NIN Study: మాంసాహారుల కంటే శాకాహారుల డైట్‌లోనే కొవ్వు ఎక్కువ.. తాజా అధ్యయనంలో ఆశ్చర్యపరిచే నిజాలు..!

ప్రతీకాత్మకచిత్రం

మాంసాహార డైట్ ఫాలో అయ్యే ప్రజల శరీరంలో ఎక్కువ కొవ్వు నిల్వలు ఉంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఇలాంటి ఎన్నో నమ్మకాలు ప్రజల్లో బాగా ?

  • Share this:
మాంసాహార డైట్ ఫాలో అయ్యే ప్రజల శరీరంలో ఎక్కువ కొవ్వు నిల్వలు ఉంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఇలాంటి ఎన్నో నమ్మకాలు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ సైంటిఫిక్ డేటా ప్రకారం పరీక్షిస్తే.. ఇది నిజం కాదని తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ ఆధారిత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) పరిశోధకులను కూడా ఓ నమ్మకం ఆశ్చర్యపరిచింది. ఈ పరిశోధకులు 7 మెట్రో నగరాల ప్రజల విజిబుల్ ఫ్యాట్ (నూనె, వెన్న, నెయ్యి, కొవ్వు వంటివి) వినియోగంపై ఒక విశ్లేషణ చేశారు. వారి విశ్లేషణలో మాంసాహారుల కంటే శాకాహారులే విజిబుల్ ఫ్యాట్ ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తేలింది.

వివరాల్లోకి వెళితే.. ఎన్ఐఎన్ పరిశోధకులు "ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్ ఇండియా 2019" కోసం న్యూట్రిషనల్ డేటాను విశ్లేషించారు. అనంతరం 'అసెస్మెంట్ ఆఫ్ విజిబుల్ ఫ్యాట్ కన్సమ్షన్' అనే నివేదికను ప్రిపేర్ చేశారు. అయితే వారి విశ్లేషణలో చాలా ఆశ్చర్యపరిచే నిజాలు బయటపడ్డాయి. ఎన్ఐఎన్ పరిశోధకులు హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాల్లోని ప్రజలపై అధ్యయనం చేపట్టారు. ఈ మహానగరాల్లో శాకాహారులు రోజుకు సగటున 40.4 గ్రాముల విజిబుల్ ఫ్యాట్ తీసుకుంటారని తేలింది. మాంసాహారులు మాత్రం రోజుకు కేవలం 30.1 గ్రాములు మాత్రమే తీసుకుంటారని విశ్లేషణలో వెల్లడైంది. అయితే కనిపించే కొవ్వు.. శాకాహారులు తరచుగా తినే తెల్ల బియ్యం, పరోటా వంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది.

మొత్తం ఏడు మహానగరాల్లో హైదరాబాద్‌లోనే తక్కువగా విజిబుల్ ఫ్యాట్ (రోజుకు 25గ్రా) వినియోగిస్తున్నట్లు తేలింది. హైదరాబాద్‌లో కమ్మటి మాంసాహార పదార్థాలు ఎన్నో దొరుకుతాయి కానీ నగరవాసులు విజిబుల్ ఫ్యాట్ చాలా తక్కువగా వినియోగిస్తున్నారు. విజిబుల్ ఫ్యాట్ వినియోగంలో ఢిల్లీ (44.4 గ్రా), అహ్మదాబాద్(43.9) నగరాలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ముంబయిలో రోజుకు 28.4 గ్రాముల విజిబుల్ ఫ్యాట్ వినియోగిస్తుండగా.. బెంగళూరులో 30.9 గ్రాములు.. కోల్‌కతాలో 37.3 గ్రాములు వినియోగిస్తున్నారు. ఏడు మెట్రో సిటీల్లో నిరక్షరాస్యుల్లో కంటే అక్షరాస్యులల్లోనే విజిబుల్ ఫ్యాట్ వినియోగం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

ఏడు మెట్రో సిటీల్లోని పట్టణ జనాభాలో రోజువారీ విజిబుల్ ఫ్యాట్ వినియోగం సగటున 33 గ్రాములుగా ఉంది. ఇది ఐసీఎంఆర్‌ సిఫార్సు చేసిన (22 గ్రాములు) స్థాయిల కంటే ఎక్కువగా ఉంది. దీన్నిబట్టి తీసుకునే మొత్తం ఎనర్జీలో 18 శాతం విజిబుల్ ఫ్యాట్ నుంచే లభిస్తుందని తెలుస్తోంది.
Published by:Krishna Adithya
First published: