Valentine's Week 2020: వాలెంటైన్స్ వీక్‌.. ఈ వారంలో ఏ రోజు ఏ ప్రత్యేకమో తెలుసా..

Valentine's Week 2020: ప్రేమికుల రోజంటే యూత్‌కి యమా క్రేజ్. అయితే, కేవలం ఫిబ్రవరి 14న ఒక్కరోజే కాదు.. ఆ రోజుకి ముందు వారం నుంచే అంటే రేపు(7వ తేదీ) నుంచి ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అవేంటంటే..

news18-telugu
Updated: February 6, 2020, 6:33 PM IST
Valentine's Week 2020: వాలెంటైన్స్ వీక్‌.. ఈ వారంలో ఏ రోజు ఏ ప్రత్యేకమో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రేమ...అది రెండు హృదయాల ప్రతిస్పందన...మాటల్లో వర్ణించలేని భావన. ఆకాశమంత ఎత్తు..సముద్రమంతటి విశాలమైన ప్రేమను చాటేందుకు ఒక్క రోజు చాలదు. అనంతమైన ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రం ఒక రోజు ఉండాల్సిందే అంటారు ప్రేమికులు. ఎన్నో రోజులుగా తమ గుండెల్లో దాచుకున్న ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎందరో వాలెంటైన్స్ డే కోసం ఎదురుచూస్తున్నారు.  ప్రేమ బంధంతో ఒక్కటైన జంటలు కూడా వాలెంటైన్స్ డే కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేమ జంటలకు వాలెంటైన్స్ డే ఒక్కటే కాదు...అందుకు ముందు వారం రోజులపాటు సాగే వాలెంటైన్స్ వీక్ కూడా ఎంతో ముఖ్యంగా పరిగణిస్తారు. ఈ వాలెంటైన్స్ వీక్‌ను ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకునేందుకు సన్నద్ధమయ్యారు.   ఫిబ్రవరి 7న నుంచి 13 వరకు వాలెంటైన్స్ వీక్‌ను...ఆ తర్వాత ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేకి ఒక్కో ప్రత్యేకత ఉంది.

వాలెంటైన్స్ వీక్‌లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత:

ఫిబ్రవరి 7.. రోజ్ డే గా పిలిచే ఈ రోజున తమ మనసు దోచినవారికి గులాబీలు ఇస్తారు. ఇందులోనూ లాజిక్ ఉంది.. రెడ్ రోజ్ ఇస్తే లవ్‌, రోమాన్స్‌కి సింబాలిక్‌గా, ఎల్లో రోజ్ ఇస్తే ఫ్రెండ్షిప్ అని అంటారు.

ఫిబ్రవరి 8: ప్రపోజ్ డేగా పిలిచే ఈ రోజున ఇష్టమైనవారికి ప్రపోజ్ చేస్తారు. ఎదుటివారి నుంచి ఎలాంటి న్యూస్ వచ్చినా.. ప్రపోజ్ చేయాలనుకుంటారు.

Valentines Day 2020, valentines day week 2020, Valentines Day history, Valentines Day facts, history of Valentines Day, valentines day meaning, lovers day, February 14, వాలెంటైన్స్ డే 2020, వాలెంటైన్స్ డే చరిత్ర, వాలెంటైన్స్ డే ఎందుకు, వాలెంటైన్స్ డే అంటే ఏంటీ
ప్రతీకాత్మక చిత్రం


ఫిబ్రవరి 9: చాక్లెట్ డేగా పిలిచే ఈ రోజున ఇష్టమైన వారికి చాక్లెట్స్ ఇస్తారు. ప్రేమ ఎంతో మధురంగా ఉంటుందో తామిచ్చే చాక్లెట్స్ ద్వారా తెలియజేయాలనుకుంటారు.

ఫిబ్రవరి 10: టెడ్డీ డే గా పిలిచే ఈ రోజున  తాము ఇష్టపడేవారికి టెడ్డీ బేర్స్ గిఫ్ట్‌గా ఇస్తారు తమ గుర్తుగా..తద్వారా తమ ప్రేమను చాటుకుంటారు.
Valentines Day 2020, valentines day week 2020, Valentines Day history, Valentines Day facts, history of Valentines Day, valentines day meaning, lovers day, February 14, వాలెంటైన్స్ డే 2020, వాలెంటైన్స్ డే చరిత్ర, వాలెంటైన్స్ డే ఎందుకు, వాలెంటైన్స్ డే అంటే ఏంటీ
ప్రతీకాత్మక చిత్రం


ఫిబ్రవరి 11: ప్రామిస్ డే.. పెళ్లి ప్రమాణాలు ఉన్నట్లుగానే ఈ రోజున ప్రేమప్రమాణాలు ఉంటాయి. కష్టమైనా.. సుఖమైనా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతారు.

ఫిబ్రవరి 12: హగ్ డే.. కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క కౌగిలింత ద్వారా చెప్పొచ్చు. అంతటి మహత్తు ఈ కౌగిలింతలకి ఉంటుంది. అందుకే.. ఈ రోజున తమ ఫీలింగ్స్‌ని హగ్ ఇస్తూ తెలియజేస్తారు.

ఫిబ్రవరి 13: కిస్ డే.. ముద్దు.. ఎంతోమంది కవులు దీనిపై ఎన్నో కవిత్వాలు కూడా రాశారు. ప్రేమకి గుర్తుగా.. జంటలు ముద్దులోని తియ్యదనాన్ని ఆస్వాదిస్తారు.

ఫిబ్రవరి 14: వాలెంటైన్స్ డే: ఈ వారంలో చేసిన ప్రేమ తాలుకూ ప్రతిఫలమే వాలెంటైన్స్ డే .. సో.. ప్రతీ రోజుని ఆస్వాదించండి.. ప్రేమించండి..
First published: February 6, 2020, 6:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading