HOME »NEWS »LIFESTYLE »vaccination card a must have for your child ns

టీకా (వ్యాక్సినేషన్) కార్డు: మీ పిల్లల కోసం తప్పనిసరిగా ఉండాలి

టీకా (వ్యాక్సినేషన్) కార్డు: మీ పిల్లల కోసం తప్పనిసరిగా ఉండాలి
ప్రతీకాత్మక చిత్రం

అయితే, మీ చిన్నారికి టీకాలు వేస్తే సరిపోదు. మీ చిన్నారికి నిపుణులు ఆమోదించిన షెడ్యూల్ ప్రకారం ఈ టీకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. టీకా కార్డు సరిగ్గా దాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది.

 • Share this:
  తల్లిదండ్రులు అవ్వడం అనే అనుభవం ఎంత ఆనందంగా ఉంటుందో, అంతే మహత్తరమైనది. మీకు అలసట అనిపించి ఉండకపోవచ్చు. మీ అమూల్యమైన చిన్నారికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు ఎల్లప్పుడూ ఆందోళనగా అనిపిస్తుంది. మీరు ఆశించేదల్లా వారికి ఉత్తమమైనవి అందించడం మరియు రోజులు గడిచేకొద్దీ వారు బలంగా లేదా ఆరోగ్యంగా పెరగడం. బాల్యం యొక్క ప్రారంభ రోజులలో, నవజాత శిశువు యొక్క రోగనిరోధక శక్తి ఇంకా అభివృద్ధి దశలోనే ఉంటుంది. ఇది మంచి పరిశుభ్రత, పోషణతో పాటు సరైన సమయంలో అందించే టీకాలతో నివారించగల అంటువ్యాధులు లేదా వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. పోలియో, టెటనస్, మీజిల్స్, కోరింత దగ్గు, మెనింజైటిస్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి మీ పిల్లలను రక్షించడానికి సరైన సమయములో టీకాలు వేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాక్సిన్లు మీ పిల్లల శరీరాన్ని ఈ వ్యాధులకు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించే వ్యాధుల యాంటిజెన్ల నుండి తయారవుతాయి. అందువల్ల, ఇవి మీ పిల్లల రోగనిరోధక శక్తిని పెంచి, వారు ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.

  ఇంకా, మీ శిశువుకు టీకాలు వేయడం ఈ హానికరమైన వ్యాధుల నుండి వారిని రక్షించడమే కాక, మీ కుటుంబ సభ్యులు మరియు మీ చుట్టూ ఉండే స్నేహితులను కూడా రక్షిస్తుంది. ఇది భవిష్యత్ తరాలను కూడా రక్షిస్తుంది - సాధారణ టీకాల మాదిరిగానే, మనం ప్రాణాంతక ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు మరియు నిర్మూలించవచ్చు. మశూచి విషయంలో మనం దీనిని చూశాము, కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రాణాంతకంగా నిలిచిన మశూచి విషయంలో ఈ విజయాన్ని మనం చూశాము.  అయితే, మీ చిన్నారికి టీకాలు వేస్తే సరిపోదు. మీ చిన్నారికి నిపుణులు ఆమోదించిన షెడ్యూల్ ప్రకారం ఈ టీకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. టీకా కార్డు సరిగ్గా దాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీ పిల్లల టీకా షెడ్యూల్‌ను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది, మీ చిన్నారిని తర్వాతి దానికి ఎప్పుడు తీసుకువెళ్ళాలో మీకు తెలియజేస్తుంది. సాధారణంగా, మీ పిల్లల వైద్యులు మీకు టీకా కార్డును ఇవ్వాలి, ఇందులో 18 సంవత్సరాల వయస్సు వరకు సిఫార్సు చేయబడిన అన్ని ముఖ్యమైన టీకాలు ఉంటాయి.

