Home /News /life-style /

TREND CHANGED IN INDIAN RELATIONSHIPS PEOPLE INTERESTED IN PLATONIC RELATIONS IN PANDEMIC TIMES GH JNK

Platonic Friendship: భారత్​లో పెరుగుతున్న వర్చువల్​ ఫ్రెండ్​షిప్ ధోరణి.. సర్వేలో ఆసక్తికర విషయాలు

ఈ సంబంధాలు అంత మంచివి కావంటా.. (Twitter)

ఈ సంబంధాలు అంత మంచివి కావంటా.. (Twitter)

కరోనా మహమ్మారి ప్రజల ఆలోచనా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. లాక్​డౌన్​తో ప్రత్యక్ష బంధాలకు కాకుండా వర్చువల్​ బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తున్నది.

కరోనా మహమ్మారి ప్రజల ఆలోచనా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. లాక్​డౌన్​తో ప్రత్యక్ష బంధాలకు కాకుండా వర్చువల్​ బంధాలకు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా ప్రముఖ ఉమెన్​ సోషల్​ నెట్​వర్కింగ్​ యాప్​ ‘బంబుల్’ నిర్వహించిన ఒక సర్వేలో ఇదే విషయం బయటపడింది. ఎక్కువ మంది ప్రజలు ఆన్​లైన్‌లోనే స్నేహాలను ఏర్పర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని ఈ సర్వే తేల్చి చెప్పింది. రేపు (ఆగస్టు​ 1)న​ స్నేహితుల దినోత్సవం సందర్భంగా, బంబుల్​ ప్లాట్​ఫామ్​ ఈ ఆసక్తికరమైన సర్వేను నిర్వహించింది. సర్వేలో భాగంగా ఫ్రెండ్​షిప్​పై అభిప్రాయాలను తెలుసుకునేందుకు మెట్రో నగరాల్లో నివసించే యువత నుంచి డేటా సేకరించింది. ఈ సర్వేలో అనేక కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి.

సర్వేలో పాల్గొన్న వారిలో 28 శాతం మంది ఆన్‌లైన్‌లోనే కొత్త స్నేహితులను, స్నేహ బంధాలను ఏర్పర్చుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన పెద్ద మార్పుగా దీన్ని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో డేటా సేకరించగా.. అత్యధికంగా చెన్నైలో 32 శాతం మంది ఆన్​లైన్​ ఫ్రెండ్​షిప్​కు జైకొట్టారు. ఇక ముంబై, హైదరాబాద్​లోని 30 శాతం యువత సోషల్​ మీడియా ద్వారానే ఫ్రెండ్​షిప్​ ఏర్పర్చుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ప్రత్యక్ష సంబంధాలు తగ్గి, వర్చువల్​ బంధాలకు ప్రాధాన్యత పెరిగిందనేది ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రత్యక్షంగా కలవడం తగ్గిపోవడంతోనే..

ఈ సర్వే ఫలితాలను బంబుల్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పిత సమద్దర్ విడుదల చేశారు. నివేదిక గురించి మాట్లాడుతూ.. “లాక్​డౌన్​ సమయంలో చాలా మంది ఒంటరితనంతో సతమతమయ్యారు. అలాంటి వారికి సోషల్​ మీడియా వరంగా మారింది. చాలా మంది సోషల్​ మీడియాతోనే కొత్త వారితో పరిచయాలు ఏర్పర్చుకొని​ ఒంటరితనం నుంచి బయటపడ్డారు. సహజంగా మనకు వయసు పెరిగే కొద్దీ కొత్త స్నేహితులు ఎదురవుతుంటారు. స్కూల్​, కాలేజ్​, ఆఫీస్​ ఇలా అనేక ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే ఈ బిజీ లైఫ్​లో ఎక్కువ మంది స్పేహితులను ప్రత్యక్షంగా కలవడం చాలా కష్టతరమైన పని. అందుకే ఆన్​లైన్​లో కొత్త స్నేహితులను వెతికే ధోరణి బాగా పెరిగింది. మహమ్మారి కారణంగా ఇది మరింత విస్తృతమైంది. ఒక రకంగా ఇది కొత్త రకం స్నేహానికి నాంది పలికింది” అని వివరించారు.
Published by:John Naveen Kora
First published:

Tags: Pandemic time, Relationship

తదుపరి వార్తలు