ప్రతీ ఇంట్లో చీమలు ఉండటం అనేది సర్వ సాధారణం. చక్కెరను దాచిపెట్టిన డబ్బాలను ఒక్కసారి తెరిచి చూడండి.. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వరసుగా లైన్లు కట్టి మరీ వచ్చి చక్కెరను ఎంచక్కా తినేస్తాయి. దీని వల్ల ఇంట్లో ఇల్లాలికి, వంట చేసే ప్రతీ వారికి కంగారుగానే ఉంటుంది. ఎక్కడ ఏది పెట్టినా.. చీమలు చుట్టుముడుతాయని ఆందోళనపడాల్సి వస్తుంది. స్వీటు, స్నాక్స్, హాట్ అని తేడా లేకుండా.. అన్నింటిపైనా దండెత్తేస్తాయి చీమలు. ఎంతో ఇష్టంగా వండుకున్న కూరలపై దండెస్తాయి. ఒక్క చక్కెరకు మాత్రమే చీమలు పడతాయని కాదు.. పొట్లంలో ఏమి ఉన్నా దూరేస్తాయి. గడపలు, గోడలు ఇలా ప్రతి ప్రదేశంలో పెద్ద కాలనీలను నిర్మించుకుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే ఇంటి పునుదే దెబ్బతినే అవకాశం ఉంటుంది.
తాజ్‌మహల్ లాంటి పెద్ద కట్టడానికి కూడా చీమలు పునాదిలో కన్నాలు పెట్టేశాయి. వీటిని వదిలించుకోవడానికి మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఎంత చేసినా అక్కడ నుంచి ఆ రోజు వరకు వెళ్లినట్లే వెళ్లీ మళ్లీ తెల్లారి వచ్చేస్తాయి. అయితే చీమలు నివారించడానికి మార్కెట్ లో దొరికే కొన్ని రకాల క్రిమిసంహారకమైన మందులు వాడటం వల్ల ఆ వాసన పడక అనారోగ్యానికి గురవుతుంటారు. అంతే కాకుండా ఆ కెమికల్ ఇంట్లో ఉండే.. మార్బుల్స్, టైల్స్ దెబ్బతినే అవకాశముంది. అదే చక్కటి హోం రెమిడీస్ ఫాలో అయితే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవేంటో తెలుసుకుందాం.. కాఫీ వాసన అనేది చీమలకు పడదు. చీమల చిక్కు వదిలించుకోవడానికి ఇదొక చక్కటి మార్గం.
కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ లేదా.. కాఫీ వడపోసిన తర్వాత వచ్చే పొడిని గానీ చీమలు ఉన్నచోట చల్లితే.. చీమలను ఈజీగా నివారించవచ్చు. దీనిని ప్రతీ ఒక్కరు రెమిడీగా ఉపయోగించవచ్చు. ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే... చీమల మందు వాడటం ప్రమాదకరం. ఆ స్మెల్‌తో పిల్లలు వాంతులు చేసుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చీమలు వచ్చే చోట తినే సోడాను చల్లవచ్చు. అంతేకాదు డస్ట్ బిన్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే అవి దగ్గరకు కూడా రావు. పుదినా వాసనకు చీమలు బెంబేలెత్తిపోతాయి. కొన్ని పుదిన ఆకులు తీసుకుని.. కాస్త ఎండనివ్వాలి. ఎండిపోయిన తర్వాత నలిపి.. పొడిని చీమలు ఉన్న ప్రాంతంలో చల్లితే చీమలు మాయమవుతాయి.
దాల్చిన చెక్క వాసన చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి దాల్చిన చెక్క పొడిని... చీమలు వచ్చే కన్నాల దగ్గర వేస్తే అవి అక్కడకు రావు. దానిని నీటిలో కలిపి అవి ఎక్కడ అయితే దార పెట్టాయో అక్కడ చల్లాలి.
చీమలను ఇంటి నుంచి పింపేయడంలో వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి ఆ నీటిని చీమల పుట్టలు, కాలనీలపై స్ప్రే చెయ్యాలి. చీమలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. బొరాక్స్‌ను సోడియం టెట్రాబొరేట్ అని కూడా అంటారు. దీన్ని క్లీనింగ్ చెయ్యడానికీ, పురుగుల్ని తరిమెయ్యడానికీ వాడుతారు. ఇది మీకు మందుల షాపుల్లో, కొన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దాన్ని తెచ్చి గోరు వెచ్చట నీటిలో.. 2 టేబుల్ స్పూన్లు కలిపి కొద్దిగా పంచదార కూడా వేసి.. మిక్స్ చేసి.. పురుగులు, చీమలు ఉన్న చోట చల్లితే అవి మారోసారి అక్కడకు రాకుండా వెళ్లిపోతాయి.
బారులు బారులుగా ఉండే చీమలపై ప్రతాపం చూపించాలంటే.. మిరియాల పొడి చక్కగా పనిచేస్తుంది. చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మిరియాలపొడి చల్లతే సరిపోతుంది. చీమలు రాకుండా నిమ్మ తొక్క బాగా పనిచేస్తుంది. నిమ్మ తొక్క లేదా దోసకాయ ముక్కను చీమలు ఉండే ప్రాంతంలో పెడితే.. వాటి వాసనకు చీమలు మైల్డ్ అయిపోతాయి. ఇలా చిన్న చిన్న చిట్కాలను వాడి చీమలను ఇంటి నుంచి పారద్రోలవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ants, Health, Health benefits