  మీ పిల్లలకి టీకా కార్డు తప్పనిసరిగా తీసుకోవటానికి కొన్ని కారణాలు కింద ఇవ్వబడ్డాయి:

  సురక్షితమైన మరియు సమర్థవంతమైన టీకా షెడ్యూల్
  టీకా కార్డులో మీ చిన్నారి టీకా షెడ్యూల్ ఉంటుంది, ఇవి గణనీయమైన శాస్త్రీయ పరిశోధనల తరువాత సృష్టించబడ్డాయి. ఈ టీకాలలో ప్రతీది మీ చిన్నారుల ఎదుగుదల ప్రకారం షెడ్యూల్ చేయబడతాయి. రెండు టీకాల మధ్య అంతరం ఒక నిర్దిష్ట వయస్సు లేదా సమయంలో మీ ఎదుగుతున్న పిల్లల రోగనిరోధక శక్తి అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. మెడికల్ బోర్డు సిఫారసు చేసిన టీకా షెడ్యూల్ మీ నవజాత శిశువుకు సురక్షితమైనది మరియు ప్రభావవంతంగా ఉంటుంది.

  మీ పిల్లల వైద్య రికార్డుగా పనిచేస్తుంది
  మీ పిల్లల టీకా కార్డులో మీ పిల్లల వైద్య రికార్డు యొక్క మొత్తం చరిత్ర ఉంటుంది. మీరు క్లినిక్‌లు, నగరాలు లేదా రాష్ట్రాలను మార్చినప్పుడు కూడా, టీకా కార్డు సహాయంతో మీ పిల్లలకు ఎప్పటికప్పుడు అందవలసిన టీకాలను వేయించవచ్చు. అన్ని ఎలక్ట్రానిక్ డేటా బదిలీ చేయబడి, ఆపై కంపైల్ చేయడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. వివరాలు, చరిత్ర, అన్నీ మీ చేతిలోనే ఉంటాయి!

  తల్లిదండ్రులుగా మీకు ప్రయోజనకరం
  టీకా రికార్డును కలిగి ఉండటం డేకేర్ ప్రొవైడర్లు, పాఠశాలలు, వైద్య నిపుణులు లేదా ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు వంటి అధికారులకు మీ చిన్నారి, సరైన సమయంలో టీకాలు వేయించుకుంటున్నారు అని, అలాగే ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి సురక్షితం అని తెలుసుకోవడంలో సహాయపడుతుంది. అదనంగా, టీకా కార్డు కలిగి ఉండటం తల్లిదండ్రులు తమ పిల్లల టీకా షెడ్యూల్‌ను సులభంగా ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

  మీ టీకా ప్రొవైడర్ కోసం ప్రయోజనకరమైనది
  టీకా కార్డులో మీ పిల్లల వైద్య చరిత్ర గురించి వివరణాత్మకంగా ఉంటుంది. వైద్య నిపుణులకు, ఇది ఏ సమయంలోనైనా ఉపయోగపడే సమాచారానికి ప్రయోజనకరమైన మూలం. టీకా కార్డు ఇప్పటికే పిల్లలకి ఏ టీకాలు వేయించారు లేదా మునుపటి మోతాదు వలన వారికి ఏవైనా అలర్జీలు వచ్చాయా అనేది తెలుసుకోవడానికి వారికి సహాయపడవచ్చు. మేము సకాలంలో టీకాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు దానిని రికార్డు ఉంచడం యొక్క ప్రాముఖ్యతను వివరించాము. వ్యాక్సినేషన్ (టీకా) కార్డ్ సహాయంతో మీ పిల్లల టీకాలను సమర్థవంతంగా ట్రాక్ చేయండి.

  బాధ్యత పరిమితుల ప్రకటన: సామాజిక స్పృహ కోసం GlaxoSmithKline Pharmaceuticals Limited, యానీ బెసెంట్ రోడ్, వొర్లీ, ముంబై, 400 030, ఇండియా ప్రారంభించిన కార్యక్రమం. ఈ మెటిరీయల్‌లో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే, వీటిలో ఏదీ వైద్య సలహా కాదు. మీ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం కోసం, ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే మీ చిన్నారుల వైద్యులను సంప్రదించండి. వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల జాబితా అలాగే ప్రతీ వ్యాధికి సంబంధించిన పూర్తి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కోసం మీ చిన్నారుల వైద్యులను సంప్రదించండి. GSK ఉత్పత్తుల వల్ల ఏదైనా తీవ్రమైన ప్రభావం ఏర్పడితే దయచేసి వాటిని india.pharmacovigilance@gsk.com ద్వారా కంపెనీకి తెలియచేయండి.

  NP-IN-MLV-OGM-200048, DOP Dec 2020
  Published by:Nikhil Kumar S
  First published:January 27, 2021, 18:45 IST