హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Plant Based Egg: మొక్కల ఆధారిత ఉత్పత్తులతో గుడ్డు తయారు చేసిన పరిశోధకులు.. చైనాలో ఫుల్ డిమాండ్

Plant Based Egg: మొక్కల ఆధారిత ఉత్పత్తులతో గుడ్డు తయారు చేసిన పరిశోధకులు.. చైనాలో ఫుల్ డిమాండ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Plant Based Egg: అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ఈట్‌ జస్ట్ (Eat Just) అనే స్టార్టప్‌ కంపెనీ మొక్కల ఆధారిత ఉత్పత్తులతో గుడ్లను అభివృద్ధి చేసింది. వీటిని చైనా ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం డికోస్‌ (Dicos) రిటైల్స్‌లోని మెనూల్లో చేర్చారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

జంతువులను చంపకుండా ప్రయోగశాలలో మాంసాన్ని ఉత్పత్తి చేస్తూ పర్యావరణానికి సైతం మేలు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. తాజాగా గుడ్లను కూడా ఇలాగే ఉత్పత్తి చేసి వార్తల్లో నిలిచింది అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ. శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన ఈట్‌ జస్ట్ అనే స్టార్టప్‌ కంపెనీ మొక్కల ఆధారిత ఉత్పత్తులతో గుడ్లను అభివృద్ధి చేసింది. వీటిని చైనా ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం డికోస్‌ (Dicos) రిటైల్స్‌లోని మెనూల్లో చేర్చారు. చైనాలో సుమారు 500కి పైగా డికోస్ అవుట్‌లెట్లు ఉన్నాయి. వీటిల్లో కొత్త రకం గుడ్లతో చేసిన పదార్థాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వెజిటేరియన్ గుడ్డును పెసరపప్పు(mung beans), ఇతర పదార్థాలు కలిపి తయారు చేశారు. దీనికి ‘జస్ట్ ఎగ్’ అనే పేరు పెట్టారు. డికోస్ అవుట్‌లెట్లలో సాధారణ గుడ్డుతో చేసే అన్ని రకాల వంటకాల స్థానంలో జస్ట్ ఎగ్‌ను చేరుస్తామని ఈట్ జస్ట్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోష్ టెట్రిక్ చెప్పారు.

చైనాలో జంతు సంబంధ ఉత్పత్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ మాంసం, పాడి ఉత్పత్తులు, సీ ఫుడ్‌కు ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలకు ఆధరణ పెరుగుతోంది. అందువల్ల వెజిటేరియన్ ఫుడ్‌పై ఆసక్తి చూపేవారి కోసం ప్రత్యేకంగా జస్ట్‌ ఎగ్‌ రెసిపీలను తయారు చేస్తున్నామని టెట్రిక్ తెలిపారు. చైనాలో మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వాడుతున్న ఆహార పదార్థాల మార్కెట్ విలువ 2020లో 10.8 బిలియన్ డాలర్లుగా ఉంది. 2025లో ఇది 12.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ అనే మార్కెట్ పరిశోధన సంస్థ అంచనా వేసింది.

కాగా డికోస్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారనే వివరాలను ఈట్ జస్ట్ సంస్థ వెల్లడించలేదు. కానీ కరోనా నేపథ్యంలో చైనాలో ఆహార భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని టెట్రిక్ చెప్పారు. జస్ట్ ఎగ్ సరఫరా చేయడానికి తమ కంపెనీ ఇతర చైనా రెస్టారెంట్లతో చర్చలు జరుపుతుందని తెలిపారు.

ఆ కంపెనీలు కూడా...

ఈట్ జస్ట్‌ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్లు డికోస్ బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సరికొత్త ఆహారానికి భవిష్యత్తులో మరింత డిమాండ్ ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. డికోస్ సంస్థ గత ఏడాది అక్టోబర్‌లో వేగన్ చికెన్ బర్గర్లు, నగ్గెట్స్‌ను ప్రారంభించింది. స్టార్‌బక్స్, KFC, బియాండ్ మీట్ వంటి ప్రముఖ సంస్థలు సైతం చైనాలో గత సంవత్సరం మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు, డ్రింక్స్‌ను పరిచయం చేశాయి. మాంసాహారం ఉత్పత్తి కారణంగా పర్యావరణంపై పడే ప్రభావాన్ని ఇలాంటి కొత్త పదార్థాల ఆవిష్కరణలతో తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

First published:

Tags: China, Eggs, International news, Us news

ఉత్తమ కథలు