UBER CEO TURNED A DAILY FOOD DELIVERY BOY WHAT IS THE REASON NGS
Uber CEO: డెలివరీ బాయ్‌గా ఉబెర్ సీఈవో..! ఎంత సంపాదించారు? కారణం ఏంటో తెలుసా..?
డెలివరీ బాయ్ గా సీఈఓ
అతనో సంస్థకు సీఈఓ.. సంపన్న పరుడు కూడా.. కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు.. అయినా అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఫుడ్ డెలివరీ బాయ్ గా మారాడు.. ఎందుకో తెలుసా.. డెలివరీ బాయ్ గా ఆయన సంపాదన ఎంత..?
ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు కొందరు. తమ పొజిషిన్ తో సంబంధం లేకుండా చిన్న చిన్న పనులు కూడా చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి కోవలోకి వస్తారు ఊబర్ ఈట్ సీఈవో దారా ఖోస్రోషాహి. సీఈఓ పొజిషన్ లో ఉండి కూడా.. తన సంస్థలో రెండు రోజులు సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. ఉద్యోగులందరికి ఆదర్శంగా నిలిచాడు. అలా వచ్చిన రెండు రోజుల వేతనాన్ని చూసుకొని ఆయన మురిసిపోయారు. తన రెగ్యులర్ సంపాదన కన్నా ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు. ప్రొఫెషనల్ డిగ్నిటీ, వృత్తిలో నైతిక విలువలు, పనిలో కష్టపడేతత్వం.. వీటికి తోడుగా అదృష్టం మనిషిని సక్సెస్ఫుల్ పర్సన్‌గా నిలిచేలా చేస్తాయి. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ.. ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహికి శ్రమ అంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు గ్రౌండ్ లెవల్లోకి దిగి.. తోటి వర్కర్ల పనితీరును పర్యవేక్షిస్తుంటాడు. సరదాగా వాళ్లతో ఔటింగ్లకూ వెళ్తుంటాడు. అయితే ఇది కొంతమందికి మాత్రం నచ్చడంలేదు.
సైకిల్ మీద తిరుగుతూ ఆయన డెలివిరీ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో సైకిల్ మీద ఉన్న ఫొటోను షేర్ చేసి.. టైం టు టైం అప్డేట్ పంచుకున్నాడు. పైగా డెలివరీల ద్వారా ఆరోజులో దాదాపు 100 డాలర్లు సంపాదించినట్లు వెల్లడించాడు. ఇక ఎలా సంపాదించారని కొందరు అడగ్గా.. ఒక్కో ఆర్డర్ మీద 6 నుంచి 23 డాలర్లు సంపాదించానని చెప్పుకొచ్చాడు. http://
Day 2 good - not as good as day 1. More downtown routes w traffic and apt drop offs a pain. More fast food, lower tips. @SFGiantsFans fan tried to kill me. Maybe he knew I’m a @Mets fan 🙌. Super busy - 2:01 working from 2:02 online. And … Picked up from my first dark store. pic.twitter.com/6Pp8r4MIIB
వరుసగా రెండో రోజు కూడా ఆయన ట్వీట్ చేశారు. డే 2- మొదటి రోజులాగా లేదు. ఎక్కువ ట్రాఫిక్, తక్కువ టిప్స్, ఫాస్ట్ డెలివేరి అంటూ పోస్ట్ చేశారు. ఇందులో దారా ఖోస్రోషాహి మొత్తం భారత కరెన్సీలో చెప్పాలి అంటే సుమారు రూ. 3756 సంపాదించారు అలాగే మొత్తం 6 ట్రిప్పులను పూర్తి చేశారు. దీంతో ఆయనకు మొత్తం 18 పాయింట్లు వచ్చాయి. అలాగే అతను చేసిన పనికి కాస్త నెగెటివిటీ కామెంట్స్ కూడా వచ్చాయి. కొందరు పబ్లిసిటీ స్టంట్ అదిరిందంటూ ఖోస్రోషాహిని హేళన చేశారు. ఇంకొందరు ఉబెర్ ఈట్స్ సర్వీసును పొగుడుతూనే డెలివేరి వర్కర్లను మనుషుల్లా చూడడం నేర్పండంటూ చురకలంటించారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.