నేడే వసంతపంచమి.. సరస్వతీ దేవిని ఈ మంత్రంతో పూజించండి..

సరస్వతీ పూజ, అక్షరాభ్యాసం.. ఈ రెండు పనులు వసంతపంచమిరోజున ఎక్కువగా చేస్తుంటారు. ఈ రోజే ఈ కార్యాలు చేయడం వల్ల ఎన్ని లాభాలంటే..

Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 11:27 AM IST
నేడే వసంతపంచమి.. సరస్వతీ దేవిని ఈ మంత్రంతో పూజించండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 11:27 AM IST
వసంతపంచమి రానే వచ్చింది. మాఘశుద్ద పంచమినే వసంతపంచమి అంటారు. సరస్వతీ దేవి పుట్టినరోజునే వసంత పంచమి అంటారు. అందుకే, సరస్వతీ పూజ చేయడానికి ఈ రోజుని మించిన రోజు లేదనే చెప్పాలి.
మొదట విఘ్నాధిపతి గణపతిని పూజించాలి. వెంటనే సరస్వతీదేవి ప్రతిమ ముందు పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు ఉంచి షోడవోపచారాలతో మాతను పూజించాలి.
తల్లికి తెల్లని పూలు, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, తెలుపు వస్త్రాలతో అమ్మవారిని పూజించాలి.

మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ
పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయత: శుచి:
ఈ మంత్రాన్ని పఠిస్తూ.. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. అదేవిధంగా, ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే వాళ్లు విద్యావంతులవుతారని నమ్మకం. కాబట్టి, వసంతపంచమి రాగానే పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దిస్తారు. ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత రాయిస్తారు.First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...