HOME » NEWS » life-style » TRYING TO LOSE BELLY FAT NATURAL HIGH FIBER WEIGHT LOSS FOODS THAT FIGHT CRAVINGS NS NU

Health Tips: ఈ ఫుడ్ తింటే బెల్లీ ఫ్యాట్‌ ఖతం.. ఆ ఆహారమేంటో తెలుసుకోండి

బెల్లీఫ్యాట్‌ని తగ్గించుకునేందుకు బాగా కష్టపడుతున్నారా? అందుకోసం ఏమి తినకుండా వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడు చెప్పే ఆహారపదార్థాలను ఏంచక్కా తింటూనే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..

news18-telugu
Updated: November 20, 2020, 2:58 PM IST
Health Tips: ఈ ఫుడ్ తింటే బెల్లీ ఫ్యాట్‌ ఖతం.. ఆ ఆహారమేంటో తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బఠానీ: ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా, ప్రోటీన్, విటమిన్స్ కలిగిన ఇవి మీ డైట్‌లో చేర్చుకోవడంలో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. వీటిలోని ఫైబర్ జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.
చియా సీడ్స్: న్యూట్రియెంట్స్‌తో నిండిన చియా సీడ్స్‌ కూడా వెయిట్‌లాస్‌కి చక్కని ప్రత్యామ్నాయం. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. అందువల్ల పొట్ట తగ్గిపోతుంది.

బెర్రీస్: చూస్తేనే నోరూరిపోయే బెర్రీ ఫ్రూట్స్ కూడా బరువుని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో యాంటీయాక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే చక్కెరగుణాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే బరువు తగ్గిపోతారు.

చిక్కుళ్లు: బరువును తగ్గించడంలో చిక్కుళ్లు మంచి పాత్ర పోషిస్తాయి. కొంతవరకూ తినగానే ఇవి కడుపునిండిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే వీటిని మీ డైట్‌లో భాగం చేసుకుంటే బెల్లీ సమస్య ఉండనే ఉండదు.

ఈ వీడియో చూడండి...


జామ: పేదవాడి ఆపిల్‌గా పిలిచే జామలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. అదే విధంగా ఇందులోని గ్లైసమిక్ ఇండెక్స్ నిల్వలు బరువును తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం డయాబెటీస్ పేషెంట్స్‌కి మంచిది.
Published by: Nikhil Kumar S
First published: November 20, 2020, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading