏకాంత ప్రక్రియ. అటువంటి శృంగారంలో భాగస్వాములిద్దరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉండాలన్న నియమాలేవీ లేవు.. కొంత మందికి అసహజ శృంగారంలో పాల్గొనాలని, మరికొంత మందికి అనాల్ సెక్స్(Anal Sex) పట్ల విముఖంగా ఉంటారు.

news18
Updated: January 13, 2021, 9:24 PM IST
Sexual wellness: నా భార్యతో అలా చేయాలని ఉంది.. కానీ దానికి తను ఒప్పుకోవడం లేదు.. ఏం చేయాలి?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: January 13, 2021, 9:24 PM IST
  • Share this:
మనిషి జీవితంలో శృంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా మారాలన్నా.. వారి రిలేషన్ రొమాంటిక్(Romantic)గా సాగాలన్నా శృంగారం(Sex) అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, శృంగారం అనేది ఇద్దరి మధ్య సమ్మతితో జరగాల్సిన ఏకాంత ప్రక్రియ. అటువంటి శృంగారంలో భాగస్వాములిద్దరికీ(Partners) ఒకే రకమైన ఆలోచనలు ఉండాలన్న నియమాలేవీ లేవు.. కొంత మందికి అసహజ శృంగారంలో పాల్గొనాలని కోరిక ఉంటుంది. మరికొంత మందికి అనాల్ సెక్స్(Anal Sex) పట్ల విముఖంగా ఉంటారు. అయితే, ముఖ్యంగా అనాల్ సెక్స్ ఆలోచనలు పురుషుల్లో ఎక్కువగా వస్తుంటాయి. వారిలో అనాల్ సెక్స్ చేయాలన్న కోరిక బలంగా ఉంటుంది. దీనికి చాలామంది భాగస్వాములు సమ్మతించరు. భర్త ఎంత ఒత్తిడి తెచ్చినా భార్య ససేమిరా అంటోంది.

ఇటువంటి సందర్భంలో వారి అభిప్రాయానికి విలువనిచ్చి భార్య(Wife)ను ఇబ్బంది పెట్టకపోవడే మంచింది. ఎందుకంటే, కొంతమంది వ్యక్తులు కొన్ని లైంగిక చర్యలను చేయడం లేదా కొన్ని ఫాంటసీ(Fantacy)లలో పాల్గొనడం పట్ల సౌకర్యంగా ఉండరు. అలాంటి సందర్భంలో వారి అభిప్రాయాన్ని గౌరవించాలి(Respect), కానీ వారిపై ఒత్తిడి చేయకూడదు.

ఇష్టం లేకపోయినప్పటికీ భార్యను అనాల్ సెక్స్లో పాల్గొనాలని ఒత్తిడి చేయడం మూర్ఖత్వంతో కూడుకున్న చర్య. ఇది సెక్సువల్ హెరాస్‌మెంట్ కిందకే వస్తుంది. పెళ్ళి, శృంగారం పేరుతో, భర్త (Husband)అన్న అధికారంతో, అహంకారంతో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ శృంగారానికి పాల్గొనాలని చాలా మంది భర్తలు ఈ తరహా సెక్స్‌లో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. ఇలా భార్య ఇష్టానికి వ్యతిరేఖంగా సెక్స్లో పాల్గొనడం మంచిది కాదని గుర్తించుకోండి.



అనాల్ సెక్స్ పట్ల ఆందోళన, భయాలను తెలుసుకోండి..

అనాల్ సెక్స్ ద్వారా తీవ్రమైన రక్తస్రావం(Bleeding), నొప్పి(Pain) తలెత్తుతుందని, అది కొనసాగిస్తే ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం కూడా ఉందని చాలా మంది స్త్రీలు భావిస్తారు. అందువల్ల వారు అనాల్ సెక్స్ పట్ల ఆందోళన, భయంతో విముఖత వ్యక్తం చేస్తుంటారు. అయితే, భార్యను అనాల్ సెక్స్కు ఒప్పించి, పరస్పర సమ్మతితో పాల్గొంటే పెద్దగా ఇబ్బందులు ఉండవని గుర్తించుకోవాలి. అనాల్ సెక్స్(Anal Sex) పట్ల ఆమె ఎందుకు ఆందోళన చెందుతుంది? దాని పట్ల ఆమెకున్న భయాలేంటి? అనే విషయాలను ముందుగా తెలుసుకోండి. ఆమె ఇబ్బందుల గురించి మీతో బహిరంగంగా మాట్లాడటానికి ప్రోత్సహించండి. ఆమె భయాలు, ఆందోళనలను చర్చించడానికి ప్రయత్నించండి. ఆ ఇబ్బందులను పరిష్కరించగలిగితే ప్రొసీడ్ అవ్వండి. లేదంటే, ఆమెపై ఒత్తిడి(Pressure) చేయకుండా అనాల్ సెక్స్కు దూరంగా ఉండటమే మంచిదని గుర్తించుకోండి. ఒకరి సుఖం కోసం మరొకరిని కష్ట పెట్టడం కూడా భావ్యం కాదని గుర్తించుకోవాలనుకుంటున్నారు సెక్సాలజిస్టులు..
Published by: Srinivas Munigala
First published: January 13, 2021, 8:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading