హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Guinness record of ayodhya deepotsav 2021: అయోధ్య దీపోత్సవ్‌కు గిన్నీస్‌ రికార్డ్‌!

Guinness record of ayodhya deepotsav 2021: అయోధ్య దీపోత్సవ్‌కు గిన్నీస్‌ రికార్డ్‌!

అయోధ్య దీపోత్సవ్‌

అయోధ్య దీపోత్సవ్‌

Ayodhya deepotsav: దీపావళి (diwali) వేడుకను అయోధ్యలో ప్రధానంగా జరుపుకొనే పండుగల్లో ఒకటి. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత రాముడు తన రాజ్యానికి ఈరోజే తిరిగి వచ్చినట్లు చెబుతారు.

ఉత్తరప్రదేశ్‌ (uttarpradesh) టూరిజం అయోధ్యలో 9 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నిస్‌ వరల్డ్‌ (Guinness record ) రికార్డు సాధించింది. ఈనెల నవంబర్‌ 3న ఉత్తరప్రదేశ్, డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా అవద్‌ విశ్వవిద్యాలయంతోపాటు పర్యాటక శాఖ దీపోత్సవం 2021 సందర్భంగా ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ప్రదర్శనలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ (yogi adityanath, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి, ట్రినిడాడ్, టోబాగో, వియత్నాం, కెన్యాకు చెంది) న రాయబారులు హాజరయ్యారు.

2020లో 5 లక్షల దీపాలను వెలిగించి యూపీ రికార్డు సృష్టించింది. కానీ, ఈ ఏడాది సరయూ నది ఘాట్‌ల వెంబడి దాదాపు 9.5 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డును బద్దలు కొట్టింది. ఇది మాత్రమే కాదు, అయోధ్యలోని అనేక ఇతర ప్రదేశాల్లో 3 లక్షలకు పైగా దీపాలు విడివిడిగా వెలిగించారు.

ఇది కూడా చదవండి: విరాట్‌ కోహ్లీ స్టైలిష్‌ గడ్డంలా మీరూ పెంచాలనుకుంటున్నారా?

దీపావళి (diwali) వేడుకను అయోధ్యలో ప్రధానంగా జరుపుకొనే పండుగల్లో ఒకటి. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత రాముడు తన రాజ్యానికి ఈరోజే తిరిగి వచ్చినట్లు చెబుతారు. అయోధ్య దీపోత్సవం నలుమూలల ప్రజలను ఆకర్షిస్తుంది. వెలుగల పండుగను పురస్కరించుకుని పలు ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహించారు. జానపద కళాకారులు ర్యాలీ, సరయూ హారతి, త్రీడీ హోలోగ్రఫిక్‌ షో, లేజర్‌ షోలు జరిగాయి. అయితే, ఇక్కడ రామ్‌లీలా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

రామ్‌కి పైడీ (సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్‌ల శ్రేణి)లోని 32 ఘాట్‌లలో దీపాలు వెలిగించారు. రామ్‌ కి పైడీతోపాటు నగరంలోని పలు రోడ్లు, దేవాలయాలను దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు.

ఇది కూడా చదవండి: Healthy garlic recipe: నోరూరించే గార్లిక్‌ పొటాటో ఫ్రై రెసిపీ!


ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడుతూ 2023 నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య ప్రపంచంలోనే అత్యుత్తమ ధార్మిక, ఆధ్యాత్మిక నగరంగా భారతదేశ సాంస్కృతి రాజధానిగా అవతరిస్తుందని ఆయన అన్నారు.

Published by:Renuka Godugu
First published:

Tags: Ayodhya, Diwali 2021

ఉత్తమ కథలు