హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Eye brows: మీ కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి

Eye brows: మీ కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహిళల అందాన్ని (Beauty) కనుబొమ్మలు మరింత పెంచుతాయి. అయితే చాలామందికి కనుబొమ్మలు ఎక్కువగా ఉండవు. కొంచెం పలుచగానే ఉంటాయి. మరికొందరికి ఎక్కువగా ఉన్నా మృదువుగా ఉండవు. అయితే ఈ కనుబొమ్మలు సరిగా లేకపోతే ముఖం (face) లో ఇట్టే తెలిసిపోతుంది.

ఇంకా చదవండి ...

మహిళల (women) అందాన్ని (Beauty) కనుబొమ్మలు మరింత పెంచుతాయి. అయితే చాలామందికి కనుబొమ్మలు ఎక్కువగా ఉండవు. కొంచెం పలుచగానే ఉంటాయి. మరికొందరికి ఎక్కువగా ఉన్నా మృదువుగా ఉండవు. అయితే ఈ కనుబొమ్మలు సరిగా లేకపోతే ముఖం (face) లో ఇట్టే తెలిసిపోతుంది. ఏదో వెలితిగా ఉంటుంది. అందుకే కనుబొమ్మలు మన అందాన్ని డిసైడ్​ చేస్తాయి అంటారు.కాగా, ఒకప్పుడు పలుచని కనుబొమ్మలు (Eye brows) ఫ్యాషన్ అయితే, మరొకప్పుడు బోల్డ్ ఐబ్రోస్ ఫ్యాషన్. ఇలా స్టైల్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు థిక్ ఐబ్రోస్ ఉండటం ఫ్యాషన్ గా మారింది. దీంతో ఇప్పుడు అందరూ నీటుగా మంచి షేపులో ఉండే కనుబొమ్మలు కోసం ట్రై చేస్తున్నారు. ఒక వ్యక్తి ముఖం (face) చూసి చూడగానే ముందు కనపడేవి వారు కనుబొమ్మలు అని కూడా చెప్పవచ్చు.  కొంతమంది సహజంగానే థిక్ ఐబ్రోస్ (Thick eyebrows) తో పుడతారు. మరి కొంతమందికి పల్చని కనుబొమ్మలు (Thin eyebrows) ఉంటాయి. అలాంటి వారికి కొన్ని చిట్కాల (Tips) ద్వారా మీ కనుబొమ్మలని థిక్ ఐబ్రోస్ గా మార్చుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, సి ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్ (Hair growth) కి హెల్ప్ చేస్తాయి. కనుబొమ్మల పైన ఆలివ్ ఆయిల్ ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల,  కొన్ని వారాల తర్వాత ఆశించిన ఫలితం కనబడుతుంది. మీ చేతి వేళ్ల మీద ఒక చుక్క ఆలివ్ ఆయిల్ (Olive oil) వేసుకొని,  కనుబొమ్మల మీద మసాజ్ (massage) చేయండి. రెండు గంటలు అలాగే వదిలేసి, ఆ తర్వాత ముఖం (face) కడుక్కోండి. ఇలా చేస్తే మీ ముఖంలో అందమైన కనుబొమ్మలు వస్తాయి.

కనుబొమ్మలు పెరగడానికి ఆముదం వాడటం చాలా పాత పద్ధతి.  ఇది బాగా ఎఫెక్టివ్ గా పనిచేసే పద్ధతి కూడా. ఆముదంలో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండటం వల్ల హెయిర్ గ్రోథింగ్ పెరుగుతుంది. మీరు కనుబొమ్మల మీద ప్రతిరోజు ఆముదం అప్లై చేయడం ద్వారా మీ ఐబ్రోస్ ఒత్తుగా, స్ట్రాంగ్ (Strong) గా పెరుగుతాయి.

కొబ్బరి నూనె (Coconut oil)ను అప్లై చేయడం వల్ల ఇది ఒక కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. ఇందువల్ల బ్లడ్ సర్కులేషన్ (Blood Circulation) కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్​లో ఉండే నాచురాలిటీ ప్రోటీన్స్ తో కలిసి వర్క్ చేస్తాయి. అంతేకాకుండా కొబ్బరి నూనెలో విటమిన్ ఈ,  ఐరన్ వంటి రకాల ప్రోటీన్స్ ఉండటం వల్ల కనుబొమ్మలు చాలా మందంగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టిప్స్​ పాటించడం వల్ల మీ అందం (beauty) రెట్టింపవడం ఖాయం.

ఇది కూడా చదవండి: చర్మం కాలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయకూడదు.. తెలుసా?

ఇది కూడా చదవండి: జుట్టు రాలిపోవడం ఆగాలంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండే బెటర్

First published:

Tags: Beauty tips, Face mask, Life Style

ఉత్తమ కథలు