లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే వాల్‌నట్స్ తినాల్సిందే...

వాల్‌న‌ట్స్‌లో అమైనో యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపి లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి.

news18-telugu
Updated: November 30, 2019, 9:17 PM IST
లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే వాల్‌నట్స్ తినాల్సిందే...
వాల్‌నట్స్‌ (Image: wikipedia)
  • Share this:
లివ‌ర్ ప‌నిచేయ‌క‌పోతే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక లివ‌ర్‌ను మ‌నం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా చూసుకోవాలి. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో, ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో, మ‌నం తినే కొవ్వు ప‌దార్థాల‌ను జీర్ణం చేసేందుకు, మనం తినే ఆహారంలో ఉండే విట‌మిన్ల‌ను నిల్వ చేసుకునేందుకు లివ‌ర్ ఎంత‌గానో శ్ర‌మిస్తుంది. ఈ క్ర‌మంలోనే లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వాల్‌న‌ట్స్‌లో అమైనో యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపి లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. వాల్‌న‌ట్స్‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ ఉన్న‌వారు వాల్‌న‌ట్స్‌ను తింటే ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నిత్యం గుప్పెడు వాల్‌న‌ట్స్‌ను తింటే లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.
First published: November 30, 2019, 9:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading