Home /News /life-style /

VASTU TIPS IF SALT FALL DOWN ON FLOOR THAT FAMILY MAY FACES SOME PROBLEMS HERE INTERESTING DETAILS SK

Vastu Tips: మీ ఇంట్లో సమస్యలకు ఉప్పే కారణం కావచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: వంటింట్లో ఉప్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. చేతి నిండా డబ్బు ఉండాలి. పిల్లపాపలతో హాయిగా జీవించాలి. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా అంతా సాఫీగా సాగిపోవాలి. దీని కోసమే అందరూ తాపత్రయ పడతారు. డబ్బు, సంతోషం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎంత సీరియస్‌గా ప్రయత్నించినా చాలా మందికి సాధ్యం కాదు. మన వైపు నుంచి అంతా సవ్యంగానే ఉన్నా.. ఒక్కోసారి మన చుట్టూ ఉండే పరిసరాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. వాస్తు దోషాలే (Vastu Doshas) మీ సమస్యలకు కారణం కావచ్చు. అందుకే వాస్తు శాస్త్ర (Vastu Sashtra) ప్రకారం.. మీ ఇంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉండాల్సి వస్తువులు అక్కడే ఉండాలి. అనవసరమైనవి అస్సలు ఉంచుకోకూడదు. చాలా మంది వంటి గది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు సరిగ్గా లేకుంటే సమస్యలు వస్తాయని భావిస్తారు. వంట గదిలో చాలా వాస్తు దోషాలు ఉంటాయి. వాటిలో ఓ ముఖ్యమైన దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    Bathroom Vastu Tips: ఇంటి బాత్రూమ్ నియమాలు ఇలానే ఉండాలి... లేకుంటే ప్రమాదం

    ప్రతి ఒక్కరి వంట గదిలో ఖచ్చితంగా ఉండే పదార్థం.. ఉప్పు. ఒక గాసు లేదా ప్లాస్టిక్ సీసాలో ఉప్పును నిల్వ చేస్తారు. వంట చేసే సమయంలో స్పూన్‌తో ఉప్పు తీసుకొని కూరల్లో వేస్తుటారు. ఐతే అలా ఉప్పు వేస్తున్న సమయంలో ఒక్కోసారి అది కింద పడిపోతుంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషం నెలకొంటుంది. వాస్తు, జ్యోతిష్యం.. ఈ రెండు శాస్త్రాల ప్రకారం ఇంట్లో ఉప్పు పడిపోతే అది అశుభం కిందే లెక్క. ఉప్పును శుక్రుడు, చంద్రుడికి సంబంధించినదానిగా చెబుతారు. అందుకే ఇంట్లో ఉప్పు పడిపోతే.. ఈ రెండు గ్రహాలకు సంబంధించిన అశుభ ఫలితాలు కనిపిస్తాయని చాలా మంది విశ్వసిస్తారు. తద్వారా ఇంట్లో అనేక సమస్యలు వస్తాయని భావిస్తారు. వాస్తు, జ్యోతిష్య నిపుణులు సైతం ఇదే చెబుతున్నారు. అందుకే వంటింట్లో ఉప్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    జాగ్రత్త.. ఈ క్యాలండర్ మీ ఇంట్లో ఉంటే.. ఆ ఏడాది మొత్తం అశుభమే..!

    అ పరిశుభ్ర చేతులతో ఉప్పును ఎప్పుడూ తాకకూడదు. అసలు నేరుగా తాకకపోవడమే మంచిది. మీకు అవసరం అయినప్పుడల్లా స్పూన్‌తో వేసుకుటే బెటర్. ఉప్పును అపరిశుభ్ర చేతులతో తాకితే ఆ ఇంటి వారికి డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయట. ఎంత సంపాదించినా పర్సులో చిల్లిగవ్వ కూడా మిగలకుండా ఖర్చయిపోతాయట. ఉప్పుపై కాలు పెట్టడం చాలా అశుభం. ఉప్పు పడిపోయినప్పుడు పాదాలతో అటూ ఇటూ కదుపుతూ.. శుభ్రం చేయవద్దు. తడి గుడ్డతో తీసేయాలి. వారానికి ఒకసారి ఇంటి మూలల్లో ఉప్పును చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సానుకూల వాతావరణం నెలకొంటుంది. దుకాణాల్లో ఉప్పును డబ్బును చెల్లించే కొనాలి. అప్పుగా కొనకూడదు. అప్పుగా ఇవ్వకూడదు. అలా చేయడం అశుభం అని చాలా మంది విశ్వసిస్తారు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలను విశ్వసించే వారు ఈ జాగ్రత్తలను పాటించవచ్చు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Kitchen tips, Life Style, Lifestyle, Vastu Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు