హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Travel Tips: మన దేశంలోని ఈ ప్రదేశాల్లో ఉచితంగా ఉండొచ్చు.. వసతితో పాటు భోజనం కూడా..!

Travel Tips: మన దేశంలోని ఈ ప్రదేశాల్లో ఉచితంగా ఉండొచ్చు.. వసతితో పాటు భోజనం కూడా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Budget Travel Plans: నిత్యం వివిధ ప్రాంతాల్లో తిరిగే ట్రావెలర్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలలో పర్యటించాలని అనుకుంటున్నారు. అందుకోసం భోజనం, వసతికి తక్కువ ఖర్చయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. మరి మనదేశంలో ఉచితంగా ఉండగలిగే కొన్ని ప్రముఖ పర్యాటక స్థలాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

  కొందరికి కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లడం అంటే ఎంత ఇష్టం. అందుకే వీలుచిక్కినప్పుడల్లా ట్రిప్‌లకు వెళ్తుంటారు. మరికొందరు మాత్రం ట్రావెలింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. తామ తిరిగే ప్రాంతాల్లో వీడియోలు తీసి.. వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. తద్వారా ఆదాయం పొందుతున్నారు. ఐతే నిత్యం వివిధ ప్రాంతాల్లో తిరిగే ట్రావెలర్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలలో పర్యటించాలని అనుకుంటున్నారు. అందుకోసం భోజనం, వసతికి తక్కువ ఖర్చయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. మరి మనదేశంలో ఉచితంగా ఉండగలిగే కొన్ని ప్రముఖ పర్యాటక స్థలాల (Budget Travel Tips) గురించి ఇక్కడ తెలుసుకుందాం.

  1. ఇషా ఫౌండేషన్ (తమిళనాడు): ఇది కోయంబత్తూరు నుంచి 40 కి.మీ. దూరంలో ఉంటుంది. సద్గురు జగ్గీవాసు దేవ్‌ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటయింది. ఇక్కడ ఉండే ఆది యోగి విగ్రహం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఇషా ఫౌండేషన్ యోగా, పర్యావరణం, ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. మీరు ఇక్కడ ఉచితంగానే బస చేయవచ్చు.

  2. మణికరబ్ సాహిబ్ గురుద్వారా (హిమాచల్ ప్రదేశ్): మీరు హిమాచల్ ప్రదేశ్‌ సందర్శించాలనుకున్నట్లయితే.. మణికరబ్ సాహిబ్ గురుద్వారాలో ఉచితంగా బస చేయవచ్చు. ఇక్కడ ఉచిత పార్కింగ్‌తో పాటు భోజన, వసతి సదుపాయం కూడా ఉంది. మణికరబ్ సాహిబ్ గురుద్వారా పార్వతి నది సమీపంలో ఉంటుంది.


  3. ఆనందాశ్రమం (కేరళ): అందనమైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ఆనందాశ్రమలో ఉండడం ఒక మరుపురాని విభిన్నమైన 4. అనుభూతిని కలిగిస్తుంది. మీరు ఈ ఆశ్రమంలో ఉచితంగా ఉండవచ్చు. రోజుకు మూడు సార్లు భోజనం చేయవచ్చు. తక్కువ మసాలాలతోనే ఇక్కడ ఆహార పదార్థాలను వండుతారు.

  4. గీతా భవన్ (రిషికేశ్): రిషికేశ్‌లో పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న గీతా భవన్‌లో యాత్రికులు ఉచితంగా బస చేయవచ్చు.అంతేకాదు ఆహారం కూడా ఉచితంగా లభిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుల కోసం ఇక్కడ 1000 ఉచిత గదులున్నాయి. యోగా, సత్సంగ సెషన్లు కూడా ఉంటాయి.

  Healthy Snacks: సాయంత్రం స్నాక్స్‌గా జంక్‌ ఫుడ్‌ తింటున్నారా..? అయితే, మీ పని ఖతం.. ఇదిగో ఈ హెల్తీవి ట్రై చేయండీ..!

  5. గోవింద్ ఘాట్ గురుద్వారా (ఉత్తరాఖండ్): ఇది ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో అలకనంద సమీపంలో ఉంటుంది. హిమాలయాల అందలు చూసేందుకు పర్యాటకులు, ట్రెక్కర్లు, భక్తులు ఇక్కడ ఉచితంగా బస చేయవచ్చు. గురుద్వారా నుంచి అందమైన హిమాలయ పర్వాలను వీక్షించవచ్చు.

  6. నైంగ్‌మాప మానెస్టరీ (హిమాచల్ ప్రదేశ్): ఈ మఠం హిమాచల్ ప్రదేశ్‌లోని రేవల్‌సర్‌లో రేవల్‌సర్ నదీ ఒడ్డున ఉంది. ఈ అందమైన ఆశ్రమంలో నివసించడానికి రోజుకు రూ.200 నుంచి 300 మాత్రమే చార్జిచేస్తారు. దీనికి సమీపంలోనే మార్కెట్ ఉంటుంది. అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు.

  7. టిబెటన్ బౌద్ధ విహారం (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ చారిత్రక ఆశ్రమంలో ఒక రాత్రి ఉండేందుకు రూ.50వేలు మాత్రమే వసూలు చేస్తారు. ఇక్కడ బౌద్ధుని రూపమైన శాక్యముని విగ్రహం ఉంటుంది. ఈ ఆశ్రమాన్ని లధన్ చోట్రుల్ మొనాలం చెనామో ట్రస్ట్ నిర్వహిస్తుంది.

  8. తిరుమల (ఆంధ్రప్రదేశ్): కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో కూడా భక్తులు ఉచిత వసతి,భోజన సదుపాయం పొందవచ్చు. యాత్రికులకు బస చేసేందుకు ఉచిత డార్మెటరీలు ఉన్నాయి. తిరుమలలో ఉన్న సత్రంలో ఉచితంగానే భోజనం చేయవచ్చు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Best tourist places, Life Style, Lifestyle, Tourism

  ఉత్తమ కథలు