గుండె సంబంధిత Heart related జబ్బులు ఉన్నవారికి శారీరక శ్రమ Physical exercise చాలా ముఖ్యం అని ఒక పెద్ద అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటీస్ Diabetes ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు, ఇప్పటికే హార్ట్ పేషెంట్లయితే తప్పనిసరిగా రోజూ నడవాల్సి ఉంటుంది. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉండటంతోపాటు గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. ఈ అధ్యయనంలో దాదాపు 88,320 మందిపై పరీక్ష జరిపారు. వారి లైఫ్‌స్టైల్ Lifestyle శారీరక శ్రమను చేర్చారు. నడక అలవాటు ఉన్న వ్యక్తుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తేలింది.
గుండె నొప్పికి కారణాలు..
ఊపిరితిత్తులు, పక్కటెముకల మధ్య ఉండే గుండె, మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. బరువు 300–450 బరువు వరకు ఉంటుంది. గుండె ద్వారా పంప్ చేసిన రక్తం మన శరీరానికి పని చేయడానికి అవసరమయ్యే ఆక్సిజన్ Oxygen , పోషకాలను అందిస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరోనరీ ఆర్డరీలు బ్లాక్ అవుతే అప్పుడు ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫలకాలలో కొవ్వు ఏర్పడటం వల్ల కాలక్రమేణా ఇది పెరుగుతూ ఉంటుంది. ధమనులు ఇరుకుగా మారి గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని పంపడం కష్టతరం అవుతుంది. దీన్ని నివారించడానికి జీవనశైలిలో (Lifestyle) మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
గుండెకు వ్యాయామం..
హార్ట్ పేషంట్లు ముందుగా వైద్యుల సలహా తీసుకుని ఆ తర్వాతే ఏదైనా వ్యాయామం మొదలు పెట్టాలి. లేదా యోగా స్టార్ట్ చేయాలి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు మీరు ఏ వ్యాయామం చేయడం మంచిదో సూచిస్తారు. పనులు కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే చేయాలి. వ్యాయామం రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ Cholesterol లెవల్స్‌ను కూడా తగ్గించి, డయాబెటీస్‌ను అదుపులో ఉంచుతుంది.
ఏరొబిక్స్ Aerobics చేయండి. దీని వల్ల ఊపిరితిత్తులు రెండూ బాగా పనిచేస్తాయి. గుండె రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కానీ, ఇందులో క్లిష్టమైన ఆసనాల జోలికి వెళ్లకూడదని గుర్తుంచుకోండి.
స్విమ్మింగ్ Swimming చేయవచ్చు. కానీ, ఎక్కువ ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. వారానికి 3–4 సార్లు ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయాలి.
ఏదైనా వ్యాయామం చేసే ముందు వార్మ్అప్ Warm up చాలా ముఖ్యం. వ్యాయామం తరువాత కూడా కాస్త సమయం కూల్ అవ్వడానికి కేటాయించాలి.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
ఏదైనా వ్యాయామం చేస్తున్నప్పుడు తలనొప్పి, ఛాతినొప్పి, మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వెంటనే వ్యాయామం చేయడం ఆపేయండి. తక్షణమే వైద్యులను సంప్రదించడం మేలు.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.