జీవితాంతం కష్టపడి పదవీ విరమణ (Retirement) తర్వాత హాయిగా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని చాలా మంది భావిస్తారు. ఇందుకోసం అన్నేళ్లూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని పొదుపు చేస్తారు. అయితే ఇందుకోసం సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. అందులోనూ భారత ఆర్థిక వ్యవస్థలో రిటైర్మెంట్ ఆదాయ మార్గాల కోసం ప్లాన్లకు కొరతే లేదు. ఈ కారణంగా సరైన ప్లాన్ ఎంచుకోవడం అన్నది ముఖ్యమైన విషయం. చేతిలో ఎంత డబ్బు ఉంది. అందుకు తగ్గ స్కీములు ఏమున్నాయో చూసుకోవాలి. అందుబాటులో ఉన్న ప్లాన్స్‌తో పోల్చుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత భవిష్యనిధి (Provident Fund) సరైనది అనుకోవచ్చు. ఇందులో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అని రెండు రకాలున్నాయి. రెండింటికీ ఆదాయపు పన్ను చట్టం 1961లో సెక్షన్ 80సీ కింద టాక్స్ మినహాయింపు ఉంది. వీటిని విశ్లేషిద్దాం.
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF):
ఇది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కి పొడిగింపు. అంటే ఈపీఎఫ్ (Extension Provident fund)లో ఉద్యోగి తన జీతంలో కొంత భాగాన్ని స్వచ్ఛందంగా తన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లోకి పంపిస్తారు. 20 మందికిపైగా ఉన్న కంపెనీలో ఉద్యోగులు EPF (Employee Provident Fund) రూల్స్ ప్రకారం EPF అకౌంట్ కలిగి ఉండటానికి చట్టబద్ధత ఉంటుంది. ఒక ఉద్యోగి తన జీతం నుంచి ఈపీఎఫ్ కింద 12 శాతం (బేసిక్ పే + డియర్నెస్ అలవెన్స్) ఇవ్వాల్సి ఉంటుంది. అదే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)లో వ్యక్తులు పైన చెప్పిన మొత్తం కంటే అదనపు మొత్తాన్ని అందించాలి. అదనపు మొత్తాన్ని అందించడం తప్పనిసరి కాదు.
EPF లాక్ అయిన మొత్తాన్ని రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యే వరకు కదిలించడానికి వీలులేదు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. దీన్ని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లేదా EPFO నిర్ణయిస్తాయి.
VPFలో చూడాల్సిన అంశాలు:
-VPFలో నెలవారీగా ఓ ఉద్యోగి తన జీతంలో 100 శాతం (బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్) జమ చేసుకోవచ్చు.
- ఉద్యోగి రిజైన్ చేయాలనుకున్నప్పుడు లేదా రిటైర్ అయినప్పుడు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ పనిచేస్తూనే ఉంటుంది.
- సంస్థ మారినప్పుడు EPF ఖాతాలను బదిలీ చేసుకోవచ్చు.
- IT చట్టం 1961 80సీ కి VPFకి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):
ఇది VPF లాగా కాకుండా అందరికోసం ఉన్న ప్రభుత్వ మద్దతు గల పెట్టుబడి ప్లాన్. 80సీ కింద సంవత్సరానికి 1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. సంవత్సరానికి రూ.1.5 లక్షల ఎక్కువ డిపాజిట్ చేడానికి వీలు లేదు. ప్రభుత్వ బాండ్లపై ప్రస్తుతం ఉన్న రేట్ల ఆధారంగా ప్రతి 3 నెలలకు ఓసారి పీపీఎఫ్ వడ్డీ రేటును కేంద్రం డిసైడ్ చేస్తుంది. పీపీఎఫ్‌లో 7.1 శాతం వడ్డీ రేటు ఉంది. వీపీఎఫ్ లో 8.65 శాతం వడ్డీని పొందుతారు.
VPF Vs PPF వడ్డీరేటు..
- ప్రతి భారతీయుడు పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. మెచ్యూరిటీ కోసం పీపీఎఫ్ ఖాతాదారులు ఏడాదికి కనీసం రూ.500 ఇవ్వాలి. పీపీఎఫ్ మెచ్చురిటీ కాలం 15 ఏళ్లు. పీపీఎఫ్ వినియోగదారులు లాక్ ఇన్ వ్యవధిని 5 ఏళ్ల బ్లాక్ ద్వారా పొడిగించవచ్చు.
ఇది కూడా చదవండి:Belly Fat Burn: పొట్ట పెరిగిపోతోందా... వెంటనే ఈ హెల్త్ ఫార్ములా స్టార్ట్ చెయ్యండి
వీపీఎఫ్, పీపీఎఫ్ రెండింటికి సావరిన్ హామీలు ఉన్నాయి. రాబడిని ఇవ్వడమే కాకుండా పన్ను మినహాయింపులూ లభిస్తాయి. మీ అర్హత, పరిస్థితులను బట్టి ఈ రెండు పథకాలూ రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఉపయోగపడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.