హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Saffron in Weight Loss: బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి

Saffron in Weight Loss: బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి

బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి...

బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి...

Saffron in Weight Loss : కుంకుమ పువ్వు అరుదైన సుగంధ ద్రవ్యం. వంటల్లో దాన్ని ఫ్లేవర్ కోసం వాడుతారు. ఐతే... కుంకుమ పువ్వుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలంటే కుంకుమ పువ్వు వాడితే సరి.

  Saffron in Weight Loss Health Tip : ప్రపంచంలో అత్యంత కాస్ట్‌లీ సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. ఇదో ప్రత్యేక మొక్క. 15 నుంచీ 20 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. 6 నుంచీ 10 ఆకులు... ఒకటీ లేదా రెండు పూలతో... లిలాక్ పర్పుల్ కలర్‌లో ఆకట్టుకుంటుంది. ఆకలిని చంపేసేందుకు కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది సరైన స్పైస్‌గా చెప్పుకుంటున్నారు. సాధారణంగా కుంకుమ పువ్వును చికెన్, మటన్, రైస్, లిక్కర్స్ వంటి వాడిలో వాడుతుంటారు. కొన్ని డిషెస్‌కి కలర్ కోసం పైపైన చల్లుతారు. బ్రెడ్లు, కేకులు, ముఘలాయ్ వంటకాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇక కాస్మొటిక్స్‌లో కూడా దీన్ని వాడుతున్నారు. జ్వరాలు, మిలాంఖోలియా, లివర్ పెరుగుదల, ప్లీహం పెరుగుదల వంటి వాటి కోసం కూడా ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే... ఆయుర్వేదంలో కీళ్ల నొప్పులు, సంతాన సాఫల్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కుంకుమ పువ్వు ఉపయోగపడుతోంది. చైనా, టిబెట్‌లో తయారయ్యే మందుల్లో కుంకుమ పువ్వు వాడకం ఎక్కువగా ఉంది.

  బరువు తగ్గాలని చాలా మంది సడెన్‌గా ఆహారం మానేస్తుంటారు. అలా చెయ్యకూడదు. దాని వల్ల శరీరానికి పోషకాల లభ్యత ఒక్కసారిగా తగ్గిపోతుంది. అది ఇతర సైడ్ ఎఫెక్ట్స్‌కి దారి తీస్తుంది. అందువల్ల ఆహారం తీసుకుంటూనే అందులో కొవ్వు, ఆయిల్, ఫ్రై ఫుడ్ తక్కువగా ఉండేలా చేసుకోవాలి. అదే సమయంలో కూరగాయలు, కాయగూరలు, పండ్లను ఎక్కువగా తినాలి. తద్వారా శరీరానికి సరైన పోషకాలు అందడమే కాదు... అనవసరంగా పేరుకుపోతున్న కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి కరిగిపోతాయి. బరువు తగ్గేందుకు వీలవుతుంది.

  కుంకుమ పువ్వుతో బరువు తగ్గడం ఎలా : కుంకుమ పువ్వును తినడం వల్ల ఆకలి చచ్చిపోతుంది. కొద్దిగా తిన్నా చాలు... పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది. అందువల్ల ఇంకేమీ తినబుద్ధి కాదు. ఎందుకంటే కుంకుమ పువ్వు... సెరెటోనిన్‌పై ప్రభావం చూపుతుంది. ఈ సెరెటోనిన్‌కీ ఆకలికీ సంబంధం ఉంటుంది. రోజూ కుంకుమ పువ్వును కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఉంటే... ఆటోమేటిక్‌గా తక్కువ ఆహారం తింటూ... స్నాక్స్ లాంటి వాటికి దూరం జరుగుతూ... బరువు తగ్గుతారు. అంతేకాదు... కుంకుమ పువ్వు తినేవారికి స్వీట్లు, తీపి పదార్థాలు తినబుద్ధి కాదు. అందువల్ల శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా నిల్వ ఉండదు. తద్వారా బరువు త్వరగా తగ్గుతారు.

  మీరు కుంకుమ పువ్వు తింటున్న రోజు నుంచీ మీ బాడీలో కొవ్వు పేరుకోవడం ఆగిపోతుంది. ఇక ఆల్రెడీ ఉన్న కొవ్వును కూడా కుంకుమ పువ్వు కరిగించేస్తుంది. ఎందుకంటే... ఇది విపరీతంగా వేడి చేస్తుంది. ఆ వేడి వల్ల బాడీలో హీట్ పెరిగి... ఫ్యాట్ పరారవుతుంది. కుంకుమ పువ్వు శ్వాస సమస్యల్ని కూడా తగ్గించగలదు. కిడ్నీలు బాగా పనిచేసేలా చేయగలదు. పొట్ట, బాడీలో నొప్పుల అంతు చూస్తుంది. జ్వరం, జలుబును తగ్గిస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్‌కి కూడా ఇది చెక్ పెడుతుంది.

  ఎలాంటి కుంకుమ పువ్వు వాడాలి : ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల కుంకుమ పూలు ఉంటున్నాయి. బరువు తగ్గాలంటే ప్యూర్ కుంకుమ పువ్వుని వాడాలి. అందులో కృత్రిమ రంగులేవీ కలవకూడదు. త్వరగా బరువు తగ్గాలని మరీ ఎక్కువ కుంకుమ పువ్వు తినకూడదు. రోజూ మూడు పూటలా చిన్న మొత్తాల్లో తీసుకోవాలి. అలా కంటిన్యూగా తీసుకుంటే... ఇక అధిక బరువు సంగతి అది చూసుకుంటుంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Health benifits, Life Style, Tips For Women, Women health