హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

What an Idea: ఐడియా అంటే ఇది.. కుక్కర్ ప్రెజర్‌తో క్షణాల్లోనే వేడి వేడి కాఫీ.. టేస్ట్ కూడా అదుర్స్.. వైరల్ వీడియో

What an Idea: ఐడియా అంటే ఇది.. కుక్కర్ ప్రెజర్‌తో క్షణాల్లోనే వేడి వేడి కాఫీ.. టేస్ట్ కూడా అదుర్స్.. వైరల్ వీడియో

వాట్ ఏన్ ఐడియా సర్ జీ

వాట్ ఏన్ ఐడియా సర్ జీ

Cooker Coffe: సరికొత్త ఆలోచనలు రావలి.. పక్కగా వాటిని అమలు చేస్తే సక్సెస్ అవ్వడం ఖాయం. తాజాగా ఓ వ్యక్తి వినూత్న ఆలోచన అతడిని హైలెట్ అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాట్ ఏన్ ఐడియా బ్రదర్ అంటూ నెటిజన్లు తెగ సంబరపడుతున్నారు.

ఇంకా చదవండి ...

  What an Idea Coffee In Cooker: కరోనా కష్టకాలంలో చిన్న చిన్న కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్న వ్యాపారాలు మూత పడ్డాయి. చిన్న చిన్న షాపుల్లో పని చేసేవారు. చిన్న చిన్న ఆఫీసుల్లో పని చేసేవారు.. చాలామంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటికీ మూడు పూట్ల తిండి తినలేని పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి కష్ట సమయంలోనూ కాస్త తెలివిగా ఆలోచిస్తే ఈజీగా ఆదాయం సంపాదించవచ్చు.. అలాగే ఓ ఐడియాతో సరికొత్త చాయ్ వాలా అవతారమెత్తి అందరితో సూపర్ గురు అనిపించుకుంటున్నాడు ఓ వ్యక్తి.. సాధారణంగా ప్రతి ఒక్కరు తమ రోజును ఒక కప్పు కాఫీ లేదా టీతో ప్రారంభిస్తూ ఉంటారు. ఇంట్లో ఛాయ్ తాగే పరిస్థితి లేని వారు.. బయట ఎక్కడ దొరుకుతందా అని వెతుక్కొని మరీ తాగుతారు. నోట్లో టీ లేదా కాఫీ దిగనిదే రోజు ప్రారంభమైనట్టు ఉండదు కొందరికి. ఉదయాన్నే కాదు సాధారణంగా అలసటగా ఉన్నా.. తలనొప్పి అనిపించినా..? కాఫీ తాగి రిలాక్స్ అవుతారు. ప్రపంచంలోని చాలామంది కాఫీతోనే ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు. అందుకే కాఫీని ఎక్కువమంది తాగుతుంటారు.

  సాధారణంగా కాఫీ ఎలా తయారు చేస్తారన్నది చాలామందికి తెలిసిందే.. ముందు పాలను వేడి చేసి.. దానిలో కొంచెం చక్కెర వేసి.. ఆ తర్వాత కాఫీ పొడిని వేస్తారు. ఈ విధంగా తయారు చేయడాన్ని చాలాసార్లు చూసి ఉంటారు. చేసి ఉంటారు. కానీ ఈ వ్యక్తి కాస్త కొత్తగా.. వింతగా ఆలోచించాడు. కాఫీ ఇలా కూడా తయారు చేస్తారా..? అని నోరువెళ్లబెట్టేలా చేస్తున్నాడు గ్వాలియర్ కు చెందిన ఓ వ్యక్తి. అతడి కాఫీకి ఎక్కడ లేని డిమాండ్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతడి దగ్గర కాఫీ తాగుతూ ఉంటారు. ఇంతకీ ఈ కాఫీ వాల స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా..?

  ప్రెజర్ కుక్కర్‌ని ఉపయోగించి కాఫీ తయారు చేయడం గురించి ఎప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా..? ఇటీవల, గ్వాలియర్ కు చెందిన ఈ వ్యక్తి వేడి వేడి కాఫీని అలా ప్రెజర్ కుక్కర్ తో చేస్తూ.. తన కాఫీకి డిమాండ్ పెంచుకుంటున్నాడు. అతడు కాఫీ తయారు చేయడాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @eatthisagra యూజర్‌ అప్‌లోడ్ చేశారు.

  తన సైకిల్‌పై రుచికరమైన కాఫీని విక్రయిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. కాఫీ చేయడానికి, అతను మొదట పాలు, కాఫీపొడి, చక్కెరను ఒక జగ్గులో వేస్తున్నాడు. ఆ తర్వాత దానిని వేడి చేయడానికి కుక్కర్‌కుతో ప్రెజర్ కంట్రోల్డ్ పైపును పాలమిశ్రమంలో ముంచుతున్నాడు. ఆ తర్వాత లాక్‌ తిప్పగానే కాఫీ నురుగులు పొంగుకుంటూ వేడివేడిగా తయారవుతుంది. వేడి అయిన తర్వాత చివరగా ఆ మిశ్రమంపై కొంచెం కాఫీ చల్లి కస్టమర్లకు ఇస్తున్నాడు.

  ఈ వీడియోను అప్‌లోడ్ చేసినప్పటి నుంచి దాదాపు రెండు మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. దాదాపు 30 వేల మంది లైక్‌ చేశారు. దీంతో పాటు ఈ వీడియోను చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యక్తి నైపుణ్యానికి అందరూ సెల్యూట్‌ చేస్తున్నారు. అతని ప్రత్యేకమైన కాఫీని చూస్తుంటే.. తాగాలనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: IDEA, Nice idea, Viral, Viral Video

  ఉత్తమ కథలు