Home /News /life-style /

skin care tips: శీతాకాలంలో మీ చర్మం మృదువుగా, అందంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

skin care tips: శీతాకాలంలో మీ చర్మం మృదువుగా, అందంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం ( Skin ) పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది.

    శీతాకాలం (Winter). చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన కాలం. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( skin care ) చాలా కీలకమవుతుంటుంది.   చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం ( Skin ) పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది. సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది (skin care tips) ఇప్పుడు తెలుసుకుందాం.

    కొబ్బరి నీరు ఆరోగ్యకరమే

    ఈ సీజన్‌లో బాలెన్స్‌డ్‌ డైట్‌ (Balanced diet) తప్పని సరి. పగలు పుదీనా టీ (tea), తులసి టీ, గ్రీన్‌ టీ (green tea), హెర్బల్‌ టీ, లెమన్‌ టీ (lemon tea), తాజా నిమ్మరసం తీసుకోవాలి. కొబ్బరి నీరు ఎండాకాలంలో మాత్రమే తాగాలనుకోవడం కేవలం అపోహ మాత్రమే. వర్షాకాలమైనా, శీతాకాలమైనా కొబ్బరి నీరు ఆరోగ్యకరమే. రాత్రి భోజనానికి ముందు వెజిటబుల్‌ సూప్‌లు తాగాలి. మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

    చేపలు, చికెన్, గుడ్లు..

    ఈ సీజన్‌లో పొట్టుతో కూడిన ధాన్యాలు, పప్పులు, నట్స్ (nuts), మంచి నెయ్యి రోజువారీ ఆహారంలో ఉండాలి. మాంసాహారులైతే ఈ కాలంలో  మటన్‌కు బదులు తేలిగ్గా జీర్ణమయ్యే చేపలు, చికెన్ 9chicken), గుడ్లు (Eggs) తీసుకోవచ్చు. వాల్‌నట్, అవిసె గింజలు తీసుకోవాలి. అలాగే బొప్పాయితోపాటు బత్తాయి, కమలాపండ్లు రోజూ తీసుకుంటే మంచిది.

    ఇక కూరల్లో ఈ సీజన్‌లో పండే అన్ని రకాల కూరగాయలు (vegetables), క్యాలిఫ్లవర్, బ్రోకలి వారంలో ఒకసారైనా తీసుకుంటుంటే చర్మానికి మాయిశ్చర్‌ సహజంగా అందుతుంది.

    సగటున ఒక మహిళ రోజుకు 2.7 లీటర్లు, మగవాళ్లు 3.7 లీటర్లు ద్రవాలు (నీరు, ఇతర ద్రవాహారం కలిపి) దేహానికి అవసరం. ఏ కాలమైనా సరే... దేహంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి దేహక్రియలకు అవసరమైన ద్రవాలు (Water) దేహానికి అంది తీరాలి. అప్పుడే చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. దేహంలోని వ్యర్థాలు విసర్జితం కాకుండా చర్మం మీద ఎన్ని లోషన్‌లు రాసినా దేహక్రియలు మెరుగుపడవు, చర్మఆరోగ్యం (skin health) కూడా మెరుగవదనే విషయాన్ని మర్చిపోకూడదు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు