Home /News /life-style /

Vastu Tips: అప్పుల బాధతో అల్లాడిపోతున్నారా? ఈ వాస్తు చిట్కాలతో అనూహ్య ఫలితాలు

Vastu Tips: అప్పుల బాధతో అల్లాడిపోతున్నారా? ఈ వాస్తు చిట్కాలతో అనూహ్య ఫలితాలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అనారోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఉండే కొన్ని దోషాల వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. ముఖ్యంగా తలతల మెరిసే ఫ్లోర్స్ (shiny floors) కారణంగా అప్పుల భారం పెరుగుతుందట.

ఇంకా చదవండి ...
భారతీయులు పూర్వకాలం నుంచి అనేక శాస్త్రాలను పాటిస్తూ వస్తున్నారు. వాటిలో వాస్తు శాస్త్రానికి (Vastu Shastra)  చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అనారోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఉండే కొన్ని దోషాల వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. ముఖ్యంగా తలతల మెరిసే ఫ్లోర్స్ (shiny floors) కారణంగా అప్పుల భారం పెరుగుతుందట. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా అప్పుల భారం తొలగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు పండితుల ప్రకారం, అప్పుల భారం తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు అనుసరించాలో చూద్దాం.

Vastu Tips: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? పని ఒత్తిడి పెరిగిందా? ఈ వాస్తు టిప్స్ మీ కోసమే

ఇంటిలోని నైరుతి (southwest), పశ్చిమ-ఉత్తర, మధ్య భాగంలో ఉండే ఫ్లోర్ (నేల) లేదా అద్దం చాలా ప్రకాశవంతంగా ఉంటే.. అది ఆర్థిక సమస్యలకు సూచిక అని గుర్తించాలి. ఈ ఫ్లోర్ తక్కువ ఎత్తులో లోతైన ప్రదేశంలో ఉంటే.. అది డబ్బు సంబంధిత సమస్యలను సూచిస్తుంది. మీ ఇంట్లో కూడా పైన చెప్పిన దిశలలో బాగా ప్రకాశవంతంగా మెరిసే ఫ్లోర్ ఉన్నట్లయితే.. ఆ నేలపై మందపాటి కార్పెట్ లేదా కార్పెట్ లేదా ఏదైనా వస్త్రం కప్పండి. ఇలా చేయడం వల్ల అప్పుల భారం నుంచి బయట పడవచ్చు.

దిండు కింద ఇనుప వస్తువులు పెట్టుకుని పడుకుంటే నిద్ర ప్రశాంతంగా పడుతుందట..ఇది నిజమేనా?

నైరుతి దిశలో ఉన్న నేలపై తలకిందులుగా అద్దం ఉంచడం ద్వారా నేల పైకి లేచినట్లు కనిపిస్తుంది. ఇది రుణ భారాన్ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఉత్తర లేదా తూర్పు దిశలలో అద్దం రివర్స్‌లో ఎట్టి పరిస్థితిల్లో పెట్టకండి. ఒకవేళ మీరు ఉత్తర లేదా తూర్పు దిశలో అద్దం తలకిందులుగా ఉంచినట్లయితే.. మీరు అప్పుల పాలవుతారు. ఎందుకంటే తప్పుడు దిశలో అద్దం పెట్టడం వల్ల అది వాస్తు దోషానికి దారి తీస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో ఉండే నెల కోసం తెల్లని పాలరాతి రాయిని ఎంచుకుంటే అంతా శుభమే జరుగుతుంది.

Sleep tips: ఉదయం నిద్ర లేవగానే అద్దంలో చూసుకుంటే మంచిది కాదా?

అదృష్టం వరించాలంటే.. మనం నిర్మించుకున్న ఇంటి వాస్తు సక్రమంగా ఉండాలంటారు పండితులు. అలాగే ఇంట్లో మనం అవలంబించే ప్రవర్తన, పూజావిధానాలు సక్రమంగా ఉండాలని సలహా ఇస్తుంటారు. సాధారణంగా ప్రజలు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా దేవుడిని పూజిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతర దిశలలో పూజించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిక్కుకు ఎదురుగా దేవుడిని పూజించడం వల్ల సంపద కోసం చేసే కోరికలు నెరవేరుతాయి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Life Style, Vastu, Vastu Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు