కొడుకును కాపాడబోయి కోమాలోకి... 27 ఏళ్ల తర్వాత స్పృహలోకి...

స్పృహలోకి వస్తూనే కొడుకు పేరు పలకడం విశేషం. డాక్టర్లు వెంటనే కావాల్సిన చికిత్స అందించడంతో ఆమె పూర్తిగా కోలుకుంది. తన తల్లి ఎలా కోలుకుందో ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో వివరించారు మునీరా తనయుడు ఒమర్.

news18-telugu
Updated: April 24, 2019, 11:39 AM IST
కొడుకును కాపాడబోయి కోమాలోకి... 27 ఏళ్ల తర్వాత స్పృహలోకి...
కొడుకును కాపాడబోయి కోమాలోకి... 27 ఏళ్ల తర్వాత స్పృహలోకి... (image: thenational)
news18-telugu
Updated: April 24, 2019, 11:39 AM IST
అది 1991వ సంవత్సరం... యూఏఈలో ఓ కారు ప్రమాదం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నించిన మహిళ మునీరా అబ్దుల్లా తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో మెదడుకు గాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా స్పృహలోకి రాలేదు. కోమాలోకి వెళ్లింది. అప్పుడు ఆమె వయస్సు 32 ఏళ్లు. ఒకట్రెండేళ్లు కాదు... ఏకంగా 27 ఏళ్లుగా కోమాలోనే ఉంది. ఆమె ఎప్పటికైనా స్పృలోకి వస్తుందని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఏళ్లు గడుస్తున్నా వారిలో ఆశ చావలేదు. జర్మనీలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స అందించారు. కొన్నాళ్ల క్రితం ఆమె స్పృహలోకి వచ్చింది. తన కొడుకు ఒమర్ ఆస్పత్రిలో తన గదిలో ఎవరితోనో వాదిస్తుంటే ఆమె స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వస్తూనే కొడుకు పేరు పలకడం విశేషం. డాక్టర్లు వెంటనే కావాల్సిన చికిత్స అందించడంతో ఆమె పూర్తిగా కోలుకుంది. తన తల్లి ఎలా కోలుకుందో ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో వివరించారు మునీరా తనయుడు ఒమర్.

Read this: Minimum Balance: బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ లెక్కించేది ఇలాగే...

ప్రమాదం జరిగినప్పుడు ఒమర్ వయస్సు నాలుగేళ్లు. కిండర్‌గార్టెన్ నుంచి ఇంటికి తీసుకొచ్చే సమయంలో జరిగింది ప్రమాదం. తల్లీకొడుకులు కారులో వెనుక సీటులో కూర్చున్నారు. ఓ బస్సు వచ్చి ఢీకొట్టింది. కొడుకును కాపాడబోయి మునీరా అబ్దుల్లా గాయాలపాలైంది. కొన్ని గంటలపాటు ఆమెకు వైద్యం అందలేదు. ఆ తర్వాత చికిత్స అందించారు. ఆమె కోమాలోకి వెళ్లడంతో మెరుగైన వైద్యం కోసం లండన్‌కు తరలించారు. చికిత్సకు ఆమె స్పందించకపోవడంతో వెంటిలేటర్‌పైనే తిరిగి యూఏఈకి తీసుకొచ్చారు. 27 ఏళ్లుగా కోమాలోనే ఉంది. 2017లో అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ఆమె గురించి తెలుసుకొని చికిత్స కోసం సాయం చేశారు. ఆమెను జర్మనీకి తీసుకెళ్లి చికిత్స అందించడం మంచి ఫలితాలను ఇచ్చింది. జర్మనీలో ఆమె కోలుకుంది. ఇప్పుడామె అందర్నీ గుర్తుపడుతోంది. అందరితో మాట్లాడుతోంది. ప్రార్థనలు చేస్తోంది. 27 ఏళ్లుగా కోమాలో ఉంటూ కోలుకోవడం ఓ అద్భుతంగా భావిస్తున్నారంతా.

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే జాగ్రత్త
Loading...
SBI New Rules: మే 1 నుంచి ఎస్‌బీఐలో మారనున్న రూల్స్ ఇవే...

IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈజీగా చేయొచ్చు ఇలా
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...