టీటీడీ ఆధ్వర్యంలో వర్చువల్ వరలక్ష్మీ వృతం..

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జూలై 31వ తేదీ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా ఏకాంతంగా నిర్వ‌హించ‌నుంది టీటీడీ.

news18-telugu
Updated: July 24, 2020, 7:22 PM IST
టీటీడీ ఆధ్వర్యంలో వర్చువల్ వరలక్ష్మీ వృతం..
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు
  • Share this:
సిరుల త‌ల్లి తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జూలై 31వ తేదీ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ జేఈవో పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం టికెట్లు పొందిన భ‌క్తులకు అందించే ప్ర‌సాదాల‌కు శుక్ర‌వారం పూజ‌లు నిర్వ‌హించి ఇండియా పోస్ట‌ల్ వారికి అందించారు.

సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ భ‌క్తుల కోరిక మేర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌గా జూలై 22వ తేదీ సాయంత్రం నుండి ఆన్‌లైన్‌లో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్ల‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మ‌వారి ఆల‌యంలో శ్రావ‌ణ‌మాసం మొద‌టి శుక్ర‌వారం సంద‌ర్భంగా అమ్మ‌వారి మూల‌విరాట్టు పాద‌ప‌ద్మా‌ముల వ‌ద్ద ఉత్త‌రీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షిత‌లు, కంక‌ణాలు ఉంచి ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించార‌న్నారు. వీటిని జూలై 31వ తేదీలోపు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు పొందిన గృహ‌స్తుల చిరునామాకు చేర‌వేసేందుకు ఇండియా పోస్టల్‌వారికి అందించిన్న‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు.

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ప‌ర్వ‌దినం రోజున టికెట్లు పొందిన గృహ‌స్తుల గోత్ర నామాలు అర్చ‌క స్వాములు అమ్మ‌వారి మూల విరాట్టు పాదాల వ‌ద్ద ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. జూలై 31వ తేదీ ఉద‌యం 10.00 నుండి మ‌ధ్యాహ్న‌నం 12.00 గంటల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు జెఈవో తెలిపారు. వ్ర‌తంలో పాల్గొనే భ‌క్తులు అర్చ‌క స్వాముల సూచ‌న‌ల మేర‌కు త‌మ గోత్ర ‌నామాలు ప‌ఠించాల్సి ఉంటుంద‌న్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 24, 2020, 7:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading