మహిళల రుతుస్రావంపై ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు..

Upasana Kamineni Konidela : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్‌ను పంచుకొనే కొణిదెల వారి కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసన మరో కీలక అంశంపై స్పందించారు. మహిళల రుతుస్రావంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

news18-telugu
Updated: November 21, 2019, 9:04 AM IST
మహిళల రుతుస్రావంపై ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు..
Instagram/upasanakaminenikonidela
  • Share this:
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్‌ను పంచుకొనే కొణిదెల వారి కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసన మరో కీలక అంశంపై స్పందించారు. మహిళల రుతుస్రావంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సాధారణంగా.. పీరియడ్స్ అనగానే చాలా మంది మహిళలు దాని గురించి మాట్లాడేందుకు భయపడతారు. అదేదో నిషిద్ధ పదం అన్నట్లు నామోషీగా ఫీల్ అవుతారు. కొందరైతే పీరియడ్స్ రాగానే.. ఎవ్వరికీ కనిపించకుండా, ఏం చెప్పకుండా దాస్తారు. అయితే.. ఇలా చేయడం ఎందుకని వారిని ఉపాసన ప్రశ్నించారు. పీరియడ్స్ అనేవి.. ఆరోగ్యానికి, గర్భధారణకు మంచివేనని గుర్తు చేశారు. ‘కొందరు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు ఎందుకు భయపడుతారో అర్థం కాదు. దాన్ని సీక్రెట్‌గా దాచేందుకు ప్రయత్నిస్తారు. కొందరు ఇదంతా ఏదో చెడు అన్నట్లు భావిస్తారు. మలబద్ధకం, గ్యాస్ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నపుడు దాని గురించి ఎందుకు భయం’ అని అన్నారు.

రుతుక్రమం అనేది సహజమైనదని, ఆరోగ్యానికి, గర్భం దాల్చేందుకు ఉపయోగపడేదని ఆమె వ్యాఖ్యానించారు. పీరియడ్స్ గురించి మాట్లాడగలిగితేనే దానికి తగ్గ సొల్యుషన్ దొరుకుతుందని మహిళలకు ఉపాసన హితవు చెప్పారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading