గుండెపోటు అనేది ఒక వ్యక్తి గుండెకు శాశ్వత నష్టం కలిగిస్తుంది లేదా మరణానికి దారితీస్తుంది. దీన్ని వైద్యపరంగా మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమస్య బారిన పడినవారి గుండె కండరాలలో కొంత భాగం (మయోకార్డియం) చనిపోవచ్చు (ఇన్ఫార్‌క్షన్). సాధారణంగా గుండె ధమనులలో ఒకటి తీవ్రంగా లేదా పూర్తిగా బ్లాక్ అయి, గుండెకు ఆక్సిజన్ ఉండే రక్తం సరఫరాను అడ్డుకున్నప్పుడు గుండెపోటు వస్తుంది. గుండె కండరానికి ఎంత గాయమైంది అనే దానిపై గుండెపోటు తీవ్రత ఆధారపడి ఉంటుంది.
అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటే ఏంటి?
అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ (ACS) అంటే.. గుండెకు రక్తం, ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళ్లే ధమనులు పూడుకుపోయే పరిస్థితి. గుండెపోటు అనేది ACSకి ఒక రూపం. మీ గుండెకు తగినంత రక్తం సరఫరా లేనప్పుడు హార్ట్ ఎటాక్స్ వస్తాయి.
వైద్య పరంగా గుండెపోటులో వివిధ రకాలు ఉన్నాయి. అవేంటంటే..
"ST సెగ్మెంట్" అనేది ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లో కనిపించే ప్యాటర్న్.. ఇది వ్యక్తుల హార్ట్ బీట్‌ను సూచిస్తుంది. STEMI ఎలివేటెడ్ విభాగాలను మాత్రమే చూపుతుంది. STEMI, NSTEMI హార్ట్ ఎటాక్స్ రెండింటినీ ఎక్కువ తీవ్రత ఉండే గుండెపోటులుగా పరిగణిస్తారు. వీటి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల, నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది.
STEMI: క్లాసిక్ లేదా తీవ్రమైన (Major) గుండెపోటు
చాలా మంది బాధితుల్లో కనిపించే గుండెపోటు STEMI వర్గానికి చెందినది. కరోనరీ ఆర్టరీ పూర్తిగా బ్లాక్ అయినప్పుడు, గుండె కండరాలలో ఎక్కువ భాగాలకు రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు STEMI హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇది తీవ్రమైన గుండెపోటు. బాధితులకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది.
STEMI లక్షణాలు
STEMI రకం గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు అసౌకర్యంగా ఉంటుంది. ఈ అసౌకర్యం గుండె కండరాలను పిండేసినట్లు అనిపిస్తుంది. కొందరు వ్యక్తుల్లో ఒక చెయ్యి లేదా రెండు చేతుల్లో నొప్పి, వెన్ను, మెడ లేదా దవడ నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఛాతీ నొప్పితో పాటు వచ్చే ఇతర లక్షణాలు:
ఇవన్నీ STEMI లక్షణాలు. ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులకు వైద్య సహాయం అందించాలి. గుండెపోటు లక్షణాలు కనిపించిన చాలా మంది వ్యక్తులు సహాయం కోసం ఎక్కువ సమయం వేచి చూడటం ప్రమాదకరం. ట్రీట్‌మెంట్ ఎంత ఆలస్యమైతే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్ లేదా మరణానికి దారి తీస్తుంది.
చికిత్స ఏంటి?
ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరఫరాను అడ్డుకున్న ధమనిని శాశ్వతంగా క్లియర్ చేసేలా ఒక స్టెంట్- మెటల్, మెష్ ట్యూబ్ వంటివి అమర్చుతారు.
