Home /News /life-style /

USE THESE 5 HOME REMEDIES TO GET RELIES FROM NOSE BLOCKAGE PROBLEM RNK

Nose block: ముక్కుబ్లాక్ అయ్యిందని బాధపడుతున్నారా? ఈ 5 టిప్స్ తక్షణ ఉపశమనాన్నిస్తాయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home remedies: ముక్కు మూసుకుపోవడానికి సహజ మార్గాలు.. స్పైసీ ఫుడ్‌ను తినాలి. మిరపకాయలో క్యాప్సైసిన్‌ ఉంటుంది. ఇది నాసిక మార్గాన్ని ఓపెన్‌ చేస్తుంది.

కొన్ని సాధారణ ఫ్లూ (Flu) లక్షణాలు తేలికపాటి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారటం, బాడీ పెయిన్స్‌ వంటి సమస్యలు వస్తాయి. ముక్కు మూసుకుపోయేది (Nose block) ఫ్లూ సూచికనే. ఇది చికిత్స చేయకపోతే.. మనకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, మీ ముక్కును అన్‌బ్లాక్‌ చేయడానికి ఇక్కడ కొన్ని ప్రభావంతమైన ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

వేడినీరు..
జలుబు, ఫ్లూ లక్షణాలు ముఖ్యంగా ముక్కు మూసుకుపోతుంది. దీనికి వేడినీరు ఉత్తమ మార్గం. దీంతో మీరు హైడ్రేటెడ్‌గా ఉండటం కాకుండా ముక్కు బ్లాకేజీని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీరు, అల్లం, గ్రీన్‌ టీ ముక్కు బ్లాక్‌ను తగ్గిస్తుంది.దీంతోపాటు గొంతునొప్పిని కూడా తగ్గిస్తుంది. ముక్కు బ్లాక్‌కి సంబంధించిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది.

స్టీమింగ్‌..
ముక్కు బ్లాకేజీ చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ఇది సైనసెస్‌కు సంబంధించిన రక్తనాళాల్లో వాపు వల్ల కలుగుతుంది. అందుకే వెచ్చని ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. వెచ్చదనం తేమతోపాటు వాపును కూడా తగ్గిస్తుంది. తద్వారా ముక్కును క్లీయర్‌ చేయడం సులభతరం అవుతుంది.

ఇది కూడా చదవండి:  అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవాల్సిన వైద్య పరికరాలు..!


దీనికి ఒక గిన్నె వేడి నీటిపై మీ ముఖాన్ని ఉంచి .. మీపై నుంచి టవల్‌ వేసుకోవాలి. 5–10 నిమిషాలు శ్వాస పీల్చుకోవాలి. దీనికి మీ ముఖం కాలిపోకుండా దూరంగా ఉండాలి.



సెలైన్‌ స్ప్రే...

మీకు ఫ్లూ లేదా జలుబు ఉన్నపుడు మీ ముక్కు బ్లాక్‌ సమస్యకు సెలైన్‌ స్ప్రేలు మంచి మార్గం. ఇది మార్కెట్లో సులభంగా దొరికిపోతుంది. లేకపోతే ఇంట్లో తయారు చేసుకోవడానికి ఇలా చేయండి. ఉప్పునీరు మీ ముక్కు అన్‌బ్లాక్‌ చేయడానికి సహాయపడతాయి. కానీ, ఇది తరచూ చేస్తూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

ఎలా చేయాలి?
ముందుగా స్వచ్చమైన ఉప్పును వెచ్చటి, పరిశుభ్రమైన నీటిని కలపాలి. దీంతో సెలైన్‌ ద్రావణం తయారు చేసుకోవాలి. దీన్ని ఐసోటోనిక్‌ సొల్యూషన్‌ అంటారు. ఇది మీరు తయారు చేసినా.. ఓవర్‌ ది కౌంటర్‌ సెలైన్‌ సొల్యూషన్స్‌ సిఫార్సు చేస్తారు. ద్రావణం తయారైన తర్వాత స్క్వీజ్‌ బాటిల్‌ లేదా బల్బ సిరంజిలో వేసుకోవని ముక్కులో వేసుకోవాలి.

ముక్కు మూసుకుపోవడానికి సహజ మార్గాలు.. స్పైసీ ఫుడ్‌ను తినాలి. మిరపకాయలో క్యాప్సైసిన్‌ ఉంటుంది. ఇది నాసిక మార్గాన్ని ఓపెన్‌ చేస్తుంది.

ఇది కూడా చదవండి: మీ కుమార్తె ధైర్యవంతురాలైన మహిళగా ఎదగాలంటే.. ఆమె సొంతంగా ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిందే..


నోస్‌ కంప్రెస్‌..
ఒక టవల్‌ను గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని పిండి, ఫోల్డ్‌ చేయాలి. అప్పుడు మీ ముక్కు పైభాగంలో పెట్టాలి. వేడి వల్ల ఏదైనా నొప్పి ఉంటే తగ్గిపోతుంది. ఇది ముక్కును సమర్థవంతంగా పనిచేస్తుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Health care, HOME REMEDIES

తదుపరి వార్తలు