• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • UK MAN EATS TWO WHOLE BLOCKS OF CHEESE EVERY DAY BUT STILL HAS EIGHT PACK ABS MK GH

Cheese Eating man: రోజూ కిలో ఛీజ్ తిన్నా.. 8ప్యాక్ బాడీ.. సీక్రెట్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్...

Cheese Eating man: రోజూ కిలో ఛీజ్ తిన్నా.. 8ప్యాక్ బాడీ.. సీక్రెట్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్...

ప్రతీకాత్మక చిత్రం

గత 25 సంవత్సరాలుగా ఇలా సుమారు 7,280 కిలోల ఛీజ్ ని అతడు స్వాహా చేసేశాడట. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఛీజ్ వేసిన శాండ్ విచ్ లు తింటున్నా.. అతడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ ఎదురు కాలేదట.

  • Share this:
ఛీజ్ అంటే ఇష్టం లేని వారెవరుంటారు? బ్రెడ్, పిజ్జా, బర్గర్.. ఇలా మనం తీసుకున్న పదార్థాలన్నింటి రుచిని పెంచేది ఆ ఛీజే.. చెడ్డార్, మొజరెల్లా, పార్మేసన్ వంటి రకాలన్నీ తమ ప్రత్యేకమైన రుచితో నోరూరించేస్తుంటాయి. ప్రతి రోజూ దీన్ని తినాలని ఆశ ఉన్నా.. బరువు పెరిగిపోతామేమోనన్న ఫీలింగ్ తో చాలామంది దీన్ని అప్పుడప్పుడూ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంగ్లండ్ లోని కెంట్ కి చెందిన ఓ వ్యక్తి వారానికి ఆరు కేజీల ఛీజ్ తింటాడట. అయినా అతడు లావు అవ్వకుండా అద్భుతమైన శరీరంతో కండలు తిరిగి ఉండడం విశేషం. వివరాల్లోకి వెళ్తే..

ఇంగ్లండ్ లోని కెంట్ ప్రాంతానికి చెందిన మార్క్ కింగ్ అనే 52 సంవత్సరాల వ్యక్తి రోజూ రెండు బ్లాకుల చెడ్డార్ ఛీజ్ ఆహారంగా తీసుకుంటాడట. వీటిని శాండ్ విచ్ లలో వేసి అతడి భార్య ట్రేసీ వింటర్ అతడి కోసం అద్భుతంగా తయారుచేస్తుందట. దీన్ని తినడం అంటే ఎంతో ఇష్టపడే మార్క్ దాన్నే ఆహారంగా తీసుకుంటాడట. రోజూ సుమారు 400 గ్రాముల ఛీజ్ ని మధ్యాహ్నం భోజనంలో భాగంగా.. ఆ తర్వాత మరో 400 గ్రాముల ఛీజ్ ని డిన్నర్ లో భాగంగా తీసుకుంటాడట. గత 25 సంవత్సరాలుగా ఇలా సుమారు 7,280 కిలోల ఛీజ్ ని అతడు స్వాహా చేసేశాడట. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఛీజ్ వేసిన శాండ్ విచ్ లు తింటున్నా.. అతడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ ఎదురు కాలేదట. అతడి శరీరం కూడా కండలు తిరిగి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తుందట. అంతే కాదు.. అతడికి అబ్బాయిలంతా ఎంతగానో కోరుకొని కష్టపడినా రాని ఎయిట్ ప్యాక్ కూడా ఉండడం విశేషం.

దీని గురించి మార్క్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ “శాండ్ విచ్ లలో నా భార్య ఎలాంటి వెరైటీ చేసి అందించినా నేను దాన్ని ఇష్టంగా తింటాను. బొవరిల్, మార్మైట్, పెప్పర్, మయోనైజ్, పాటే, సీ ఫుడ్, సాసేజెస్ ఇలా ఏ రకమైనా నాకు ఇష్టమే. అయితే వాటితో పాటు నాకు ఛీజ్ తప్పక ఉండాల్సిందే. ఛీజ్ ఎంత ఎక్కువగా ఉంటే నాకు రుచి అంత బాగుంటుంది. ఇంత ఛీజ్ తింటే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తుందేమో అనుకుంటారు కానీ నాకు గత పాతికేళ్లుగా ఒక్కసారి కూడా గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటివి ఎదురుకాలేదు.” అని చెప్పడం విశేషం.

ఒక్కో పూటకు ఇలా నాలుగు వందల గ్రాముల ఛీజ్ తీసుకోవడం వల్ల కేవలం ఛీజ్ వల్లనే వారానికి అతడికి 22, 513 క్యాలరీలు అందుతాయి. ఇంత ఛీజ్ తిన్నా మార్క్ మాత్రం కేవలం 92 కేజీల బరువు ఉండడం విశేషం. అందులోనూ ఎక్కువగా కండరాల బరువే. ఎయిట్ ప్యాక్ ఆబ్స్ తో కండలు తిరిగిన దేహంతో అద్భుతంగా కనిపిస్తాడు మార్క్. మరి, ఇంత తిన్నా ఎందుకు బరువు పెరగట్లేదు అనుకుంటున్నారా? దీనికి కారణం అతడి ఉద్యోగమేనట. మార్క్ టింబర్ యార్డ్ లో లాగర్ గా, గార్డెనర్ గా పనిచేస్తాడట. రోజూ దుంగలు కోయడం, గార్డెనింగ్ చేయడం వల్ల అతడు తిన్న క్యాలరీలన్నీ కరిగిపోతున్నాయన్నమాట. ఈ కుటుంబం రోజూ ఆరు గంటలకే చాలా పెద్ద మొత్తంలో డిన్నర్ చేస్తారట. మార్క్ తన శాండ్ విచ్ లను రాత్రి పదిన్నర నుంచి పదకొండు మధ్యలో తింటాడట. అంత పెద్ద మొత్తంలో ఆహారం తిన్నా అతడికి ఇంత వరకు ఏమీ కాకపోవడం విశేషం.
First published: