TRAVEL DESTINATIONS FOR COLLEGE GOING STUDENTS PVN
Travel Guide for Students : ఖర్చు తక్కువ,ఆనందం ఎక్కువ.. కాలేజీ విద్యార్థులు వెళ్లేందుకు దేశంలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
Travel destinations : స్నేహితులతో కలిసి ట్రిప్ కి వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే విద్యార్థులు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని కలలు కంటుంటారు. పాకెట్ మనీపై మాత్రమే ఆధారపడే విద్యార్థులకు బడ్జెట్లో మంచి టూరిస్ట్ ప్లేస్ ని సెలక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది.
Travel Guide for Students : ఫ్యామిలీతో కలిసి ట్రిప్(Trip)కి వెళ్లడం అనేది జీవితంలో చిరస్మరణీయమైన క్షణాలలో ఒకటి. అయితే స్నేహితులతో కలిసి ట్రిప్ కి వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే విద్యార్థులు(College Students) స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని కలలు కంటుంటారు. పాకెట్ మనీపై మాత్రమే ఆధారపడే విద్యార్థులకు బడ్జెట్లో మంచి టూరిస్ట్ ప్లేస్ ని సెలక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా కళాశాల విద్యార్థి అయితే...తక్కువ డబ్బుతో కూడా ఎక్కువ ఆనందం పొందడానికి ఎక్కడికి వెళితే బాగా ఉంటుంది అని వెతుకుతున్నట్లయితే కొన్ని అందమైన, సాహసోపేతమైన మీకు ఉత్తమ ప్రయాణ గమ్యస్థానంగా(Best Travel Destination) ఉంటాయి. మీకు ఉత్తమ ప్రయాణ గమ్యస్థానంగా ఉండే ఆ ప్రాంతాలు ఏంటో చూడండి.
లడఖ్
కాలేజీకి వెళ్లే విద్యార్థికి లడఖ్‌కు వెళ్లడం ఒక ముఖ్య కోరికగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి బైక్ పై లడఖ్ వెళ్లాలని చాలామంది లాగే కాలేజీ విద్యార్థులు కూడా కలలు కంటుంటారు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ తో గుంపులుగా ప్రయాణించడానికి, బైక్ రైడింగ్ చేయడానికి ఇష్టపడే వారికి లడఖ్ అత్యుత్తమ ప్రదేశం. మనాలి-లేహ్ హైవేలో బైకింగ్ నుండి నుబ్రా వ్యాలీ, పాంగోంగ్ సరస్సు, సో మోరిరి సరస్సు ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు. లడఖ్ కు చేరుకోవానికి రెండు రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలీ గుండా లడఖ్ చేరుకోవడం..ఇంకోటి కశ్మీర్(వయా శ్రీనగర్)మీదుగా లడఖ్ చేరుకోవడం. మీరు లడఖ్ ట్రిప్ ఫ్లాన్ చేసుకుంటే మనాలీ మీదుగా లడఖ్ వెళ్లి శ్రీగర్ మీదుగా రిటర్న్ అవడం చాలా బెటర్.
మనాలిలో సరదాగా
మనాలి.. కాలేజీ స్టూడెంట్స్ ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటి. క్యాంపింగ్, అడ్వెంచర్స్, బోన్ ఫైర్లను ఆస్వాదించడానికి ఇష్టపడే యువతకు మనాలి పర్యటనను ప్లాన్ చేసుకోవడం చాలా గుర్తుండిపోతుంది. ఇక్కడ ఉన్న అటల్ టన్నెల్ మరియు సోలాంగ్ వ్యాలీ సందర్శన మీకు కొత్త అనుభూతి కలిగిస్తుంది.
రాజస్తాన్ రాష్ట్రంలోని రణథంబోర్ నేషనల్ పార్క్ లో జంగిల్ సఫారీ అద్భుతంగా ఉంటే. ఈ నేషనల్ పార్క్‌లో మీ కాలేజీ గ్రూప్‌తో కలిసి సరదాగా గడపడం వల్ల మీ ట్రిప్‌ను ఉత్తమంగా మార్చుకోవచ్చు.
గోవా
సముద్రపు దృశ్యాన్ని చూడడానికి, బీచ్‌లో ఆనందించడానికి ఇష్టపడే యువతకు గోవా ట్రిప్ ప్లాన్ చేయడం బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా నైట్ లైఫ్, పార్టీలని ఇష్టపడే యువత కోసం... గోవాలో క్రీడలు, ఫిషింగ్, క్రూయిజ్ పార్టీ, డాల్ఫిన్ టూర్ వంటి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, గోవా మీకు సరైన గమ్యస్థానంగా ఉంటుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.