హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cancer పై పోరులో లండన్ శాస్త్రవేత్తల ముందడుగు.. తొలిదశలోనే నిర్ధారణ

Cancer పై పోరులో లండన్ శాస్త్రవేత్తల ముందడుగు.. తొలిదశలోనే నిర్ధారణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్యాన్సర్ ముదిరే కొద్ది చికిత్స చేయడం కష్టమైన పని. అందువల్ల ప్రారంభంలోనే దీన్ని గుర్తిస్తే మెరుగైన చికిత్సతో బయటపడొచ్చు. ఇందులో భాగంగా లండన్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు.

  • News18
  • Last Updated :

క్యాన్సర్ పై పోరులో లండన్ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఒక సాధారణ రక్త పరీక్షతో 50కి పైగా క్యాన్సర్ రకాలను గుర్తించేందుకు పైలెట్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ ను చేపట్టిన లండన్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ టెస్ట్ విజయవంతమైతే క్యాన్సర్ వ్యాధిని మరింత విజయవంతంగా చికిత్స చేయడానికి అవకాశం లభిస్తుందని పేర్కొంది. అంతేకాక, భవిష్యత్ లో దీన్ని అనుమతించడం ద్వారా ప్రారంభంలోనే క్యాన్సర్ ను గుర్తించగలమని, ఇది క్యాన్సర్ ను తొలి దశలోనే అంతం చేసేందుకు సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

దీనిలో భాగంగా హెల్త్ కేర్ కంపెనీ గ్రెయిల్ అభివృద్ధి చేస్తున్న ‘గల్లెరి బ్లడ్ టెస్ట్’ను మొదటగా 1,65,000 మంది రోగులపై ప్రయోగిస్తున్నారు. కాగా, ప్రమాదకరమైన క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించడంపై దృష్టి సారించిన గ్రెయిల్‌ సంస్థకు టెక్ బిలియనీర్ బిల్ గేట్స్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో సహా పలువురు పెట్టుబడిదారులు మద్దతు పలికారు.కాగా క్యాన్సర్ ముదిరే కొద్ది చికిత్స చేయడం కష్టమైన పని. అందువల్ల ప్రారంభంలోనే దీన్ని గుర్తిస్తే మెరుగైన చికిత్సతో బయటపడొచ్చు. దీనికి గ్రెయిల్ అభివృద్ధి చేస్తున్న బ్లడ్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుందని నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ భావిస్తోంది.

దీనిపై ఎన్హెచ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సైమన్ స్టీవెన్స్ మాట్లాడుతూ " ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా ముఖ్యంగా అండాశయం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించి, వారిని ప్రాణాపాయం నుంచి రక్షించే అవకాశం ఉంది." అని ఆయన అన్నారు.

2023 నాటికి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం..

క్యాన్సర్ నిర్ధారణకు చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్, 2021 మధ్యలో ప్రారంభం కానుంది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ లో మొత్తం 165,000 మంది పాల్గొంటారు. కాగా, వీరిలో ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేని 50 నుండి 79 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 140,000 మంది పాల్గొననున్నారు. కాగా వీరి నుండి మొత్తం మూడేళ్ళలో సంవత్సరానికొక సారి రక్త పరీక్ష చేస్తారు. మిగిలిన 25 వేల మంది క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు. కాగా, వారి రోగ నిర్ధారణను వేగవంతం చేయడానికి రక్త పరీక్షను నిర్వహిస్తారు. 2023 నాటికి ప్రాజెక్ట్ ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఇది విజయవంతమైతే 2025 నాటికి ఒక మిలియన్ మంది ప్రజలకు సులభంగా క్యాన్సర్ నిర్థారణ చేయవచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత దీన్ని ప్రపంచవ్యాప్త జనాభాకు విస్తరించవచ్చని ఇంగ్లాండ్ కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది. ఇంగ్లాండ్‌లో, ప్రస్తుతం రెండొంతుల మందికి క్యాన్సర్ నిర్ధారణ చేస్తున్నారు.

కానీ 2028 నాటికి దానిని మూడొంతులకి పెంచాలని NHS లక్ష్యంగా పెట్టుకుంది. గల్లెరి బ్లడ్ టెస్ట్ తో చివరి దశలో నిర్ధారణ అయ్యే క్యాన్సర్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించే అవకాశం ఉంది. ఇది సక్సెస్ అయితే యూకేలో మొత్తం క్యాన్సర్ మరణాల సంఖ్యను తగ్గించగలదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Breast cancer, Cancer, Health, Health care, Health Tips