Valentine's Day Gift Ideas: ప్రేమికుల కోసం ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఆఫర్స్

Valentine's Day Gift Ideas | వాలెంటైన్స్ డే... ప్రేమికుల రోజు. ఈ రోజు వచ్చిందంటే ప్రేమికులకు పండగే. తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇదో మంచి అవకాశంగా భావిస్తారు. గిఫ్టులు కొనిస్తారు. అయితే గిఫ్టులు ఇవ్వడానికి డబ్బులు లేకపోతేనే ఇబ్బంది. మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా... తక్కువ ఖర్చుతో మీ ప్రేమను వ్యక్తం చేయొచ్చు. ప్రేమికుల కోసం ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఇస్తున్న ఆఫర్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: February 12, 2019, 5:58 PM IST
Valentine's Day Gift Ideas: ప్రేమికుల కోసం ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఆఫర్స్
Valentine's Day Gift Ideas: ప్రేమికుల కోసం ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఆఫర్స్
news18-telugu
Updated: February 12, 2019, 5:58 PM IST
ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రేమికులకు పండగే. ఫిబ్రవరి 7న రోజ్ డే, 8న ప్రపోజ్ డే, 9న చాక్లెట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే, 14న వాలెంటైన్స్ డే. ఇలా వరుసగా ఒక్కో సందర్భంలో ఒక్కోలా ప్రేమను వ్యక్తం చేస్తుంటారు ప్రేమికులు. తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇదో మంచి అవకాశంగా భావిస్తారు. గిఫ్టులు కొనిస్తారు. అయితే గిఫ్టులు ఇవ్వడానికి డబ్బులు లేకపోతేనే ఇబ్బంది. మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా... తక్కువ ఖర్చుతో మీ ప్రేమను వ్యక్తం చేయొచ్చు. ప్రేమికుల కోసం ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఇస్తున్న ఆఫర్స్ తెలుసుకోండి.

Cred: ఇటీవల ఫ్రీఛార్జ్ ప్రారంభించిన స్టార్టప్ ఇది. ఈ యాప్‌ ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేసినవారికి క్యాష్‌బ్యాక్స్ లభిస్తాయి. రివార్డ్ కూడా లభిస్తుంది. క్రెడ్ యాప్‌లో 10,000 కాయిన్స్ సంపాదిస్తే బైక్, లేదా కార్ రెంటల్ ఉచితం. 5000 క్రెడ్ కాయిన్స్ ఉంటే ఫ్లైట్ టికెట్లపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 20,000 క్రెడ్ కాయిన్స్‌తో గోల్డ్ మెంబర్‌షిప్ ఉచితం.

అమెజాన్‌: ప్రేమికుల కోసం అమెజాన్‌లో 'గిఫ్ట్ ఆఫ్ లవ్' పేరుతో ఆఫర్లున్నాయి. రూ.2,000 విలువైన గిఫ్ట్ కార్డ్ కొంటే రూ.200 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఐసీఐసీఐ యాప్‌తో కొనుగోలుపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్: ఫ్లిప్‌కార్ట్‌లో చాక్లెట్లు, రోజ్ ఫ్లవర్స్, మొబైల్ ఫోన్స్ కొనుగోలుపై మంచి ఆఫర్లున్నాయి. ఐ లవ్ ఎంఐ డేస్ పేరుతో షావోమీ నుంచి స్మార్ట్‌ఫోన్ ఆఫర్లున్నాయి.



యాపిల్-హెచ్‌డీఎఫ్‌సీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై యాపిల్ ఫోన్లు కొంటే రూ.7,000 క్యాష్‌బ్యాక్, ఐప్యాడ్, మ్యాక్ బుక్స్‌పై రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

పేటీఎం: 'ఫ్లై హై ఇన్ లవ్' పేరుతో పేటీఎంలో ప్లైట్ టికెట్లపై ఆఫర్లున్నాయి.
Loading....
Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు


ఇవి కూడా చదవండి:

కామర్స్‌లో పీజీ... జొమాటోలో డెలివరీ బాయ్... నిరుద్యోగ సమస్యకు సాక్ష్యం

LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

TRAI rules: ఛానెళ్లు సెలెక్ట్ చేసుకున్నారా? మీ కేబుల్ బిల్ ఇలా మారుతుంది

 
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు