కరెంటు స్విట్చ్ బోర్డులపై శానిటైజర్ రాస్తున్నారా... జాగ్రత్త

కరోనాను దూరం పెట్టే శానిటైజర్ వాడకం బాగా పెరిగింది. ఐతే... చాలా మంది ఇళ్లలో స్విట్చ్ బోర్డులపై శానిటైజర్ రాస్తున్నారు. అలా చేయడం వల్ల అగ్నిప్రమాదం జరిగే ఛాన్స్ ఉందా?

news18-telugu
Updated: August 9, 2020, 12:40 PM IST
కరెంటు స్విట్చ్ బోర్డులపై శానిటైజర్ రాస్తున్నారా... జాగ్రత్త
కరెంటు స్విట్చ్ బోర్డులపై శానిటైజర్ రాస్తున్నారా... జాగ్రత్త (credit - twitter)
  • Share this:
ఆ మధ్య ఓ కుర్రాడు... తన బైక్ మొత్తానికీ శానిటైజర్ పూశాడు. తర్వాత ఓ షాపుకి వెళ్లి ఎండలో బైక్ ఉంచాడు. లాంగ్ డ్రైవ్‌కి వెళ్లే ఉద్దేశంతో... బైకులో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించాడు. షాపుకి వెళ్లి సామాన్లు కొంటుంటే... ఒక్కసారిగా శానిటైజర్... ఎండల వల్ల మండింది. ఆ మంటల్ని ఆర్పేలోపే... అవి పెట్రోల్ ట్యాంక్‌కి అంటుకున్నాయి. దాంతో... బైక్ కాలి బూడిదైంది. తాజాగా... విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వెనక కూడా... శానిటైజర్ కారణం అయి ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే... ఆస్పత్రిని శుభ్రం చేసే క్రమంలో... గోడలు, మెట్లు, నేల, స్విట్చ్ బోర్డులపై కూడా శానిటైజర్ పూస్తున్నట్లు తెలిసింది. ఆ శానిటైజర్... కరెంటుతో కలవడంతో... మంటలు వ్యాపించి ఉండొచ్చని తెలుస్తోంది. అందువల్ల స్విట్చ్ బోర్డులకు శానిటైజర్ రాయకపోవడమే మేలు.


శానిటైజర్ చేతులకు రాసుకుంటే... ఆ చేతులకు మంటలు అంటినా... ఏమీ కాదు. ఎందుకంటే శానిటైజర్‌తో వచ్చే మంటలు చల్లగా ఉంటాయి. ఐతే... శానిటైజర్ ద్వారా... వ్యాపించే మంటల వల్ల వస్తువులు కాలితే... అవి అగ్ని ప్రమాదానికి దారి తీస్తాయి. అందుకే ఇప్పుడు శానిటైజర్‌ను ఎలా వాడాలన్న అంశంపై చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు రేపో, మాపో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వాల అధికారిక మార్గదర్శకాలు వచ్చే లోపు... ఎవరికి వారు... తమ ఇళ్లలో స్విట్చ్ బోర్డులు, ఎలక్ట్రిక్ పరికరాలకు శానిటైజర్‌ను రాయకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటే... దాన్ని అడ్డుకునేందుకు ఇసుక, నీరు వంటివి రెడీగా ఉంచుకోవాలి. వీలైతే... ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ (Fire Extinguisher) కొనిపెట్టుకుంటే మంచిదే... దాని ధర రూ.1000 దాకా ఉంటుంది. అంత రేటు పెట్టి ఏం కొంటాం అనుకునే కంటే... కొనుక్కోవడం మంచిదే ఎందుకంటే... అగ్ని ప్రమాదం జరిగితే... కలిగే నష్టం ఎంతైనా ఉండొచ్చు. ప్రణాలే పోతున్నాయి. కాబట్టే... అగ్ని ప్రమాదాల్ని తేలిగ్గా తీసుకోకపోవడం అందరికీ మేలే.
Published by: Krishna Kumar N
First published: August 9, 2020, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading