Home /News /life-style /

VERY RARE AND BEAUTY FULL FISH FOUND IN VISAKHAPATAN SEA ITS CALLED ANGLE FISH NGS

Wonder Fish: మత్స్యకారుల వలలో అరుదైన చేప.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం.. దాని పేరేంటో తెలుసా..?

angle fish

angle fish

very rare fish: చేపల్లో చాలా రకాలు చూసే ఉంటారు.. కానీ ఇంత అందమైన చేపను ఎప్పుడైనా చూశారా..? అందానికి తగ్గట్టే దీని పేరు కూడా ఉంది. తాజాగా విశాఖపట్నంలోని ఓ మత్స్యకారుడి వలలో పడింది. ఇంతకీ దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

    Beautiful Fish: చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి.. కొన్ని అత్యంత బరువు ఉన్నవైతే.. మరికొన్ని అత్యంత పొడుగ్గా ఉంటాయి.. మరికొన్ని యమ రుచీగా ఉంటాయి.. మరికొన్ని భయపెట్టేవి ఉంటాయి. ఇలా చేపల్లో ఎన్నో రకాలు చూస్తూ ఉంటాం. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు అప్పుడప్పుడు వింత చేపలు  (Rare fish)దొరుకుతాయి వాటిని చూసి.. ఇవాళ తమ పంట పండింది అనుకుంటారు. కానీ ఈ చేప మాత్రం వెర్సీ స్పెషల్.. చూడ ముచ్చటగా ఉంది. ముఖ్యంగా సముద్రంలో చాలా రకాల అందమైన చేపలు ఉంటాయి.. వీటిలో ముఖ్యమైంది ఏంజెల్‌. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam district) అచ్యుతాపురం మండలం పూడిమడకలో మత్స్యకారులకు ఈ అరుదైన చేప చిక్కింది. దీనిని స్థానికంగా రాణి చేపగా పిలుస్తారు. స్థానికంగా రాణి చేపగా పిలుస్తారు. ఇది సముద్రంలో పగడపు దిబ్బల్లో ఉంటుందని, ఏడాదికి ఒక్కటి దొరకడమూ అరుదేనని పూడిమడక మత్స్యకారులు చెబుతున్నారు. అందమైన చారలతో ఆకట్టుకునే రూపంలో కనిపించే ఈ రాణి చేపలను.. ఎక్కువగా అక్వేరియంలో పెంచుకోవడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. సుమారు దీని బరువు 5 కిలోల వరకు పెరుగ డానికి అవకాశం ఉంటుంది. ఈ చేప శాస్త్రీయ నామం పోమాకాట్స్‌ అని మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు శ్రావణి కుమారి తెలిపారు. సముద్రపు చేపల్లో అందమైనదిగా దీనిని గుర్తించారని ఆమె స్పష్టం చేశారు.

    ఆకట్టుకునే రంగు, రూపం దీని సొంతం. కేవలం సముద్రంలోని పగడపు దిబ్బల్లో మాత్రమే ఉండే ఈ చేప ఏడాదికి ఒక్కటైనా చిక్కడం కష్టమేనన్నది మత్స్యకారుల మాట. ఈ చేపలు చిలుక ముక్కు ఆకారంలో బయటకు చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ నోరు తెరిస్తే మాత్రం ఓ పన్నుతో కాస్త చూసేందుకు భయంకరంగా ఉంటుంది అంట.. http://



    మత్స్యకారులు గంగమ్మ తల్లిని నమ్ముకొని జీవిస్తుంటారు. సముద్రంతోనే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. సముద్రంలో దొరికే మత్స్యసంపదే వారికి జీవనాధారం. ఒక్కోసారి రోజుల తరబడి వేటాడినా లాభం వేలల్లోనే ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం అనుకోని జాక్ పాట్ తగులుతుంటుంది. అరుదైన చేపలు చిక్కితే వారి జీవితాలు మారిపోతుంటాయి. రాణి చేప అనే కాదు.. కాసులు కురిపించే చేపలు కూడా అప్పుడప్పుడు జాలారులకు చిక్కుతాయి.

    Fish, Kachili Fish, Fishermen, Fishing Harbor, Andhra Pradesh News, Andhra News, AP News, Telugu News, East Godavari District, Rajahmundry, Kakinada, Breaking news in Telugu, Andhra Pradesh Breaking News, చేపలు, మత్స్యకారులు, కచ్చిలి చేప, ఫిషింగ్ హార్బర్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, కాకినాడ, తెలుగు బ్రేకింగ్ న్యూస్
    మత్స్యకారులకు చిక్కిన కచ్చిలి చేప


    ఇటీవల తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన కృష్ణాజిల్లా మచిలీపట్నం మత్స్యకారులకు పంట పండింది. వారి వలకు అరుదైన కచిలి చేపలు చిక్కాయి. 16 కిలోలున్న మగ చేప, 15 కిలోలున్న ఆడ చేప చిక్కాయి. దీంతో మత్స్యకారులు వాటిని ఫిషింగ్ హార్బర్ కు తీసుకొచ్చారు. ఈ చేపల కోసం వ్యాపారులు ఎగబడ్డారు. మార్కెట్లో మగ చేప లక్ష రూపాయలకు పైగా అమ్ముడవగా.. ఆడ చేప లక్షలోపు ధర పలికింది. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారని మత్స్యశాఖ అధికారులు చెప్పారు. ఇలా అప్పుడప్పుడు అరుదైన చేపలు మత్స్యకారుల చేతికి చిక్కుతూ వారికి ఆనందాన్ని ఇస్తాయి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Fish

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు