Beauty tips: మీ చర్మం అందంగా మెరిసిపోవాలంటే... ఈ సోంపు గింజలతో ఫేస్​ ప్యాక్​ ప్రయత్నించండి

ప్రతీకాత్మక చిత్రం

చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా (Soft skin ) ఉంచుకుంటే మంచిది. సహజ సిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవాలంటే సోంపు గింజలతో సాధ్యం. అయితే ఆ ప్యాక్​ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Share this:
    చలికాలం (Winter). చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన కాలం. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ (External skin care) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో..  చర్మం సంరక్షణ (Skin protection) అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం (Skin ) పొడి బారి.. దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా (Soft skin ) ఉంచుకుంటే మంచిది. సహజ సిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా ఉంచుకోవాలంటే సోంపు గింజలతో సాధ్యం. అయితే ఆ ప్యాక్​ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

    చర్మం ప్రకాశవంతం కోసం సోంపు ఫేస్ ప్యాక్ (anise face pack) కూడా ప్రయత్నించవచ్చు. అరకప్పు వేడి నీటిలో టేబుల్ స్పూన్ సోంపు వేయాలి. అరగంట తర్వాత నీటిని వడపోసి సోంపు వేరు చేయాలి. ఆ నీటిలో టేబుల్ స్పూన్ ఓట్ మీల్, టేబుల్ స్పూన్ తేనె కలిపి మెత్తని పేస్ట్‌ (paste)లా తయారు చేసి ముఖానికి అప్లై (apply to face) చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం (clean) చేసుకొంటే సరిపోతుంది.

    సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి..

    గ్లాసు నీటిలో చెంచా సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి సోంపు నీరు తయారవుతుంది. దీన్ని ముఖం (face) శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. చర్మంపై ఉన్న మురికి, జిడ్డు, మృత‌క‌ణాలు.. వీటన్నింటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకొన్నప్పుడే చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. చర్మ రంధ్రాల్లో చేరిన మురికిని సోంపు గింజలతో తయారుచేసిన ప్రత్యేకమైన మిశ్రమంతో తొలగించవచ్చు.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?



    టీట్రీ ఎస్సెన్సియల్ ఆయిల్..

    గిన్నెలో వేడి నీరు పోసి.. అందులో పెద్ద చెంచాడు సోంపు వేసి 20 నిమిషాలు నానబెట్టాలి. చల్లారిన తర్వాత రెండు చుక్కల టీట్రీ ఎస్సెన్సియల్ ఆయిల్ సైతం కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి మూత గట్టిగా బిగించాలి. ఈ నీటిలో దూదిని ముంచి ..దానితో ముఖం తుడుచుకొంటే చర్మంపై చేరిన మురికి మొత్తం వదిలిపోతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
    Published by:Prabhakar Vaddi
    First published: