ఉప్పు అంటే రోజువారీ కూరల్లో వేసుకునే ఓ పదార్థంగా మనం భావిస్తాం. ఈ ఖనిజాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలకు చిత్రమైన విషయాలు తెలిశాయి. తెల్లగా, నీటిలో వెయ్యగానే కరిగిపోయే సాల్ట్‌తో జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది. పరిశోధకులు ఏం కనిపెట్టారంటే...
సబ్బు కంటే చక్కగా గాయాల్ని శుభ్రం చేస్తుంది :
చిన్నప్పుడు బుక్స్‌లో చదివే ఉంటారు. కుక్క కరవగానే సబ్బుతో గాయాన్ని కడగాలి అని. జనరల్‌గా ఏ గాయమైనా సబ్బుతో క్లీన్ చెయ్యడం మనకు అలవాటు. కానీ సోప్ కంటే ఉప్పు నీటితో గాయాల్ని కడిగితే, ఇన్ఫెక్షన్లు రావని పరిశోధనల్లో తేలింది. సబ్బుల్లో కొన్ని, లోపలి చర్మానికి హాని చేస్తాయి. సాల్ట్ మాత్రం హాని చెయ్యదంటున్నారు సైంటిస్టులు.
ఉప్పు ఎక్కువైతే దిమ్మ తిరగడం ఖాయం :
ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తింటే, అది మెదడులో మంట, నొప్పు, దురదల వంటివి వచ్చేలా చేస్తుందట. ఎలుకలపై ప్రయోగాలు చెయ్యగా, సాల్ట్ ఎక్కువైన ఎలుకలు... పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాయి. నమక్ సరిపడా తిన్న ఎలుకలు మాత్రం సైలెంట్‌గా ఉన్నాయని తేల్చారు.
ఉప్పు నక్షత్రాల జీవితకాలం తక్కువ :
ఇది ఇంకో ఆసక్తికర అంశం. సాధారణంగా నక్షత్రాలు చనిపోయేటప్పుడు హైడ్రోజన్, హీలియం మండుతాయి. ఆ తర్వాత గ్యాస్, దుమ్మును ఎగజిమ్ముతాయి. చివరకు మరుగుజ్జు నక్షత్రాలుగా మారతాయి. ఐతే, సోడియం (సాల్ట్) ఎక్కువగా ఉండే నక్షత్రాలు గ్యాస్, దుమ్మును ఎగజిమ్మవు. వెంటనే మరుగుజ్జు నక్షత్రాలుగా మారతాయి.
మన గ్రహాన్ని చల్లబరచగలదు :
భూ వాతావరణంలో ఉప్పుని చల్లితే చాలు, అది వాతావరణాన్ని చల్లగా చేస్తుంది. భూతాపాన్ని తగ్గిస్తుంది. ఐతే, ఇదే సాల్ట్... మన భూమిపై ఉన్న ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్‌లను నాశనం చెయ్యగలదు. అందువల్ల భూమిపై వేడిని తగ్గించేందుకు ఉప్పును చల్లడం సరైన చర్య కాదని పరిశోధకులు తెలిపారు.
కరవు కాటకాల సమాచారం చెబుతుంది :
మృత సముద్రం కింద శాస్త్రవేత్తలు డ్రిల్లింగ్ చేశారు. సాల్ట్ శాంపిల్స్ సేకరించారు. సాధారణంగా వర్షాలు బాగా పడినప్పుడు భూమిలో ఉప్పు పొర తక్కువగా పేరుకుంటుంది. శాస్త్రవేత్తల పరిశోధనను బట్టీ గత పది లక్షల సంవత్సరాల్లో భూమిపై చాలా కరవు కాటకాలు వచ్చాయి. ఆ స్థాయి కరవు ఇప్పుడు వస్తే, తట్టుకోవడం కష్టమే.
ప్రభుత్వాలకు తలనొప్పిగా సాల్ట్ :
షుగర్ ఎంత తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలేంటో ప్రపంచంలో చాలా మందికి తెలుసు. అందువల్ల చక్కెర వాడకాన్ని చాలావరకూ తగ్గించారు. ఉప్పు ఎక్కువ తీసుకుంటే ప్రమాదం అన్న విషయం చాలా మందికి తెలియదు. అందువల్ల ప్రపంచ దేశాల్లో ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారు. దీన్ని కంట్రోల్ చెయ్యడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.