NSTEMI గుండెపోటు
దీన్ని మినీ హార్ట్ ఎటాక్ అంటారు. STEMI మాదిరిగా కాకుండా, NSTEMIలో కొరోనరీ ఆర్టరీ పాక్షికంగా మాత్రమే పూడుకుపోతుంది. ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లోని ST విభాగంలో NSTEMI ఎలాంటి మార్పును చూపదు. కరోనరీ యాంజియోగ్రఫీ అనేది ధమనిలో పూడిక ఏ స్థాయిలో బ్లాక్ అయిందో చూపుతుంది. రక్త పరీక్ష ట్రోపోనిన్ ప్రోటీన్ స్థాయిలను చూపుతుంది. ఈ స్థితిలో వచ్చే గుండెపోటుతో తక్కువ నష్టం ఉండవచ్చు. కానీ NSTEMI అనేది తీవ్రమైన గుండెపోటు కిందకే వస్తుంది.
చికిత్స ఏంటి?
NSTEMI గుండెపోటుకు చికిత్సను కొన్ని అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. నాళాల్లో పూడిక మందులతో తగ్గుతుందా? లేదా యాంజియోప్లాస్టీ చేయాలా? లేదా కార్డియాక్ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ చికిత్స చేయాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారు.
CAS, సైలెంట్ హార్ట్ ఎటాక్ లేదా రక్త నాళాల్లో ఎలాంటి అడ్డంకి లేకుండా వచ్చే హార్ట్ ఎటాక్
కరోనరీ ఆర్టరీ స్పాస్మ్‌ను (Coronary Artery Spasm) కరోనరీ స్పాస్మ్, అన్ స్టెబుల్ ఆంజినా లేదా సైలెంట్ హార్ట్ ఎటాక్ అని కూడా అంటారు. దీని లక్షణాలు STEMI గుండెపోటు మాదిరిగానే ఉండవచ్చు. లేదా కండరాల నొప్పి, అజీర్తి, ఇతర సాధారణ నొప్పులతో హార్ట్ ఎటాక్ రావచ్చు. ఇలాంటి లక్షణాలు హార్ట్ ఎటాక్‌కు సంకేతాలని బాధితులు గుర్తించలేరు. కొన్నిసార్లు గుండె ధమనులలో ఒకటి కుంచించుకుపోయి గుండెలోని కొన్ని భాగాలకు రక్త ప్రవాహం ఆగిపోతుంది. లేదా బాగా తగ్గిపోతుంది. ఈ సందర్భంలో సైలెంట్ హార్ట్ ఎటాక్ రావచ్చు. ఇమేజింగ్, రక్త పరీక్ష ద్వారా మాత్రమే వైద్యులు ఈ కండీషన్‌ను గుర్తించగలరు. కరోనరీ ఆర్టరీ స్పామ్ బారిన పడితే గుండెకు శాశ్వత నష్టం కలగదు. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్స్ అంత తీవ్రమైనవి కానప్పటికీ, అవి మరో గుండెపోటు లేదా మరింత తీవ్రమైన ప్రమాదాన్ని పెంచుతాయి.
చికిత్స ఏంటి?
కొరోనరీ ఆర్టరీ స్పామ్‌కి చికిత్సగా నైట్రేట్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వంటి మందులను వైద్యులు సూచిస్తారు.
డిమాండ్ ఇస్కీమియా (Demand Ischemia)
డిమాండ్ ఇస్కీమియా అనేది గుండెపోటులో మరో రకం. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వారిలో, గుండె ధమనులలో ఎలాంటి పూడికలు ఉండకపోవచ్చు. శరీర సరఫరాలో లభించే ఆక్సిజన్ కంటే, బాధితుల గుండెకు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇది ఇన్ఫెక్షన్, రక్తహీనత (Anemia) లేదా టాచియారిథ్మియాస్ (Tachyarrhythmias- అసాధారణ గుండె వేగం) ఉన్న రోగులలో సంభవించవచ్చు. బాధితుల్లో గుండె కండరాలకు నష్టం కలిగించే ఎంజైమ్‌ల ఉనికిని రక్త పరీక్షల ద్వారా గుర్తించి, చికిత్స అందిస్తారు.
సాధారణంగా ఎలాంటి హార్ట్ ఎటాక్ అయినా ప్రమాదకరమైన మెడికల్ ఎమర్జెన్సీ కిందకే వస్తుంది. STEMI, NSTEMI, CAS, డిమాండ్ ఇస్కీమియా వంటి హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర వైద్య చికిత్స అందించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Heart Attack