Video: చీరకట్టులో చిట్కాలు... పాటిస్తే మీకే లైకులు

చీరకట్టులో చిట్కాలు... (image credit - youtube)

Viral Videos: చీర... అమ్మాయిలకు అందాన్ని పెంచుతుంది. వారిని మరింత హుందాగా చూపిస్తుంది. అదే చీరలో ఎన్నో అందాల రహస్యాలు దాగి ఉంటాయని కవులు చెబుతూనే ఉంటారు. మరి చీర ఎలా కడితే అదిరిపోతుందో తెలుసుకోండి.

 • Share this:
  Viral Videos: భారతీయ మహిళకు నిదర్శనం చీర. చీరకట్టును చూస్తే చాలు... ఇండియన్ అని ఈజీగా గుర్తుపట్టేస్తారు ప్రపంచంలో ఎవరైనా. మిగతా మోడ్రెన్ డ్రెస్సులపై చాలా మంది అభ్యంతరాలు చెబుతుంటారు కానీ... చీర కట్టుకుంటే మాత్రం మెచ్చుకుంటారు. నా దిష్టే తగిలేలా ఉంది అంటారు. చీరకు భారతీయులు ఇచ్చే ప్రాధాన్యం అలాంటిది మరి. నిజమే... ఈ చీరలో ఏదో మ్యాజిక్ ఉంది అంటారు కవులు. అందాలు కనిపించీ, కనిపించకుండా కనికట్టు చేయడం చీరవల్లే సాధ్యమంటారు. ఆ నడుం ఒపుల్ని ఒడిసి పట్టేలా... కళ్లను కట్టిపడేసేలా చేయడం శారీకే చెల్లుతుందంటారు. సరిగ్గా కట్టుకుంటే... చీరను మించిన అందం... ఇంకే డ్రెస్సులోనూ ఉండదంటారు.

  విదేశీ కల్చర్‌కి ఎట్రాక్ట్ అవుతున్న నేటి తరం అమ్మాయిలకు చీర కట్టుకోవడం సివిల్స్ పరీక్ష లా తయారైందనే వాదన ఉంది. ఎప్పుడో పండగలు, ఫంక్షన్లకు తప్పితే... రెగ్యులర్‌గా చీరలు ధరించట్లేదని ఫీలయ్యేవారూ ఉన్నారు. అఫ్‌కోర్స్... వారి డ్రెస్సింగ్ వారి ఇష్టం. దానిపై కామెంట్ చెయ్యడం కరెక్టు కాదు. కాకపోతే... నేల విడిచి నింగిలో సాము చెయ్యకూడదు అన్నట్లుగా... మన కల్చర్ వదిలేసి... పూర్తిగా ఫారిన్ ట్రెండ్ అలవాటు చేసుకోవడం మంచిది కాదనే అభిప్రాయం ఉంది.

  How To Wear Saree Easily, How to wear perfect saree, Designer Saree Blouse Draping, beautiful Wedding Sari Choli Stylist Drape, Beautiful Saree Drape In simple Step, How To Wear Saree For Wedding, How To Look Thin In Saree Drape, Learn Saree Sari and Blouse Wearing To Look Slim Tall, Proper Saree Draping Video, How To Wear Heavy Saree Blouse, viral video, viral news, చీర ఎలా కట్టుకోవాలి, చీర చిట్కాలు, చీర కట్టుకునే చిట్కాలు,
  చీర ఇలా కడితే.. మగాళ్లకు ముచ్చెమటలే! (image credit - youtube)


  అసలు సమస్యేంటంటే... చీర ఎలా కట్టుకోవాలో చాలా మంది అమ్మాయిలకు తెలియట్లేదు. హాఫ్ శారీ కట్టుకొని గుడికి వెళ్లాలని ఉన్నా... ముందు ఆ శారీ ఎలా కట్టుకోవాలో, ఎలా చుట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు ఎలా కట్టుకోవాలో చెప్పినా... అప్పటికి సరే అంటూ... ఆ తర్వాత మర్చిపోతున్నారు. చీరలో పెరిగిన అందంతో ఆనందంగా సెల్ఫీలు తీసుకొని ముచ్చట పడుతున్నా... ఆ తర్వాత మళ్లీ ఆ చీరలు అల్మరాలోకి వెళ్లిపోతున్నాయి.

  ఇది కూడా చదవండి: Vastu tips: ఆ పూలతో అరిష్టం... అవి ఇంట్లో ఉంటే అప్పులే!

  ఈ క్రమంలో చీర ఎలా కట్టుకోవాలి, ఎలా చుట్టుకోవాలి, కుచ్చిళ్లు ఎలా సెట్ చేసుకోవాలి, చీర జారిపోకుండా... ఎక్కడెక్కడ ఎలా పిన్నులు పెట్టుకోవాలి... అని చెప్పేందుకు యూట్యూబ్‌లో చాలా వీడియోలు ఉన్నాయి. వాటిలో ఓ ఛానెల్ వీడియోలను అమ్మాయిలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. యూట్యూబ్‌లోని స్వాతి మల్లిక్ (Swati Mallick) అనే ఛానెల్‌లో మహిళ చీరకట్టులో చిట్కాలు చక్కగా చెబుతున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. దీన్ని 20 లక్షల మందికి పైగా చూశారు. చిత్రమేంటంటే... అబ్బాయిలు కూడా తాము చీర ఎలా కట్టుకోవాలని కామెంట్లలో అడుగుతున్నారు.

  ఇదే కాదు... ఈ ఛానెల్‌లో ఇలాంటి చిట్కాల వీడియోలు చాలా ఉన్నాయి. వీటిలో డిజైనర్ శారీ బ్లౌజ్ డ్రేపింగ్, వెడ్డింగ్ శారీస్, హాఫ్ శారీస్, మోడ్రన్ శారీస్, పట్టు, బెనారస్, కంచి, ధర్మవరం, నార్త్ ఇండియా శారీస్, ఇలా రకరకాల చీరలు ఎలా కట్టుకోవాలి అనే వీడియోలు ఉన్నాయి. వాటిని నెటిజన్లు తెగ చూస్తున్నారు. ఈ కింది వీడియో 5 ఏళ్ల కిందటిది. దీనికి ఇప్పటివరకు 4.66 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే... చీరలు, చిట్కాలను తెలుసుకునేందుకు యువత ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.


  ఇది కూడా చదవండి: Video: రోడ్డు దాటుతున్న చిన్నారి.. సరిగ్గా అప్పుడే వేగంగా వచ్చిన కారు... ఆ తర్వాత

  2012లో ప్రారంభమైన ఈ ఛానెల్‌లో ఇప్పటివరకూ 350కి పైగా వీడియోలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ వీడియోలు శారీ ఎలా కట్టుకోవాలి అనే చిట్కాలతోనే ఉన్నాయి. వీటికి ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంటే... శారీ ఎలా కట్టుకోవాలి అనే అంశాన్ని యువత చాలా లోతుగా, డీటెయిల్‌గా... పీహెచ్‌డీ చేస్తున్న స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని అనుకోవచ్చు.
  Published by:Krishna Kumar N
  First published: