హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

వినాయక విశ్వరూపం: ఫృథ్వీ గణపతి

వినాయక విశ్వరూపం: ఫృథ్వీ గణపతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గణపతి తత్త్వాన్ని గురించి ఎన్ని రకాలుగా విశ్లేషించినా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టసాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సంపూర్ణమైన సృష్టికి ప్రతిబింబం. ఆయన జీవుడికి, దేహాత్మ భావనకు ప్రతీక.

పూర్ణ సృష్టికి సంకేతం గణపతి! గణపతి ఓంకార స్వరూపం. బృహస్పతి, బ్రహ్మణస్పతి కూడా గణపతేనని వేదాలు చెప్తున్నాయి. ఆయనే పరతత్వం. గాణాపత్య మార్గంలో గణపతిని పరబ్రహ్మస్వరూపంగా భావించి పూజిస్తారు. జానపదులు పంటల దేవుడిగా పూజిస్తారు. ఖగోళ శాస్త్రంలో కూడా గణపతిని గూర్చిన ప్రస్తావన ఉంది. గణపతి తత్త్వాన్ని గురించి ఎన్ని రకాలుగా విశ్లేషించినా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టసాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సంపూర్ణమైన సృష్టికి ప్రతిబింబం. ఆయన జీవుడికి, దేహాత్మ భావనకు ప్రతీక.

ఎందుకంటే గణపతి మూలాధారంలో ఉంటాడు. సమస్త శరీర భారాన్ని మోసేది మూలాధారం. సమస్త జీవకోటికి ఆధారభూతమైనది భూమి. గణపతి ఈ పృథ్వీతత్త్వానికి ప్రతీక. కాబట్టే గణపతి స్వరూపం మనకు స్థూలంగా కనిపిస్తుంది. మెటీరియల్ ఎప్పుడూ స్థూలంగానే ఉంటుంది. అందుకే గణపతి శరీరం భారీగా ఉంటుంది. పెద్ద జంతువు ముఖం, బానపొట్ట, భారీ కాయం.. వెరసి గణపతి స్వరూపం. అనంతమైన శూన్యం నుంచి.. మొదట పదార్థం ఉద్భవించింది. దాని నుంచి ప్రకృతి ఆవిర్భవించింది. ఆ ప్రకృతికి ప్రాణశక్తి లభించింది. దాని నుంచి జలచర, భూచరాదులతో కూడిన జీవజాలం పుట్టాయట. ఆ తరువాత మనస్సు కలిగిన మనిషి పుట్టడం. ఈ పరిణామక్రమానికంతటికీ గణపతి ప్రతిరూపంగా కనిపిస్తాడని చెబుతారు.

స్థూలకాయం పదార్థమైతే, గజముఖం విశ్వంలోని జీవజాలానికి చిహ్నమట. అందుకే గణపతికి జంతువులలో అతి పెద్దదైన ఏనుగు ముఖం ఉంటుంది. అందుకే ఆయన గజముఖుడయ్యాడు. దానితో పాటే మానవ శరీరాన్నీ గణపతి కలిగి ఉన్నాడు. ప్రకృతితో మమేకం అయ్యాడు కాబట్టి.. ఆయనను ప్రకృతిలోని సమస్తమైన పత్రాలతో, పూవులతో పూజిస్తారు. ఇంతటి మూర్తిమంతమైన శక్తికి.. దైవత్వాన్ని ఆపాదించుకోవడం... భారతీయ సంస్కృతిలోని ఒక విశేషమైన సంప్రదాయానికి, అపురూపమైన ఆధ్యాత్మిక భావ సంపదకు సంకేతమని చెబుతారు. ప్రతి మనిషి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుందని అంటారు. అసలు ఇదంతా అటుంచితే... అన్నిటికన్నా మించి మానవుడు మానవుడిగా మాత్రమే కాక, దైవత్వాన్ని సాధించడం లక్ష్యంగా జీవించాలని సూచిస్తుంది గణపతి తత్వం.

First published:

Tags: Vinayaka Chavithi

ఉత్తమ కథలు