100 రోజులు నిద్రపోతే రూ.1,00,000 పారితోషికం... రోజూ 9 గంటలు మాత్రమే

Wakefit Sleep Internship | సక్సెస్‌ఫుల్‌గా 100 రోజుల పాటు రోజూ 9 గంటల చొప్పున నిద్రపోయినవారికి రూ.1,00,000 ఇస్తుంది కంపెనీ.

news18-telugu
Updated: November 29, 2019, 6:30 PM IST
100 రోజులు నిద్రపోతే రూ.1,00,000 పారితోషికం... రోజూ 9 గంటలు మాత్రమే
100 రోజులు నిద్రపోతే రూ.1,00,000 పారితోషికం... రోజూ 9 గంటలు మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అంతరిక్ష పరిశోధనలో భాగంగా 2 నెలలు మంచంపై ఉంటే నాసా రూ.14 లక్షలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ స్లీప్ సొల్యూషన్స్ సంస్థ వేక్ ఫిట్ కూడా అలాంటి ఆఫరే ప్రకటించింది. రోజూ 9 గంటల చొప్పున 100 రోజులు నిద్రపోతే రూ.1,00,000 ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం 'వేక్‌ఫిక్ స్లీప్ ఇంటర్న్‌షిప్' పేరుతో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారు రోజూ 9 గంటల చొప్పున 100 రోజులపాటు నిద్రపోవాల్సి ఉంటుంది. అదికూడా వేక్‌ఫిట్ కంపెనీ మ్యాట్రెస్ పైనే నిద్రపోవాలి. అధునాతన ఫిట్‌నెస్, స్లీప్ ట్రాకర్ ద్వారా వారిని పరిశీలించడంతో పాటు నిపుణులతో కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. నిద్ర ఎలా పట్టిందో వీడియోలో వివరించాల్సి ఉంటుంది.


సక్సెస్‌ఫుల్‌గా 100 రోజుల పాటు రోజూ 9 గంటల చొప్పున నిద్రపోయినవారికి రూ.1,00,000 ఇస్తుంది కంపెనీ. ఎంపికైనవారికి డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. పైజామాలు మాత్రమే ధరించాలి. కేవలం నిద్రపోవడం తప్ప ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. నిద్రపోవడం ఇష్టమైతే మీరూ ఈ ఇంటర్న్‌షిప్‌కు అప్లై చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం... 100 రోజులు నిద్రపోయి రూ.1,00,000 పారితోషికం తీసుకోవాలనుకుంటే వేక్‌ ఫిట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:

IRCTC Araku Tour: అద్దాల రైలులో అరకు వెళ్తారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ఇదేWhatsApp Fingerprint: మీ వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్ కోసం సెట్టింగ్స్ మార్చండిలా

LIC Agent: టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్‌గా అవకాశాలు... దరఖాస్తుల్ని కోరుతున్న కంపెనీ
First published: November 29, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading